► ఆర్థిక సాయం చేయండి
► ప్రధానికి సీఎం ఎడపాడి వినతి
► నేడు రాష్ట్రపతిని కలవనున్న పన్నీర్‌సెల్వం, ఎంపీలు
► జయ మరణంపై సీబీఐ దర్యాప్తుకు వినతి
► న్యాయనిపుణులతో దినకరన్ చర్చలు
ప్రకృతి ప్రకోపానికి గురై కొట్టుమిట్టాడుతున్న తమిళనాడుకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి చెందిన పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రధానికి అందజేశారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై:ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఎడపాడి పళని స్వామి సోమవారం తొలిసారిగా ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పని లోపనిగా రాష్ట్ర సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కరువుకాటకాలు, వర్ద తుపాను దెబ్బతో రా ష్ట్రం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటు న్న సంగతిని వివరించానని ఆయన అన్నారు. తమిళ ప్రజల జల్లికట్టు కోర్కె సాధనకై రాష్ట్రం జారీచేసిన ఆర్డినెన్స్ ఆమోదంపై ప్రధానికి ధన్యవాదాలు తెలిపానని అన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రాష్ట్రంలో కరువు నెలకొని, పచ్చనిపొలాలు ఎండిపోతున్నట్లు ప్రధాని దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు.
కరువు సహాయకంగా గతం లో కోరిన రూ.39,565 కోట్లు, వర్ద తుపాను సహాయం కింద రూ.22,573 కోట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వా రా రాష్ట్రానికి చెందాల్సిన రూ.17,333 కోట్లు వెంటనే విడుదల చేయాల్సిం దిగా సీఎం కోరారు. నీట్ ప్రవేశపరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలని, కావేరి ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. తమిళనాడులో సాగు, తాగునీటి కొరతలను తీర్చేందుకు మహానది, గోదావరి, కృష్ణా, పెన్న, పాలారు, కావేరి, వైగై తదితర నదులను అనుసంధానం చేయాల్సిందిగా కోరారు.
జాలర్ల సంక్షేమం కోసం 1,650 కోట్లు కేటాయించాలని, శ్రీలంక చెరలో ఉన్న 35 మంది తమిళ జాలర్లను, 120 మరపడవలను విడిపించాలని, శ్రీలంక కారణంగా చేపల వేటకు ఏర్పడుతున్న అడ్డంకులను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. కూడంకుళంలో ఉత్పత్తయ్యే రెండువేల మెగావాట్ల విద్యుత్‌ను పూర్తిగా తమిళనాడుకు కేటాయించాలని కోరారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద తమిళనాడుకు అదనంగా నెలకు 85వేల మెట్రిక్ టను్నల బియా్యన్ని రాయితీపై సరఫరా చేయాలని కోరారు. సముద్ర జలాలను తాగునీటిగా మార్చే నిర్లవీకరణ పథకం అమలుకు వెంటనే అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. పలువురు మంత్రులు సీఎం వెంట ఢిల్లీ వెళ్లారు.
రాజధానిలో రాష్ట్ర పంచాయితీ
ఒకే ఒరలో రెండు కతు్తల్లా అన్నాడీఎంకేపై రెండు గ్రూపుల ఆధిపత్య పోరుపై పంచాయితీ రాజధానికి చేరుకుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని, హోం మంత్రిలను కలుసుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం బృందం సోమవారం ఢిల్లీకి చేరుకుంది. చిన్నమ్మ పదవిని కాపాడేందుకు ఆమె సోదరి కుమారుడు, ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ న్యాయనిపుణులతో చర్చల్లో మునిగి తేలుతున్నారు.
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత పార్టీ రెండుగా చీలిపోగా ఒకరినొకరు బహిష్కరించుకున్నారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని పన్నీర్‌సెల్వం వర్గం వాదిస్తోంది. శాశ్వత ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన జయలలిత చేత ప్రిసీడియం చైర్మన్ గా నియమితులైన మధుసూదన్ పన్నీర్‌సెల్వం వైపున్న కారణంగా పార్టీ తమదేనని వాదిస్తున్నారు. పది మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీలు పన్నీర్ పక్షాన నిలవగా, మెజార్టీ ఎమ్మెల్యేలతో విశ్వాస పరీక్షను నెగ్గిన శశికళ వర్గం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అధికారం, పదవుల్లో ఉండేవారంతా శశికళ వైపు ఉండగా, పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం నుంచి క్షేత్రస్థాయి కార్యకర్త వరకు పన్నీర్‌సెల్వంను ఆదరిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వర్గాన్ని మరొకరు తమవైపు లాకు్కనేందుకు తీవ్రస్థాయి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఐదేళ్లు వరుసగా ప్రాథమిక సభ్యత్వం లేని శశికళను ప్రధాన కార్యదర్శిగా ఎను్నకోవడం చెల్లదనే ఫిర్యాదు ఎన్నికల కమిషన్ పరిశీలనలో ఉంది. శశికళ నియామకంపై అడ్డంకులు తలెత్తకుండా పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు.
శశికళ ఎంపిక చెల్లదని ఎన్నికల కమిషన్ ప్రకటించినట్లయితే పన్నీర్‌సెల్వం తదితరులను పార్టీ నుంచి బహిష్కరించిన ఆదేశాలు చెల్లకుండా పోతాయి. అంతేగాక టీటీవీ దినకరన్ నియాకం కూడా చెల్లదు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొవాల్సి ఉండగా రెండాకుల చిహ్నం ఎవరిదనే చికు్కముడి ఉంది. చట్టపరవైున చికు్కల్లో ఉన్న శశికళ వర్గీయులను మరిన్ని చికు్కలో్లకి నెట్టేందుకు పన్నీర్‌సెల్వం ఢిల్లీ పయనం అయా్యరు. అంతకు ముందు సేలం జిల్లా నేతలో పన్నీర్‌సెల్వం సమావేశమై శశికళ ఆధిపత్యాన్ని తిప్పికొట్టడం ఎలా అంశంపై అభిప్రాయాలు సేకరించారు. జయలలిత అనుమానాస్పద మరణంపై సీబీఐ విచారణ కోరుతూ మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వినతిపత్రం సమర్పించనున్నారు. అలాగే ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లను కలుస్తున్నారు. పన్నీర్‌వెంట 12 మంది ఎంపీలు ఢిల్లీకి వెళ్లారు.