ఘన నివాళి
► వేడుకగా జయలలిత 69వ జయంతి
► సచివాలయంలో మొక్కలు నాటిన సీఎం
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని పరిమళింపజేయడమే అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు అసలైన నివాళి అని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత 69వ జయం తి వేడుకలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా జరి గాయి. రూ.13.42 కోట్ల ఖర్చుతో రూపొం దించిన ఈ మొక్కలు నాటే పథకాన్ని అన్నాశాలైలోని ప్రభుత్వ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటడం ద్వారా సీఎం ప్రారంభించారు. ఎడపాడి కేబినెట్‌లోని 30 మంది మంత్రులు పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో ఉచిత ప్రత్యేక వైద్యశిబిరాలను మంత్రులు జయకుమార్, విజయభాస్కర్‌ప్రారంభించారు.
జయలలిత జయంతి సందర్భంగా ఈనెలలో ప్రారంభవైున ఈ పథకం కింద 69 లక్షల మొక్కలు నాటేపనులను డిసెంబరు ఆఖరులోగా పూర్తి చేయాలని సీఎం సూచించారు. వనాల్లో, విద్యాసంస్థల్లో, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయ ప్రాంగణాల్లో మొక్కలు నాటాలని కోరారు. ఇటీవల రాష్ట్రంలోని పలు ప్రాంతాలను కుదిపేసిన వర్దా తుపాన్ వల్ల కోల్పయిన పచ్చదనాన్ని ఈ పథకం ద్వారా భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. 2,20 లక్షల మొక్కలను ప్రజలకు రాయితీపై పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల బంగాళాఖాతంలో రెండు నౌకలు ఢీకొని సముద్ర జలాల కలుషితం వల్ల బాధిత 30వేల జాలర్ల కుటుంబాలకు రూ.5వేలు చొప్పున నష్టపరిహారాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు.
పార్టీ కార్యాలయంలో: అలాగే చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో జయ జయంతి వేడుకలను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ప్రారంభించగా ముఖ్యమంత్రి ఎడపాడి, ప్రిసీడియం చైర్మన్ సెంగొట్టయ్యన్ మంత్రులు పాల్గొన్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో జరిగిన అమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా కేవలం పది నిమిషాల్లో కార్యక్రమాలను ముగించారు.
పన్నీర్‌సెల్వంకు ఉద్వాసన, ఎడపాడికి సీఎం పట్టం, శశికళ జైలుపాలు, ఉప ప్రధాన కార్యదర్శిగా ఆమె అక్క కుమారుడు దినకరన్ నియామకం వంటి పరిణామాలు తమను బాధించినట్లుగా కార్యకర్తలు వ్యవహరించారు. అన్నాడీఎంకే నిర్వాహక కార్యదర్శి గోకుల ఇందిర కీల్‌పాక్‌లోని బాలవిహార్ శిశు సంరక్షణా కేంద్రంలో అన్నదానం చేశారు. చెన్నై నంగనల్లూరు సహకార సంఘ కార్యాలయంలో జయ జయంతి వేడుకలు జరిపారు. జయ జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించడాన్ని పీఎంకే అధ్యక్షుడు డాక్టర్ రాందాస్ ఆక్షేపించారు