
'ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు రండి'
ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు ఒత్తిడి తీసుకురావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె. నారాయణ డిమాండ్ చేశారు.
ఒంగోలు: శేషాచలం ఎన్కౌంటర్ పచ్చి బూటకమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె. నారాయణ ఆరోపించారు. బూటకపు ఎన్ కౌంటర్ కాబట్టే ఘటనాస్థలికి ప్రజాసంఘాలను వెళ్లనివ్వడం లేదని విమర్శించారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పూటకో మాట మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటికి వచ్చైనా చంద్రబాబు ఆంధ్రుల ప్రయోజనాలు కాపాడాలని అన్నారు.