ప్రియుడి సహా పట్టుబడ్డ నూతన వధువు | Including the capture of the new bride boyfriend | Sakshi

ప్రియుడి సహా పట్టుబడ్డ నూతన వధువు

Apr 2 2015 1:34 AM | Updated on Sep 2 2017 11:42 PM

గత నెల 28న 20 పౌన్ల నగలు, రూ. 5 వేలు నగదుతో అదృశ్యమైన నూతన వధువును సూళగిరి పోలీసులు ప్రియునితో సహా పట్టుకున్నారు.

హొసూరు : గత నెల 28న 20 పౌన్ల నగలు, రూ. 5 వేలు నగదుతో అదృశ్యమైన నూతన వధువును సూళగిరి పోలీసులు ప్రియునితో సహా పట్టుకున్నారు. వివరాల మేరకు సూళగిరి సమీపంలోని మాదరసనపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్(23)కు బేరికె సమీపంలోని గురునైపల్లి  గ్రామానికి చెందిన శశికళ(19)తో ఫిబ్రవరి 23న పెళ్లి జరిగింది. ఈ తరుణంలో మార్చి 28వ తేదీ శశికళ 20 పౌన్ల నగలు, రూ. 5వేలు అదృశ్యమైయ్యింది. ఈ ఘట నపై  భర్త చంద్రశేఖర్ సూళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ తరుణంలో శశికళ గురునైపల్లి గ్రామానికి చెందిన  క్రిష్ణమూర్తి (25) ఇంట్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు గురునైపల్లి గ్రామానికి చేరుకొని క్రిష్ణమూర్తి ఇంట్లో ఉన్న శశికళను అదుపులోకి తీసుకొన్నారు.

విచారణలో శశికళ 10వ తరగతి చదువుతున్న సమయంలో క్రిష్ణమూర్తితో పరిచయం ఏర్పడి ప్రేమించుకొన్నారు.  ఈ విషయంపై శశికళ తన తల్లితండ్రులకు తెలిపింది. వారు ఈ పెళ్లికి నిరాకరించి మాదరసనపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌తో పెళ్లి జరిపించారని, తర్వాత ఫోన్‌ద్వారా క్రిష్ణమూర్తితో మాట్లాడిన శశికళ తనను భర్త ఇంటి నుంచి తీసుకెళ్లమని మొరపెట్టుకోవడంతో  మాదరసనపల్లిలోని వినాయక దేవాల యానికి రమ్మని క్రిష్ణమూర్తి.. శశికళను తీసుకెళ్లినట్లు పోలీ సుల విచారణలో తేలింది. పోలీసులు ఇరువురిని అరెస్టు చేసి హొసూరు కోర్టులో హాజరుపరచనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement