సాక్షి, చెన్నై: కరోనా ఐసోలేషన్ వార్డులో చేరిన ముగ్గురు రోగులు శనివారం మరణించడంతో తమిళనాడులో కలకలం రేగింది. అయితే ఈ ముగ్గురికి కరోనా సోకిందా, లేదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ‘చనిపోయిన ముగ్గురు వివిధ అనార్యోగాలతో బాధపడుతున్నారు. కోవిడ్-19 నిర్ధారణ పరీక్ష ఫలితాల కోసం వేచి చూస్తున్నామ’ని తమిళనాడు వైద్య శాఖ కార్యదర్శి బీలా రాజేశ్ తెలిపారు. మృతుల్లో 66 ఏళ్ల వ్యక్తికి కిడ్నీ సమస్య , 2 ఏళ్ల బాలుడికి ఎముకల వ్యాధి, మరో 24 ఏళ్ల వ్యక్తికి న్యుమోనియా ఉన్నట్లు వెల్లడించారు.
తమిళనాడులో ఇప్పటివరకు 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపట్టింది. ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై తరగతులకు ప్రమోట్ అయ్యేలా ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 24న వాయిదా పడ్డ ఇంటర్ సెకండియర్ పరీక్షా తేదీ వివరాలను తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment