'శేషాచలం ఎన్కౌంటర్ బాధితులకు రూ. 5 లక్షల పరిహారం' | nhrc suggests rs. 5 lakhs compensation to seshachalam encounter victims | Sakshi
Sakshi News home page

'శేషాచలం ఎన్కౌంటర్ బాధితులకు రూ. 5 లక్షల పరిహారం'

Published Fri, May 29 2015 2:23 PM | Last Updated on Sun, Sep 3 2017 2:54 AM

'శేషాచలం ఎన్కౌంటర్ బాధితులకు రూ. 5 లక్షల పరిహారం'

'శేషాచలం ఎన్కౌంటర్ బాధితులకు రూ. 5 లక్షల పరిహారం'

జాతీయ మానవ హక్కుల సంఘం సిఫార్సు
ఎన్కౌంటర్పై సీబీఐ విచారణ జరపాలని సూచన


చిత్తూరు
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల వంతున పరిహారం ఇవ్వాలని జాతీయ మానవహక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) సిఫార్సు చేసింది. శేషాచలం ఎన్కౌంటర్పై సీబీఐ విచారణ జరపాలని తెలిపింది. ఏప్రిల్ ఏడో తేదీన శేషాచలం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది ఎర్రచందనం కూలీలు మృతిచెందిన విషయం తెలిసిందే. దీనిపై తమిళనాడులోని పార్టీలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశాయి. చెన్నై సహా తమిళనాడులో ఆంధ్రా ఆస్తులపై దాడులు జరిగాయి. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు కూడా చాలా కాలం పాటు నిలిచిపోయాయి.


ఎన్కౌంటర్ ప్రాంతాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం మే 12న పరిశీలించింది. ఎన్హెచ్ఆర్సీ సభ్యుడు దత్తు నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాల్లో పరిశీలించింది. సచ్చినోడిబండ, చిగటీగలకోన ప్రాంతాల్లో ఈ బృందం పర్యటించింది. వివిధ శాఖల నుంచి నివేదికలు తెప్పించుకుని, స్థానిక పరిస్థితులను కూడా పరిశీలించిన తర్వాత ఇప్పుడు తన నివేదికను వెల్లడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement