
'ఏపీ, తమిళనాడు చర్చలు జరుపుతున్నాయి'
పామర్రు: శేషాచలం ఎన్కౌంటర్ ఘటనపై ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నాయని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య తెలిపారు. సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కారమవుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పామర్రులో ఆదివారం జరిగిన ఆర్యవైశ్య యువజన సమైక్య నూతన కమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు.
చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్ లో 20 మంది కూలీలు ప్రాణాలు కోల్పయిన సంగతి తెలిసిందే. ఎన్‌కౌంటర్ కు నిరసనగా తమిళనాడులో ఏపీకి చెందిన వారి ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి. ఎన్‌కౌంటర్ పై సమగ్ర విచారణ జరిపించాలని ఏపీ ప్రభుత్వాన్ని తమిళనాడు సర్కారు డిమాండ్ చేసింది.