palanisvami
-
Tamil Nadu: పన్నీరు సెల్వంకు మరో షాక్
అన్నాడీఎంకే నేత పన్నీరు సెల్వంకు మరో షాక్ తగిలింది. ఆధిపత్య పోరులో తనకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని భావించిన ఆయనకు నిరాశే మిగిలింది. ఓపీఎస్‌కు హ్యాండిచ్చే విధంగా ప్రస్తుతం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాలలో తాము జోక్యం చేసుకోబోమని, ఇది వారి వ్యక్తిగతం అని అమిత్ షా స్పష్టం చేయడం పన్నీరు శిబిరాన్ని కలవరంలో పడేసింది. సాక్షి, చైన్నె: అన్నాడీఎంకేలో పన్నీరు సెల్వం, పళణి స్వామి మధ్య జరుగుతున్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, న్యాయ పోరాటం, ఎన్నికల కమిషన్ ఉత్తర్వులతో అన్నాడీఎంకేను పళణి స్వామి పూర్తిగా తన గుప్పెట్లోకి తె చ్చుకున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టి ఢి ల్లీ వెళ్లిన ఆయన అక్కడి పెద్దల ఆశీస్సులు అందుకున్నారు. అదే సమయంలో కేంద్రం తనకు అనుకూలంగా ఉంటుందని, వారి ద్వారా పళని స్వామికి చెక్ పెట్టవచ్చనున్న ధీమాతో ఆ పార్టీ సమన్వయ కమిటీ పన్నీరు సెల్వం ఉంటూ వస్తున్నారు. చర్చకు ముగింపు.. ఢిల్లీ పర్యటన సందర్భంగా పళని స్వామికి అమిత్ షా హిత బోధ చేసినట్టు పన్నీరు సెల్వంతో పాటుగా మిగిలిన వారిని కలుపుకుని వెళ్లాలని క్లాస్ తీసుకున్నట్లుగా కొన్ని మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. దీనిపై పెద్దఎత్తు చర్చలు సాగడంతో పన్నీరు శిబిరంలో ఆనందడోలికల్లో తేలింది. కేంద్రం ద్వారా మళ్లీ అన్నాడీఎంకేను కై వసం చేసుకోవచ్చనే ధీమాతో తన బలాన్ని చాటే ప్రయత్నాలను పన్నీరు వేగవంతం చేశారు. అలాగే కేంద్రం ద్వారా పళణి స్వామితో రాయబారాలు జరపడం లేదా, కోర్టు తుది తీర్పు వ్యవహారంలో కేంద్రాన్ని ఆశ్రయించడం వంటి ఎత్తుగడలతో పన్నీరు ముందుకెళ్లారు. అయితే ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. పన్నీరు శిబిరానికి పెద్ద షాక్ ఇచ్చే విధంగా , తాజాగా జరుగుతున్న చర్చకు ముగింపు పలికే రీతిలో బెంగళూరులో అమిత్ షా ఓ మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. జోక్యం చేసుకోం.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడీఎంకే అంతర్గాత వ్యవహారాల్లో బీజేపీ జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. అది వారి అంతర్గత వ్యవహారం, ఇందులో ఒకరిపై ఒత్తిడి తీసుకు రావాల్సినంత అవసరం తమకు లేదన్నారు. వారి మధ్య సమస్యలు, వివాదాలను వాళ్లే పరిష్కరించుకోవాలే గానీ మధ్యవర్తులు ఉండ కూడదని వ్యాఖ్యానించారు. ఓ పార్టీ వ్యవహారంలో జోక్యం చేసుకుని రాజకీయాలు చేయాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. పన్నీరు సెల్వం వ్యవహారంలో అన్నాడీఎంకేనే నిర్ణయం తీసుకోవాలి. తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంటూ ఆయన చర్చకు ముగింపు పలికారు. ఈ వ్యాఖ్యలు పన్నీరు సెల్వం శిబిరాన్ని షాక్‌కు గురి చేసింది. అదే సమయంలో పళని స్వామి శిబిరంలో జోష్‌ను నింపింది. వందే భారత్‌లో పళణి అమిత్ షా వ్యాఖ్యలు ఉదయాన్నే పళణి శిబిరంలో జోష్‌ను నింపాయి. ఇదే ఊపులో పళణి స్వామి ఆనందంగా వందే భారత్ రైలులో ప్రయాణించారు. సేలం నుంచి ఆయన వందే భారత్ రైలులో పర్యటించారు. ఈ సమయంలో ఆయనతో అనేక మంది ప్రయాణికులు సెల్పీలు దిగడం విశేషం. -
పన్నీర్ సెల్వానికి మరో షాక్.. ఇద్దరు కుమారులపైనా వేటు
చెన్నై: తమిళనాడు ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వానికి(ఓపీఎస్) మరో షాక్ తగిలింది. అన్నాడీఎంకే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఓపీఎస్‌ను తొలగించిన కొద్ది రోజుల్లోనే ఆయన కుమారులు సహా మరో 16 మందిపై బహిష్కరణ వేటు వేశారు పార్టీ తాత్కాలిక జనరల్ సెక్రెటరీ పళనిస్వామి(ఈపీఎస్). క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పన్నీరు సెల్వం వర్గంపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. పన్నీరు సెల్వం కుమారులైన.. థేని లోక్‌సభ నియోజకవర్గ సభ్యుడు రవీంద్రనాథ్, జయప్రదీప్, మాజీ మంత్రి వెల్లమండి ఎన్ నటరాజన్‌లను బహిష్కరించినట్లు పార్టీ తెలిపింది. వారితో పాటు శాసనసభ మాజీ సభ్యులు, ఎంపీలు మొత్తం మరో 15 మంది ఉన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు పళనిస్వామి. మొత్తం 18 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని, వారంతా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అందుకే వారి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయాల్సి వచ్చినట్లు చెప్పారు. కొద్ది రోజుల క్రితం నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో.. ద్వంద్వ నాయకత్వాన్ని రద్దు చేశారు. పార్టీకి ఏకైక తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి(ఈపీఎస్)ను ఎన్నుకున్నారు. దీంతో పార్టీ పగ్గాలు పళనిస్వామి చేతుల్లోకి చేరాయి. పన్నీర్ సెల్వాన్ని పార్టీ ముఖ్య పదవులు, సభ్యంత్వం నుంచి తొలగిస్తూ అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ తీర్మానించింది. ఓపీఎస్‌పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇదీ చూడండి: AIADMK General Body Meet: పన్నీర్ సెల్వానికి భారీ షాక్.. పళనికి పార్టీ పగ్గాలు -
కోయంబేడు కొంపముంచిందా?
ఢిల్లీని మించిపోయింది రాజస్తాన్‌ను దాటేసింది దేశంలో మూడో స్థానానికి ఎగబాకింది తమిళనాడులో కరోనా విజృంభిస్తోంది మొత్తం కేసుల్లో సగం చెన్నైలోనే నమోదయ్యాయి లాక్డౌన్ సమయానికి రెండు పదులుండే కేసులు ఇప్పుడు 8 వేలు దాటేశాయి. ఎందుకిలా జరిగింది? తమిళనాడులో కరోనా కేసులు రోజురోజుకి ఎక్కువైపోవడం దడ పుడుతోంది. అందుకే ముఖ్యమంత్రి పళనిస్వామి ఇప్పట్నుంచి రైళ్లు నడపొద్దని కేంద్రానికి మొరపెట్టుకున్నారు. లాక్డౌన్ కఠినతరం చేస్తున్నారు. దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించే సమయానికి 26 కేసులే తమిళనాడులో ఉన్నాయి. వారందరినీ క్వారంటైన్ చేస్తే పెద్దగా నష్టం జరగదని అనుకున్నారు. ఏప్రిల్ 17 కల్లా కరోనా రహిత రాష్ట్రంగా అవతరించవచ్చని అంచనా వేశారు. కానీ కరోనా కేసులు ఏప్రిల్‌లో బాగా పెరిగాయి. మేలో విజృంభించాయి. మే 10 నాటికి ఢిల్లీని దాటేసి జాబితాలో మూడో స్థానానికి ఎగబాకింది. మర్కజ్ ప్రార్థనలకు వెళ్లినవారిలో 1,100 మందికిపైగా చెన్నైలో ఉంటే అతి పెద్ద కోయంబేడు హోల్‌సేల్ కూరగాయల నిర్వహణలో లోపాలతో వైరస్ అనూహ్యంగా విస్తరించింది. అయితే మరణాల రేటు తక్కువగా ఉండడం ఊరట కలిగించే అంశం. దేశవ్యాప్తంగా మరణాల రేటు 3.35 శాతం ఉంటే తమిళనాడులో 0.67 శాతంగా ఉంది. బజారు బేజారు చెన్నైలో కోయంబేడు హోల్‌సేల్ మార్కెట్ కోవిడ్‌కు హాట్‌స్పాట్‌గా మారింది. ఈ మార్కెట్ ద్వారా దాదాపుగా 2 వేల మందికి కరోనా వైరస్ సోకింది. 1996లో ఏర్పాటైన మార్కెట్లో 3750 దుకాణాలున్నాయి. ఆసియాలోపెద్దదైన ఈ మార్కెట్ 65 ఎకరాల్లో విస్తరించింది. పూలు, పళ్లు, కూరగాయలు, ఇతర నిత్యావసరాలు ఇక్కడ నుంచే తీసుకువెళ్లాలి. రిటైల్ వర్తకులు, 10 కి.మీ.ల పరిధిలోని జనమంతా ఇక్కడికే వస్తారు. పండగ వేళ దాదాపు రెండులక్షల మందివస్తారు. మొదటి దశ లాక్డౌన్ సమయంలో మార్కెట్లో సజావుగా ఉంది. ఏప్రిల్ 14న తమిళనాడు న్యూ ఇయర్‌ని పురస్కరించుకొని జనం భారీ ఎత్తున తరలివచ్చారు. లక్షల్లో జనం రావడంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనల్ని కఠినతరం చేస్తూ మార్కెట్ తెరిచి ఉంచే వేళల్ని తగ్గించింది. కరోనా కట్టడి కోసం తీసుకున్న ఈ చర్య కేసులు పెరిగేలా చేసింది. మార్కెట్ తెరిచి ఉన్నప్పుడే అన్నీ కొనుక్కోవాలన్న ఆత్రుతలో జనం భారీగా వచ్చారు. రద్దీ ఎక్కువై భౌతిక దూరం పాటించడం అసాధ్యమైంది. ఈ మార్కెట్లో అమ్మకందారుడు ఒకరికి తొలుత కరోనా పాజిటివ్ రావడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. అలా వారి సంఖ్య 2 వేలకి చేరుకుంది. దీంతో ప్రభుత్వం మే 5 నుంచి మార్కెట్‌ని మూసేసింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఆ మార్కెట్లో పనిచేసే 10 వేల మంది కూలీలు, సరుకు లోడ్ చేసేవారు కొందరు అరియళూర్, పెరంబలూరు, కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాల్లో సొంత ఊళ్లకు వెళ్లారు. అలా వెళ్లిన కూలీలకు కరోనా పాజిటివ్‌గా తేలడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తమిళనాడులో ఇలా... మొత్తం కేసులు: 8002 కోలుకున్న వారు: 2051 మృతులు: 53 వచ్చే పది రోజుల్లో చెన్నైలో కేసుల సంఖ్య ఇంకా పెరుగుతుంది. అయినా ప్రజలు ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేదు. నగరంలో జనాభా, చేస్తున్న పరీక్షలతో పోల్చి చూస్తే కేసులు అదుపులో ఉన్నట్టుగానే భావించాలి. పదిరోజులుగా చాలా ఎక్కువ మందికి పరీక్షలు చేస్తున్నాం. రోజుకి 3,500 మందికి పరీక్షలు నిర్వహించాలని టార్గెట్‌గా పెట్టుకున్నాం. అందుకే కేసుల సంఖ్య పెరుగుతోంది. జే రాధాకృష్ణన్, కోవిడ్ ప్రత్యేక అధికారి -
కరోనా వార్డులో ముగ్గురు మృతి
సాక్షి, చెన్నై: కరోనా ఐసోలేషన్ వార్డులో చేరిన ముగ్గురు రోగులు శనివారం మరణించడంతో తమిళనాడులో కలకలం రేగింది. అయితే ఈ ముగ్గురికి కరోనా సోకిందా, లేదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ‘చనిపోయిన ముగ్గురు వివిధ అనార్యోగాలతో బాధపడుతున్నారు. కోవిడ్-19 నిర్ధారణ పరీక్ష ఫలితాల కోసం వేచి చూస్తున్నామ’ని తమిళనాడు వైద్య శాఖ కార్యదర్శి బీలా రాజేశ్ తెలిపారు. మృతుల్లో 66 ఏళ్ల వ్యక్తికి కిడ్నీ సమస్య , 2 ఏళ్ల బాలుడికి ఎముకల వ్యాధి, మరో 24 ఏళ్ల వ్యక్తికి న్యుమోనియా ఉన్నట్లు వెల్లడించారు. తమిళనాడులో ఇప్పటివరకు 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపట్టింది. ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై తరగతులకు ప్రమోట్ అయ్యేలా ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 24న వాయిదా పడ్డ ఇంటర్ సెకండియర్ పరీక్షా తేదీ వివరాలను తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. -
సీఎంగా పళనిస్వామి.. అధ్యక్షుడిగా పన్నీర్!
-
సీఎంగా పళనిస్వామి..మార్గదర్శక కమిటీ అధ్యక్షుడిగా పన్నీర్!
తెరపైకి కొత్త ప్రతిపాదన సాక్షి, చెన్నై: ప్రభుత్వంతో పాటు అన్నాడీఎంకేను నడిపిం చేందుకు గానూ ఓ మార్గదర్శక కమిటీని నియమించాలనే ప్రతిపాదనను తమిళనాడు సీఎం పళనిస్వామి వర్గం తెర మీదకు తెచ్చినట్టు ఆ పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. ఈ కమిటీకి అధ్యక్షుడిగా పన్నీర్ సెల్వాన్ని నియమించాలని, పళనిస్వామినే సీఎంగా కొనసాగించాలని రహస్య మంత నాల్లో ఓ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బుధవారం బాగా పొద్దుపోయాక పన్నీర్ వర్గానికి చెందిన మాజీ మంత్రులు కేపీ మునుస్వామి, నత్తం విశ్వనాథన్, పళని వర్గానికి చెందిన ఎంపీ వైద్యలింగం, మంత్రి సెంగోట్ట యన్ మధ్య మంతనాలు జరిగాయి. ఈ సందర్భంగా పళని వర్గం మార్గదర్శక కమిటీ నియామక ప్రతిపాదనను తెర మీదకు తెచ్చినట్టు తెలిసింది. పళనిస్వామిని సీఎంగా కొన సాగించాలని.. అలాగే ప్రభుత్వాన్ని, పార్టీని నడిపించేందుకు ఓ కమిటీని రంగంలోకి దించాలన్న సూచన చేసినట్లు సమాచారం. పన్నీరు అధ్యక్షుడిగా, రెండు వర్గాలకు చెందిన ఐదు గురు లేదా ఏడుగురిని సభ్యులుగా ఎంపిక చేయాలని నిర్ణ యించినట్టు తెలిసింది. సమస్యలన్నీ ఓ కొలిక్కి వచ్చాక, పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించి.. మెజారిటీ శాతం అభి ప్రాయం మేరకు తదుపరి అడుగులు వేద్దామన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కాగా, గురువారం మంత్రి సెంగో ట్టయన్ మీడియాతో మాట్లాడుతూ.. విలీన చర్చల విషయం లో పార్టీ వర్గాలెవ్వరూ నోరు మెదిపేందుకు వీల్లేదని, అన వసర గందరగోళం సృష్టించవద్దని హెచ్చరించడం గమ నార్హం. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మూడో రోజు 17 జిల్లాల కార్యదర్శులతో సీఎం భేటీ అయ్యారు. ఈ భేటీలో పలువురు శశికళ, దినకరన్‌లకు మద్దతుగా స్పందించడంతో ఆయన షాక్‌కు గురైనట్లు తెలిసింది. ఓవైపు రహస్య మంతనాలు, అభిప్రాయ సేకరణలు జరుగుతుంటే.. మరోవైపు అన్నాడీ ఎంకేలోని 28 మంది ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు నగరంలోని ఓ హోటల్లో రహస్యంగా సమావేశమయ్యారు. మంత్రి పదవు లపై వీరు ప్రధానంగా చర్చించుకున్నట్లు తెలిసింది. -
పళనికి బ్రహ్మరథం
► సొంత జిల్లాలో ఘన స్వాగతం ► నాలుగు జిల్లాలకు రూ. 331 కోట్లు ► అభివృద్ధి పనులకు శంకుస్థాపన సాక్షి, సేలం: సీఎంగా పగ్గాలు చేపట్టినానంతరం ప్రప్రథమంగా మంగళవారం సొంత జిల్లా సేలంలో అడుగు పెట్టిన పళనిస్వామికి పశ్చిమ తమిళనాడులోని జిల్లాల్లోని అన్నాడీఎంకే వర్గాలు, మద్దతుదారులు, అధికార యంత్రాంగం బ్రహ్మరథం పట్టాయి. పశ్చిమ తమిళనాడులోని నాలుగు జిల్లాల అభివృద్ధికి రూ. 331 కోట్లను సీఎం కేటాయించారు. పలు పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని కోయంబత్తూరు, ఈరోడ్, నామక్కల్, సేలం తిరుప్పూర్, ధర్మపురి, కృష్ణగిరిలు పశ్చిమ తమిళనాడులోని జిల్లాలుగా పిలుస్తున్నారు. పశ్చిమంలోని సేలం జిల్లా ఎడపాడికి చెందిన పళనిస్వామి ప్రస్తుతం సీఎం కావడం అక్కడి ప్రజలకు ఆనందమే. సీఎం పగ్గాలు చేపట్టినానంతరం పశ్చిమం మీద పళనిస్వామి దృష్టి పెట్టినట్టున్నారు. ప్రప్రథమంగా మంగళవారం సొంత జిల్లా వేదికగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సీఎం పగ్గాలు చేపట్టినానంతరం సొంత జిల్లాకు వచ్చిన పళనిస్వామికి నామక్కల్, సేలంలో బ్రహ్మరథం పట్టే విధంగా ఆహ్వానాలు సాగాయి. పార్టీ కేడర్, మద్దతుదారులు, ప్రజలు, అధికార వర్గాలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. రూ. 331 కోట్లతో: సేలం కలెక్టరేట్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో రూ.331 కోట్లతో చేపట్టనున్న పలు పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో సేలం జిల్లాలో రూ.115 కోట్లు, నామక్కల్ జిల్లాలో రూ.61 కోట్లు, ధర్మపురి జిల్లాలో 60 కోట్లు, కృష్ణగిరి జిల్లాలో రూ. 93 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులు ఉన్నాయి. అలాగే, లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందజేశారు. నిర్మాణాలను పూర్తి చేసుకున్న పలు భవనాలను ప్రారంభించారు. పశ్చిమ జిల్లాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడిని పరిష్కరించడం లక్ష్యంగా ముందుకు సాగుతామని ప్రకటించారు. గతంలో అమ్మ జయలలిత అసెంబ్లీలో 110 నిబంధనల మేరకు చేసిన ప్రకటనల హామీలనంటినీ నెరవేరుస్తాననన్నారు. -
ఉద్యమ బాట
► తగ్గేది లేదన్నఉద్యమ నేతలు ► బెడిసి కొట్టిన సీఎం ప్రయత్నాలు ► ఇక మరింత ఉధృతం ► అణగదొక్కేందుకు కసరత్తులు ► బలగాల మోహరింపు ► ఒక్కో గ్రామంలో ఒక్కో కన్నీటి గాథ సీఎం ఎడపాడి పళనిస్వామి ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఉద్యమాన్ని కొనసాగించేందుకు నెడువాసల్ ఉద్యమకారులు నిర్ణయించారు. హైడ్రోకార్బన్ ప్రాజెక్టు రద్దు ప్రకటన వెలువడే వరకు ఉద్యమం కొనసాగుతుందని, మరింత ఉధృతం చేయనున్నట్టు ఉద్యమ నేతలు ప్రకటించారు. ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నాలుసాగుతున్నాయి. నెడువాసల్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సాక్షి, చెన్నై:పుదుకోట్టై జిల్లా నెడువాసల్ వేదికగా హైడ్రో కార్బన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం సాగుతున్న విషయం తెలిసిందే. ఉద్యమకారులతో బుధవారం సీఎం ఎడపాటి కే పళనిస్వామి భేటీ అయ్యారు. అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదన్న భరోసా ఇచ్చారు. అయితే సీఎం ప్రయత్నాలు బెడిసి కొ ట్టాయి. ఆయన హామీలు సంతృప్తికరంగా లేని దృష్ట్యా, ఉద్యమాన్ని ముం దుకు తీసుకెళ్లేందుకు ఉద్యమకారులు నిర్ణయించారు. కేంద్రం దిగి వచ్చి ఆ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్టు ప్రకటించేవరకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి తీరుతామన్న ప్రతిజ్ఞను గురువారం నెడువాసల్ పరిసర గ్రామాల్లోని ప్రజలు చేశారు. పాఠశాల స్థాయి పిల్లలు, యువత సైతం తరలి వచ్చి ఉద్యమానికి సంఘీభావం తెలియజేశారు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ, వివిధ రూపాల్లో నిరసనలు, పరిస్థితిని బట్టి ఆమరణ దీక్ష సైతం చేపట్టేందుకు తగ్గ కసరత్తులతో ఉద్యమకారులు ముందుకు సాగుతుండడంతో ఉత్కంఠ బయల్దేరింది. ఈ ఉద్యమానికి మద్దతుగా చెన్నై వళ్లువర్‌కోట్టం వద్ద సినీనటుడు లారెన్స్ నేతృత్వంలో నిరసనకు పిలుపునిచ్చారు. అయితే పోలీసులు చివరి క్షణంలో అనుమతి నిరాకరించారు. ముందుగానే అక్కడకు చేరుకున్న యువతను పోలీసులు బలవంతంగా తొలగించారు. బలగాల మోహరింపు: నెడువాసల్ ఉద్యమాన్ని అణగొక్కేందుకు తగ్గ ప్రయత్నాలు సాగుతున్నట్టుంది. సీఎం హామీ ఇచ్చినా ఉద్యమకారులు వెనక్కు తగ్గక పోవడంపై కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అదే సమయంలో నెడువాసల్ పరిసరాల్లోకి బయటి వ్యక్తులు రాకుండా అడ్డుకునే విధంగా చెక్ పోస్టులు ఏర్పాటు అయ్యాయి. బలగాల్ని మరింత కట్టుదిట్టం చేయడంతో ఉత్కంఠ బయల్దేరింది. ఒక్కో గ్రామంలో ఒక్కో కన్నీటి గాథ: హైడ్రో ప్రాజెక్టు నిమిత్తం చాప కింద నీరులా తవ్విన బోరు బావుల రూపంలో ముప్పు ఇప్పటికే బయల్దేరినట్టు అనేక గ్రామాల్లోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమ వేదికపై ప్రసంగించే ఆయా గ్రామాల ప్రజలు తమ తమ ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటనలను వివరిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్టైకాడు పరిసరాలను ‘సిటిజన్’ సినిమా తరహాలో కనుమరుగు చేయడానికి ప్రయత్నాలు జరిగినట్టు, ఇక్కడ జరిగిన తవ్వకాల పరిశోధనల కారణంగా పిల్లలు మానసిక వికలాంగులుగా, అంతు చిక్కని వ్యాధులతో బాధ పడాల్సి ఉందని కన్నీటి పర్యంతం కావడం అక్కడి వారిని కలచి వేసింది. వనక్కాడులో గతంలో పదిహేను వందల అడుగుల లోతులో ఏర్పాటు చేసిన బోరు బావి కారణంగా, క్యాన్సర్ బారిన పడి పది మంది మరణించి ఉన్నట్టు, మరో 25 మంది ఆ వ్యాధితో బాధ పడుతున్నట్టు అక్కడి ప్రజలు పూర్తి వివరాలను ఉద్యమ వేదిక ముందుకు తీసుకురావడం గమనించాలి్సన విషయం. -
అండగా నిలవండి
► ఆర్థిక సాయం చేయండి ► ప్రధానికి సీఎం ఎడపాడి వినతి ► నేడు రాష్ట్రపతిని కలవనున్న పన్నీర్‌సెల్వం, ఎంపీలు ► జయ మరణంపై సీబీఐ దర్యాప్తుకు వినతి ► న్యాయనిపుణులతో దినకరన్ చర్చలు ప్రకృతి ప్రకోపానికి గురై కొట్టుమిట్టాడుతున్న తమిళనాడుకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి చెందిన పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రధానికి అందజేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై:ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఎడపాడి పళని స్వామి సోమవారం తొలిసారిగా ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పని లోపనిగా రాష్ట్ర సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కరువుకాటకాలు, వర్ద తుపాను దెబ్బతో రా ష్ట్రం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటు న్న సంగతిని వివరించానని ఆయన అన్నారు. తమిళ ప్రజల జల్లికట్టు కోర్కె సాధనకై రాష్ట్రం జారీచేసిన ఆర్డినెన్స్ ఆమోదంపై ప్రధానికి ధన్యవాదాలు తెలిపానని అన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రాష్ట్రంలో కరువు నెలకొని, పచ్చనిపొలాలు ఎండిపోతున్నట్లు ప్రధాని దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. కరువు సహాయకంగా గతం లో కోరిన రూ.39,565 కోట్లు, వర్ద తుపాను సహాయం కింద రూ.22,573 కోట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వా రా రాష్ట్రానికి చెందాల్సిన రూ.17,333 కోట్లు వెంటనే విడుదల చేయాల్సిం దిగా సీఎం కోరారు. నీట్ ప్రవేశపరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలని, కావేరి ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. తమిళనాడులో సాగు, తాగునీటి కొరతలను తీర్చేందుకు మహానది, గోదావరి, కృష్ణా, పెన్న, పాలారు, కావేరి, వైగై తదితర నదులను అనుసంధానం చేయాల్సిందిగా కోరారు. జాలర్ల సంక్షేమం కోసం 1,650 కోట్లు కేటాయించాలని, శ్రీలంక చెరలో ఉన్న 35 మంది తమిళ జాలర్లను, 120 మరపడవలను విడిపించాలని, శ్రీలంక కారణంగా చేపల వేటకు ఏర్పడుతున్న అడ్డంకులను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. కూడంకుళంలో ఉత్పత్తయ్యే రెండువేల మెగావాట్ల విద్యుత్‌ను పూర్తిగా తమిళనాడుకు కేటాయించాలని కోరారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద తమిళనాడుకు అదనంగా నెలకు 85వేల మెట్రిక్ టను్నల బియా్యన్ని రాయితీపై సరఫరా చేయాలని కోరారు. సముద్ర జలాలను తాగునీటిగా మార్చే నిర్లవీకరణ పథకం అమలుకు వెంటనే అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. పలువురు మంత్రులు సీఎం వెంట ఢిల్లీ వెళ్లారు. రాజధానిలో రాష్ట్ర పంచాయితీ ఒకే ఒరలో రెండు కతు్తల్లా అన్నాడీఎంకేపై రెండు గ్రూపుల ఆధిపత్య పోరుపై పంచాయితీ రాజధానికి చేరుకుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని, హోం మంత్రిలను కలుసుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం బృందం సోమవారం ఢిల్లీకి చేరుకుంది. చిన్నమ్మ పదవిని కాపాడేందుకు ఆమె సోదరి కుమారుడు, ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ న్యాయనిపుణులతో చర్చల్లో మునిగి తేలుతున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత పార్టీ రెండుగా చీలిపోగా ఒకరినొకరు బహిష్కరించుకున్నారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని పన్నీర్‌సెల్వం వర్గం వాదిస్తోంది. శాశ్వత ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన జయలలిత చేత ప్రిసీడియం చైర్మన్ గా నియమితులైన మధుసూదన్ పన్నీర్‌సెల్వం వైపున్న కారణంగా పార్టీ తమదేనని వాదిస్తున్నారు. పది మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీలు పన్నీర్ పక్షాన నిలవగా, మెజార్టీ ఎమ్మెల్యేలతో విశ్వాస పరీక్షను నెగ్గిన శశికళ వర్గం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అధికారం, పదవుల్లో ఉండేవారంతా శశికళ వైపు ఉండగా, పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం నుంచి క్షేత్రస్థాయి కార్యకర్త వరకు పన్నీర్‌సెల్వంను ఆదరిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వర్గాన్ని మరొకరు తమవైపు లాకు్కనేందుకు తీవ్రస్థాయి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఐదేళ్లు వరుసగా ప్రాథమిక సభ్యత్వం లేని శశికళను ప్రధాన కార్యదర్శిగా ఎను్నకోవడం చెల్లదనే ఫిర్యాదు ఎన్నికల కమిషన్ పరిశీలనలో ఉంది. శశికళ నియామకంపై అడ్డంకులు తలెత్తకుండా పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. శశికళ ఎంపిక చెల్లదని ఎన్నికల కమిషన్ ప్రకటించినట్లయితే పన్నీర్‌సెల్వం తదితరులను పార్టీ నుంచి బహిష్కరించిన ఆదేశాలు చెల్లకుండా పోతాయి. అంతేగాక టీటీవీ దినకరన్ నియాకం కూడా చెల్లదు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొవాల్సి ఉండగా రెండాకుల చిహ్నం ఎవరిదనే చికు్కముడి ఉంది. చట్టపరవైున చికు్కల్లో ఉన్న శశికళ వర్గీయులను మరిన్ని చికు్కలో్లకి నెట్టేందుకు పన్నీర్‌సెల్వం ఢిల్లీ పయనం అయా్యరు. అంతకు ముందు సేలం జిల్లా నేతలో పన్నీర్‌సెల్వం సమావేశమై శశికళ ఆధిపత్యాన్ని తిప్పికొట్టడం ఎలా అంశంపై అభిప్రాయాలు సేకరించారు. జయలలిత అనుమానాస్పద మరణంపై సీబీఐ విచారణ కోరుతూ మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వినతిపత్రం సమర్పించనున్నారు. అలాగే ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లను కలుస్తున్నారు. పన్నీర్‌వెంట 12 మంది ఎంపీలు ఢిల్లీకి వెళ్లారు. -
ఘన నివాళి
► వేడుకగా జయలలిత 69వ జయంతి ► సచివాలయంలో మొక్కలు నాటిన సీఎం సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని పరిమళింపజేయడమే అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు అసలైన నివాళి అని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత 69వ జయం తి వేడుకలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా జరి గాయి. రూ.13.42 కోట్ల ఖర్చుతో రూపొం దించిన ఈ మొక్కలు నాటే పథకాన్ని అన్నాశాలైలోని ప్రభుత్వ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటడం ద్వారా సీఎం ప్రారంభించారు. ఎడపాడి కేబినెట్లోని 30 మంది మంత్రులు పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో ఉచిత ప్రత్యేక వైద్యశిబిరాలను మంత్రులు జయకుమార్, విజయభాస్కర్ప్రారంభించారు. జయలలిత జయంతి సందర్భంగా ఈనెలలో ప్రారంభవైున ఈ పథకం కింద 69 లక్షల మొక్కలు నాటేపనులను డిసెంబరు ఆఖరులోగా పూర్తి చేయాలని సీఎం సూచించారు. వనాల్లో, విద్యాసంస్థల్లో, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయ ప్రాంగణాల్లో మొక్కలు నాటాలని కోరారు. ఇటీవల రాష్ట్రంలోని పలు ప్రాంతాలను కుదిపేసిన వర్దా తుపాన్ వల్ల కోల్పయిన పచ్చదనాన్ని ఈ పథకం ద్వారా భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. 2,20 లక్షల మొక్కలను ప్రజలకు రాయితీపై పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల బంగాళాఖాతంలో రెండు నౌకలు ఢీకొని సముద్ర జలాల కలుషితం వల్ల బాధిత 30వేల జాలర్ల కుటుంబాలకు రూ.5వేలు చొప్పున నష్టపరిహారాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. పార్టీ కార్యాలయంలో: అలాగే చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో జయ జయంతి వేడుకలను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ప్రారంభించగా ముఖ్యమంత్రి ఎడపాడి, ప్రిసీడియం చైర్మన్ సెంగొట్టయ్యన్ మంత్రులు పాల్గొన్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో జరిగిన అమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా కేవలం పది నిమిషాల్లో కార్యక్రమాలను ముగించారు. పన్నీర్‌సెల్వంకు ఉద్వాసన, ఎడపాడికి సీఎం పట్టం, శశికళ జైలుపాలు, ఉప ప్రధాన కార్యదర్శిగా ఆమె అక్క కుమారుడు దినకరన్ నియామకం వంటి పరిణామాలు తమను బాధించినట్లుగా కార్యకర్తలు వ్యవహరించారు. అన్నాడీఎంకే నిర్వాహక కార్యదర్శి గోకుల ఇందిర కీల్పాక్లోని బాలవిహార్ శిశు సంరక్షణా కేంద్రంలో అన్నదానం చేశారు. చెన్నై నంగనల్లూరు సహకార సంఘ కార్యాలయంలో జయ జయంతి వేడుకలు జరిపారు. జయ జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించడాన్ని పీఎంకే అధ్యక్షుడు డాక్టర్ రాందాస్ ఆక్షేపించారు -
మహోద్యమం
► బినామీ పాలనకు చరమ గీతం ► ప్రజలు, యువతకు స్టాలిన్ పిలుపు ► సభలో జరిగిన విషయంపై వివరణ ► గాయాలు అయ్యాయి ► పార్టీలకతీతంగా ఏకం కావాలని వేడుకోలు శశికళ నేతృత్వంలోని బినామీ సీఎం పళనిస్వామి పాలనకు చరమ గీతం పాడడం, తమిళనాడును మన్నార్గుడి మాఫియా చేతి నుంచి రక్షించుకోవడం లక్ష్యంగా మహోద్యమానికి అందరూ సిద్ధం కావాలని ప్రజలకు, యువతకు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. బల పరీక్ష సమయంలో సభలో జరిగిన వాస్తవాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, ఆందోళన వ్యక్తం చేస్తూ పార్టీలకతీతంగా ఏకం అవుదామని రాజకీయ పక్షాలను ఆయన కోరారు. సాక్షి, చెన్నై: డీఎంకే రాష్ట్ర కార్యాలయం అన్నా అరివాలయంలో సోమవారం రాత్రి ఏడు గంటలకు స్టాలిన్ మీడియా ముందుకు వచ్చారు. దివంగత అన్నాదురై, ఎంజీఆర్‌లు అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఉదయం, సాయంత్రం వేళల్లో అ ప్పటి ఆరోగ్య మంత్రులు ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ లు విడుదల చేశారని గుర్తు చేశారు. అయితే, అమ్మ జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు మంత్రులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఆమె మరణం వెనుక మిస్టరీ దాగి ఉందన్న ప్రచారం, ఆరోపణలు బయలుదేరిన సమయంలో శశికళ సీఎం పగ్గాలు చేపట్టేందుకు సిద్ధం కావడం, దానిని వ్యతిరేకిస్తూ పన్నీరు సెల్వం తిరుగుబాటు బావుటా ఎగుర వేయడాన్ని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. శశికళ కుటుంబం అక్రమాలు పది శాతం మాత్రమే వెలుగులోకి వచ్చి ఉన్నాయని, మరో 90 శాతం త్వరలో ప్రకటిస్తానని పన్నీరు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. వీటిన్నంటిని పరిగణించాలని, మన్నార్గుడి మాఫియా అక్రమాలు మరింత తాండవం చేయకుండా, రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు బాధ్యత గల ప్రధాన ప్రతిపక్షంగా డీఎంకే సభలో తీవ్రంగానే స్పందించాల్సి వచ్చిందన్నారు. సభలో ఏమి జరిగిందంటే.. అసెంబ్లీ సమావేశం కాగానే, పన్నీరు మద్దతు ఎమ్మెల్యే సెమ్మలై ప్రసంగాన్ని అందుకుని, తాను గోల్డెన్ బే రిసార్ట్ నుంచి తప్పించుకుని వచ్చానని, తాను బస చేసిన గది తాళాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారని వివరించారు. తనతో పాటుగా మరెందరో ఎమ్మెల్యేలు తప్పించుకునే ప్రయత్నం చేసినా, చివరకు శశికళ సేనల చేతికి చిక్కారని సభలో ఆవేదన వ్యక్తం చేసినట్టు గుర్తు చేశారు. అందుకే రహస్య ఓటింగ్ కోరుతున్నామని, ఆయనతో పాటుగా ఆ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు కోరడంతో, బాధ్యత గల బలవైున ప్రధాన ప్రతిపక్షంగా స్పీకర్ మీద ఒత్తిడికి నిర్ణయించామన్నారు. రహస్య ఓటింగ్‌కు అనుమతి ఇవ్వాలని, లేని పక్షంలో సభను వారం వాయిదా వేసి, ఎమ్మెల్యేలను నియోజకవర్గాలకు పంపించాలని, తదుపరి బలపరీక్షకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ ధనపాల్కు సూచించినట్టు తెలిపారు. అయితే, స్పీకర్ ఆ ప్రస్తావన తెచ్చినప్పుడల్లా తమ మీద విరుచుకు పడ్డారని, అందుకు తాము సైతం ఘాటుగానే స్పందించామన్నారు. సభను వాయిదా వేసి చాంబర్‌కు వెళ్లిన స్పీకర్ తనను పిలిపించారని గుర్తు చేశారు. అక్కడ స్పీకర్ చొక్కా చిరిగి ఉండడంతో, అందుకు ఆస్కారం లేదని, ఒక వేళ తమ ఎమ్మెల్యేల కారణంగా చిరిగి ఉంటే, పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్టు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఇంతటితో ఈ విషయాన్ని వదలిపెడదామని స్పీకర్ చెప్పారన్నారు. తమను పిలిపించి, ఏదేని నిర్ణయం తీసుకుంటారని భావిస్తే, తమ మీద నిందలు వేయడం, తమ డిమాండ్లకు దిగి రాక పోవడంతో అక్కడి నుంచి సభకు వచ్చేశామన్నారు. సభలో మళ్లీ అదే ప్రస్తావనను తాము తీసుకురాగా, వాయిదా వేసి వెళ్లిపోయారని, చివరకు ఐపీఎస్‌లను మార్షల్స్ దుస్తుల్లో పంపించి బలవంతంగా బయటకు గెంటించారని ధ్వజమెత్తారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది కాకుండా, స్పీకర్ చివరగా చేసిన ప్రసంగాన్ని బట్టి చూస్తే, ఎవర్నో రెచ్చగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నది మాత్రం స్పష్టం అవుతోందన్నారు. తనతో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు గాయపడ్డారని, తనకు బయటి గాయాలు లేకున్నా, లోపలి గాయాలు ఉన్నాయని, స్కాన్, ఎక్స్‌రే తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్టుందని మీడియా ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఉద్యమం తప్పదు నాలుగు సంవత్సరాల జైలు శిక్షను ఎదుర్కొంటున్న శశికళ నేతృత్వంలోని బినామీ సీఎం పళని స్వామి ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. సభలో తమ మీద జరిగిన దాడిని ప్రజలకు వివరించాలనే ఈ సమావేశం పెటా్టమని, వాస్తవానికి సభలో జరిగింది ఒకటైతే, మీడియా వర్గాలకు ఎడిటింగ్ చేసి, తామేదో తప్పు చేసినట్టుగా క్లిప్పింగ్‌లను ఇచ్చి ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగల ప్రధాన ప్రతిపక్షంగానే తాము సభలో నడుచుకున్నామేగానీ, ఎవరికో మద్దతు ఇవ్వాల్సిన అవసరం తమకు లేదన్నారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాలతో తమకు సంబంధం లేదని, అయితే, ప్రభుత్వం విషయంలో ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మన్నార్గుడి మాఫియా చేతి నుంచి ప్రజల్ని, రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు 22న జిల్లా కేంద్రాల్లో దీక్షకు పిలుపు నిచ్చామన్నారు. ఈ దీక్షకు యువత, ప్రజలు, రాజకీయాలకు అతీతంగా పార్టీలు, ప్రజా సంఘాలు తరలిరావాలని, స్పందన మేరకు మహోద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్టు ప్రకటించారు. తదుపరి మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, రాష్ట్రపతి అనుమతి కోరి ఉన్నామని, ఢిల్లీ నుంచి పిలుపు రాగానే, బయల్దేరుతామని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కోరు్టను ఆశ్రయించామని, గవర్నర్ స్పందన మేరకు తదుపరి తమ అడుగులు ఉంటాయన్నారు. శశికళకు వ్యతిరేకంగా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఆ ప్రజా మద్దతుతో బినామీ ప్రభుత్వాన్ని దించడం లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. కరుణకు స్పీచ్‌థెరపీ డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై మీడియా ప్రశ్నించగా, కోలుకుంటున్నారన్నారు. వయో భారంతో వచ్చిన సమస్యలు, ఆసుపత్రిలో అందించిన చికిత్సల కారణంగా ప్రస్తుతం ఆయనకు స్పీచ్ థెరపీ సాగుతున్నదని, త్వరలో అందరి ముందుకు వస్తారన్న ఆశాభావంతో ఉన్నామన్నారు. ఆయన రాజకీయాలో్లనే ఉన్నారని, తనకు సూచనలు, సలహాలు ఇస్తూ వస్తున్నారని వివరించారు. -
చిన్నమ్మ ఆనందం
► చప్పట్లతో హర్షం ► చెక్ పెట్టేందుకు ఆమ్ ఆద్మీ కసరత్తు ► కోర్టులో పిటిషన్ కు నిర్ణయం అధికారం తమ గుప్పెట్లోకి రావడంతో చిన్నమ్మ శశికళ ఆనందానికి అవధులు లేవు. పరప్పన అగ్రహార చెరలో చప్పట్లు మార్మోగించి మరీ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన విధేయుడి చేతికి అధికారం చిక్కడంతో, జైలు నుంచే వ్యూహాలకు పదును పెట్టేందుకు సిద్ధం అవుతున్నట్టుంది. ఇక, చిన్నమ్మ చెన్నై చెరకు మార్చకుండా అడ్డుకునేందుకు తిరుప్పూర్ జిల్లా ఆమ్ ఆద్మీ విభాగం నిర్ణయించింది. సాక్షి, చెన్నై: పరప్పన అగ్రహార చెరలో ఉన్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ శనివారం మధ్యాహ్నం భోజ నాన్ని సైతం మరిచారు. ఇందుకు కారణం టీవీ ముందుకు అతుక్కు పోవడమే. అసెంబ్లీ వ్యవహారాలను టీవీలో వీక్షించిన శశికళ మధ్యాహ్న భోజన సమయాన్ని సైతం పట్టించుకోలేదని సమాచారం. తన విధేయుడు పళనిస్వామి చేతికి అధికార పగ్గాలు చిక్కడం, తన శపథాన్ని నెరవేర్చానని ఉప ప్రధానకార్యదర్శి దినకరన్ వ్యాఖ్యానించిన సమయంలో ఆమె ఆనందానికి అవధులు లేవని తెలి సింది. టీవీ ముందు నుంచి లేచి నిలబడి చప్పట్లు కొట్టి మరీ ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక, జైలు నుంచి తమిళ ప్రభుత్వ చక్రం తిప్పేందుకు తగ్గ వ్యూహాన్ని రచించేందుకు సిద్ధం అవుతుండడం గమనార్హం. అలాగే, పరప్పన అగ్రహార చెర నుంచి తమిళనాడుకు తనను మార్చే విధంగా త్వరితగతిన చర్యల్ని వేగవంతం చేయాలని న్యాయవాదులకు ఆమె సూచించి నట్టు తెలిసింది. ఈ విషయంగా న్యాయవాదులతో టీటీ వీ దినకరన్ సంప్రదింపులు జరుపుతూ సోమవారం పిటిషన్ దాఖలు చేయించేందుకు తగ్గ కసరత్తుల్లో ఉన్నట్టు సమాచారం. అయితే, చెర మార్పును అడ్డుకునేందుకు తిరుప్పూర్ జిల్లా ఆమ్ ఆద్మీ విభాగం