ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో 20 మంది కూలీల మరణం అంశంపై సభలో చర్చిచంఆలని రాజ్యసభ సభ్యులు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో 20 మంది కూలీల మరణం అంశంపై సభలో చర్చిచంఆలని రాజ్యసభ సభ్యులు డిమాండ్ చేశారు. సభ సమావేశం కాగానే సీపీఐ సభ్యుడు డి.రాజా తాను 267వ నిబంధన కింద నోటీసు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఎజెండాను సస్పెండ్ చేసి, ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 7వ తేదీన 20 మంది కార్మికులను హతమార్చిన అంశంపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై సావధాన తీర్మానానికి నోటీసు ఇస్తే పరిగణిస్తామని డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ చెప్పారు.
అయితే.. నెట్ న్యూట్రాలిటీ అంశంపై మే 6వ తేదీలోగా సావధాన తీర్మానం చేపట్టాలని టీఎంసీ సభ్యుడు డెరిక్ ఓబ్రెయిన్ గుర్తుచేశారు. అంతకుముందు ఏప్రిల్ 21న బీహార్లో తుపాను కారణంగా 48 మంది మరణించిన అంశాన్ని చైర్మన్ హమీద్ అన్సారీ ప్రస్తావించి వారికి సంతాపం తెలిపారు.