శేషాచలం ఎదురు కాల్పుల అంశంపై రాజ్యసభలో గురువారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాంటి ప్రతిపాదన లేనందున కేంద్ర దర్యాప్తు సంస్థతో ఎలాంటి దర్యాప్తు చేయించలేమని చెప్పారు. ఎదురుకాల్పులపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్నాయని తెలిపారు. ఏపీ సర్కారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించిందని అన్నారు