నిర్ణయించడంతో వ్యతిరేకత బయలు దేరినట్టు అయింది. చెర మార్పునకు వ్యతిరేకత: తిరుప్పూర్ జిల్లా ఆమ్ ఆద్మీ విభాగం కార్యవర్గం ఆదివారం జరిగింది. ఇందులో అవి నీతికి వ్యతిరేకంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా శశికళకు వ్యతిరేకంగా ఇందులో నిర్ణయాలు తీసుకున్నారు. శశికళను చెన్నై జైలుకు మార్చేందుకు తగ్గ ప్రయత్నాల్ని అడ్డుకునేందుకు తీర్మానించారు. కర్ణాటక కోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేయడానికి తిరుప్పూర్ జిల్లా విభాగం కన్వీనర్ సుందర పాండియన్ నిర్ణయించారు. ఆమెను ఇక్కడకు మార్చిన పక్షంలో, రాష్ట్రంలో మరింత అవినీతి, దోపిడీ పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటూ, సీఎంతో పాటు మంత్రులు జైలు ముందు ప్రతి రోజూ బారులు తీరే అవకాశం ఉంద న్న విషయాన్ని ఎత్తి చూపుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ఆయన వివరించారు. -
గవర్నర్‌తో పళని భేటీ
► వెన్నంటి దినకరన్ ► ఎమ్మెల్యేల్లో గుబులు ► బెదిరింపుల హోరు ► చెన్నైలోనే మెజారిటీ శాతం మంది తిష్ట ► భద్రత పెంపు ► పళని నెత్తిన అత్తికడవు –అవినాశి పథకం ► అమలుకు యువత ఏకం సాక్షి, చెన్నై: రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుతో సీఎం పళనిస్వామి భేటీ అయ్యారు. సభలో డీఎంకే సృష్టించిన వీరంగాలను వివరించారు. ఆయన వెన్నంటి అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ఉన్నారు. ఇక, ఓటింగ్‌లో చిన్నమ్మ శశికళ విధేయుడికి మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేల్లో గుబులు పట్టుకుంది. బెదిరింపుల హోరు పెరగడం, ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదన్న ఆందోళనతో వారి ఇళ్ల వద్ద భద్రతను పెంచారు.అసెంబ్లీ వేదికగా సాగిన రణరంగం నడుమ బల పరీక్షలో కే పళనిస్వామి నెగ్గారు. ఆయనకు 122 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపినట్టు స్పీకర్ ధనపాల్ ప్రకటించారు. విశ్వాస పరీక్షలో తాను నెగ్గడంతో మర్యాద పూర్వకంగా ఆదివారం ఉదయం రాజ్‌భవన్ లో గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుతో సీఎం పళనిస్వామి భేటీ అయ్యారు. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ తో మంత్రులు జయకుమార్, సెంగోట్టయన్, దిండుగల్ శ్రీనివాసన్, సెవ్వూరు రామచంద్రన్, విజయభాస్కర్, ఎస్పీ వేలుమణి, తంగమణి కలిసి అర్ధగంట పాటు గవర్నర్‌తో సమావేశమయ్యారు. ప్రధానంగా సభలో బలపరీక్షను అడ్డుకునే విధంగా డీఎంకే వ్యవహరించిన తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేల్లో ఆందోళన రాష్ట్ర ప్రజానీకం మాజీ సీఎం పన్నీరుకు మద్దతుగా ఓటు వేయాలని ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తెచ్చింది. అయితే, సభలో అందుకు విరుద్ధంగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు వ్యవహరించారు. ఓటింగ్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సభలో రాద్ధాంతం సాగుతున్నా, పళనిస్వామికి మద్దతుగా ఎమ్మెల్యేలు ఓటు వేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకున్నారు. తమ నియోజకవర్గాల్లో అడుగు పెట్టిన తదుపరి ఎమ్మెల్యేల్ని అడ్డుకునేందుకు సిద్ధం అవుతున్నారు. కొన్నిచోట్ల అయితే, ఆయా నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలకు బెదిరింపు లు పెరిగాయి. నియోజకవర్గాల్లో అడుగు పెట్టనివ్వమని హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో చిన్నమ్మ శశికళ విధేయుడు పళనిస్వామికి మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేల్లో ఆందోళన బయలు దేరింది. దీన్ని పరిగణలోకి తీసుకుని ఆయా ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద, కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మెజారిటీ శాతం ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు వెళ్లకుండా పరిస్థితి సద్దుమణిగిన అనంతరం వెళ్లేందుకు నిర్ణయించారు. చెన్నైలోని తమ క్వార్టర్స్‌లో దక్షిణ తమిళనాడుకు చెందిన మెజారిటీ శాతం ఎమ్మెల్యేలు తిష్ట వేశారు. ఇక, స్పీకర్ ధనపాల్ ఇంటికి భద్రతను మూడంచెలు పెంచారు. పళని నెత్తిన అత్తికడవు పశ్చిమ తమిళనాడు నుంచి సీఎంగా అవతరించిన పళనిస్వామికి అక్కడి ప్రజల నుంచి తీవ్ర సంకట పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్నేళ్లుగా అమలుకు నోచుకోని అనేక పథకాలను తెరమీదకు తెచ్చే పనిలో ప్రజలు పడ్డారు. ప్రజలకు, ప్రజాసంఘాలకు యువజనం మద్దతుగా నిలవడంతో జల్లికట్టు తరహాలో పశ్చిమ తమిళనాడులోని పలు జిల్లాల్లో ఉద్యమాలు రాజుకునే అవకాశాలు కనిపిస్తున్నారు. ఈరోడ్, తిరుప్పూర్ జిల్లాల్లో తాగునీటి ఎద్దడిని పరిష్కరించేందుకు లక్ష్యంగా నిర్ణయించిన అత్తి కడవు– అవినాశి పథకం అమలు లక్ష్యంగా పోరుబాటకు ఆదివారం శ్రీకారం చుట్టడం గమనార్హం. తమ ప్రాంతానికి చెందిన వ్యక్తి సీఎం కావడంతో, ఆయన మీద ఒత్తిడి తెచ్చి మరీ పథకాలను అమలు చేయడానికి యువత పరగులు తీసే పనిలో పడ్డారు.