
'చంద్రబాబు ఉండగానే అదంతా జరిగింది'
విశాఖపట్టణం: రెండు తెలుగు రాష్ట్రాల్లో స్మగ్గర్ల పరిపాలన నడుస్తోందని ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కన్వీనర్, విరసం నేత వరవరరావు ధ్వజమెత్తారు. స్మగ్గర్ల లాంటి పెట్టుబడిదారుల చేతుల్లో ప్రభుత్వాలు నడుస్తున్నాయని విమర్శించారు. శే
షాచల అడవుల్లో అమాయకపు కూలీలను పట్టుకుని కాల్చి చంపారని ఆరోపించారు. ఇదంతా చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ఉండగానే జరిగిందని అన్నారు. 302 హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ మైనింగ్ తమవాళ్లకు కట్టబెట్టడానికి 2000 నుంచి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వరవరరావు ఆరోపించారు.