ఏపీ సర్కారు సహకరించట్లేదు: ఎన్హెచ్ఆర్సీ | andhra pradesh government is not giving documents, says nhrc member | Sakshi
Sakshi News home page

ఏపీ సర్కారు సహకరించట్లేదు: ఎన్హెచ్ఆర్సీ

Published Fri, May 29 2015 4:41 PM | Last Updated on Sat, Jun 2 2018 2:36 PM

ఏపీ సర్కారు సహకరించట్లేదు: ఎన్హెచ్ఆర్సీ - Sakshi

ఏపీ సర్కారు సహకరించట్లేదు: ఎన్హెచ్ఆర్సీ

చిత్తూరు జిల్లా శేషాచలం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ ఘటనకు సంబంధించి అవసరమైన డాక్యుమెంట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం లేదని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) సభ్యుడు జస్టిస్ మురుగేశన్ తెలిపారు. కేసు కోర్టు విచారణలో ఉన్నందున డాక్యుమెంట్లు ఇవ్వలేమని ఏపీ ప్రభుత్వం చెబుతోందన్నారు.

శేషాచలం ఎన్కౌంటర్పై సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా తాము సిఫార్సు చేశామని ఆయన తెలిపారు. అలాగే, ఎన్కౌంటర్లో మరణించినవారి కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పున మధ్యంతర పరిహారం ఇవ్వాలన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టంలో సెక్షన్ 164 కింద ప్రత్యేక పరిహారం ఇవ్వాలని మురుగేశన్ చెప్పారు. ఈ కేసులో సాక్షులకు తమిళనాడు ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement