హత్య, కిడ్నాప్ల కింద కేసు నమోదు | Murder and kidnap case registered : seshachalam Counter | Sakshi
Sakshi News home page

హత్య,కిడ్నాప్ల కింద కేసు నమోదు : శేషాచలం ఎన్కౌంటర్

Published Wed, Apr 15 2015 8:52 PM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM

శేషాచలం అడవుల్లో మృతి చెందిన ఎర్రచందనం కూలీలు - Sakshi

శేషాచలం అడవుల్లో మృతి చెందిన ఎర్రచందనం కూలీలు

హైదరాబాద్:  చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కూలీలపై జరిగిన ఎన్కౌంటర్కు సంబంధించి చంద్రగిరి పోలీస్ స్టేషన్లో హత్య, కిడ్నాప్ల కింద కేసులు నమోదు చేశారు.  ఈ నెల 7వ తేదీ తెల్లవారుజామున జరిగిన ఎదురు కాల్పులలో 20 మంది కూలీలు చనిపోయిన విషయం తెలిసిందే. చంద్రగిరి మండలం శ్రీవారిమెట్లు, శ్రీనివాస మంగాపురం సమీపంలోని ఈతగుంట, ఈత పాకుల కోన పరిసర ప్రాంతాల్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది.   సచ్చినోడి బండ ప్రాంతంలో 11 మంది, ఈతగుంట సమీపంలోని చీకటీగల కోనలో 9 మంది మృతిచెందారు.

 మృతుడు శశికుమార్ భార్య మునియమ్మాళ్  ఈనెల 11న చెన్నై నుంచి  స్పీడ్ పోస్ట్  ద్వారా చంద్రగిరి పోలీస్ స్టేషన్కు   ఫిర్యాదు పంపారు. ఆ ఫిర్యాదు 12న స్టేషన్కు చేరింది.  తన భర్త శశికుమార్ను ఎన్కౌంటర్లో కాల్చి చంపారని ఆమె ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు ఐపీసి 302, 364 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

 ఇదిలా ఉండగా,  ఈరోజు ఈ కేసు విచారణ సందర్భంగా మునియమ్మాల్  హైకోర్టుకు హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆమెను ప్రతి వాదిగా చేర్చాలని హైకోర్టు ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement