న్యూఢిల్లీ: చిత్తూరు జిల్లా శేషాచలం ఎన్కౌంటర్ సాక్షులకు, పరిధిలోని ఆయా గ్రామాల సర్పంచులకు రక్షణ కల్పించాలని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సీఆర్పీసీ 176 ప్రకారం ఎన్కౌంటర్పై జ్యుడిషియల్ మేజిస్ట్రేట్తో విచారణ జరిపించాలని పేర్కొంది. సోమవారం ఎన్హెచ్ఆర్సీ శేషాచలం ఎన్కౌంటర్ కేసును విచారించింది. ఈ నెల 23న హైదరాబాద్లో ఈ కేసు తదుపరి విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించింది.
ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులు, అటవీ అధికారుల పేర్లను వెల్లడించాలని ఎన్హెచ్ఆర్సీ సూచించింది. ఎన్కౌంటర్లో ఉపయోగించిన ఆయుధాలను సీజ్ చేయాలని, ఎఫ్ఐఆర్, డైరీ ఇతర వివరాల్ని భద్రపరచాలని ఆదేశించింది. 2010 పోస్ట్మార్టం నిబంధనల ప్రకారం పోస్ట్మార్టం ప్రక్రియను వీడియో తీయాలని సూచించింది. శేషాచలం ఎన్కౌంటర్ ప్రత్యక్ష సాక్షులు శేఖర్, బాలచంద్ర మీడియా ముందుకు వచ్చారు. మూడో సాక్షి వాంగ్మూలాన్ని ఎన్హెచ్ఆర్సీ హైదరాబాద్లో తీసుకోనుంది. ఈ వివరాలను ఎన్హెచ్ఆర్సీ న్యాయవాది బృందా గ్రోవర్ వెల్లడించారు.
'చిత్తూరు ఎన్కౌంటర్ సాక్షులకు రక్షణ కల్పించండి'
Published Mon, Apr 13 2015 6:16 PM | Last Updated on Sun, Sep 3 2017 12:15 AM
Advertisement