తమిళ కూలీలను పట్టుకొచ్చి.. కాల్చి చంపారని జాతీయ మానవహక్కుల సంఘాలు ఆరోపించాయి. బాధ్యులపై హత్యకేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి.
తమిళ కూలీలను పట్టుకొచ్చి.. కాల్చి చంపారని జాతీయ మానవహక్కుల సంఘాలు ఆరోపించాయి. బాధ్యులపై హత్యకేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి. చిత్తూరు జిల్లా శేషాలచం ప్రాంతంలోని ఎన్కౌంటర్ ఘటనా స్థలిని జాతీయ మానవ హక్కుల సంఘం నేతలు పరిశీలించారు. మొత్తం 40 మంది బృందంతో ఈ నేతలు వచ్చారు. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్, పీపుల్స్ యూనియన్ ఫర్ డెమొక్రాటిక్ రైట్స్, సీసీపీఎల్, పీడీఎఫ్ నేతలతో పాటు పలు జాతీయ హక్కుల సంఘాలకు చెందిన ప్రతినిధులు శేషాలచం వచ్చారు.
ఇది బూటకపు ఎన్కౌంటరేనని స్పష్టం చేశారు. ఇందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీజీపీ జేవీ రాముడు, టాస్క్ఫోర్స్ డీఐజీ కాంతారావు, ఎన్కౌంటర్ చేసిన పోలీసులు బాధ్యత వహించాల్సి ఉందని అన్నారు. వీరందరిపై హత్యకేసు నమోదు చేయాలని డిమాండు చేశారు.