హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థికే తాను ఓటు వేయనున్నట్లు లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ తెలిపారు. టీడీపీకే తాము ఓటు వేస్తామని నామినేషన్ల సమయంలోనే జేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు సీపీఐ కూడా టీఆర్ఎస్ అభ్యర్థి కేశవరావుకు ఓటు వేసింది.
ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన ముగ్గురు అభ్యర్థులకు 46, 46, 47 ఓట్లుగా కేటాయించినట్లు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. ఒకో శాసనసభ్యుడు ఒకరికి మాత్రమే ఓటు వేయాలని అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు...తమ అభ్యర్థులకే ఓటు వేస్తారని చెప్పారు. అలాగే టీడీపీ కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరికి ఓటు వేయాలో సీల్డ్ కవర్లో సూచించింది.