nhrc member
-
జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యురాలిగా విజయభారతి
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యురాలిగా విజయభారతి సాయని బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ అరుణ్‌కుమార్ మిశ్రా సమక్షంలో గురువారం ఆమె బాధ్యతలు చేపట్టారు. న్యాయవాది, సామాజికవేత్త అయిన విజయభారతిని ఎన్హెచ్ఆర్సీ సభ్యురాలిగా నియమిస్తూ ఈ నెల 27న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్రపతి ముర్ముకు ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తా నని విజయభారతి పేర్కొన్నారు. -
ఏపీ సర్కారు సహకరించట్లేదు: ఎన్హెచ్ఆర్సీ
చిత్తూరు జిల్లా శేషాచలం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ ఘటనకు సంబంధించి అవసరమైన డాక్యుమెంట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం లేదని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) సభ్యుడు జస్టిస్ మురుగేశన్ తెలిపారు. కేసు కోర్టు విచారణలో ఉన్నందున డాక్యుమెంట్లు ఇవ్వలేమని ఏపీ ప్రభుత్వం చెబుతోందన్నారు. శేషాచలం ఎన్‌కౌంటర్‌పై సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా తాము సిఫార్సు చేశామని ఆయన తెలిపారు. అలాగే, ఎన్కౌంటర్లో మరణించినవారి కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పున మధ్యంతర పరిహారం ఇవ్వాలన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టంలో సెక్షన్ 164 కింద ప్రత్యేక పరిహారం ఇవ్వాలని మురుగేశన్ చెప్పారు. ఈ కేసులో సాక్షులకు తమిళనాడు ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఆయన సూచించారు.