చిత్తూరు: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులో మళ్లీ ఉద్రికత్త పరిస్థితులు తలెత్తాయి. శేషాచలం ఎన్ కౌంటర్ కు నిరసనగా తడ, గుమ్మడిపూడి ప్రాంతాల్లో ఏపీ బస్సులపై తమిళులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 3 బస్సులు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.
దీనికి ప్రతీకారంగా తమిళనాడు బస్సులను వరదయ్యపాలెం వద్ద సరిహద్దు గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. ఈ నెల మొదటి వారంలో చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో 20 మంది కూలీలు మృతి చెందిన సంగతి తెలిసిందే.
ఏపీ బస్సులపై తమిళుల దాడి
Published Mon, Apr 20 2015 10:45 PM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM
Advertisement
Advertisement