Krishnamurti
-
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కృష్ణమూర్తి కన్నుమూత
దాచేపల్లి (గురజాల): కేంద్ర సాహిత్య అకాడ మీ అవార్డు గ్రహీత చిట్టిప్రోలు కృష్ణమూర్తి (85) గురువారం కన్ను మూశారు. కొంతకా లంగా అనారో గ్యంతో బాధపడుతూ హైదరా బాద్ లో కుమారుడి వద్ద ఉంటున్న ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. ఆయన కు భార్య సరస్వతి, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఒక కుమారుడు గతంలోనే మరణించారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడులో చిట్టిప్రోలు వెంకట రత్నం, కనకమ్మ దంపతులకు 1936 డిసెంబర్ 26న జన్మించిన కృష్ణమూర్తి స్వగ్రామంలో సుదీర్ఘ కాలం పోస్ట్ మాస్టర్గా పనిచేశారు. పద్యాలు, కవి తలపై ఆసక్తి మెండు. ఆయన కలం నుంచి కైకేయి, తరంగణి, అక్షర దేవాలయం, పురుషో త్తముడు.. వంటివి జాలువారాయి. మహిషా సుర శతకము, మాఘ మేఘములు అనే సంస్కృత కావ్యాలను అదేపేరుతో తెలుగులోకి అనువదించారు. ఆయన రచించిన ‘పురుషోత్త ముడు’ కావ్యానికి 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. -
గ్రాస్ రూట్ ఆర్ట్ వరిగడ్డితో కళాఖండాలు
పచ్చని పంటచేలో మట్టితో మమేకమయ్యే ఆ చేతులు... గడ్డిపోచలతో విన్యాసాలు చేస్తాయి. గిత్తల గిట్టల చప్పుళ్లతో జత కలిసి నాగేటిచాళ్లలో తిరగాడే ఆ కాళ్లు... సన్నటి గడ్డి దారాలను రూపొందించడంలో, పేనడంలో సాయం పడతాయి. బంగారు వర్ణాల కంకులను చూసి మెరిసిపోయే ఆ కళ్లు... నిశిత దృక్కులతో పెక్కు కళాఖండాలను ఆవిష్కరిస్తాయి. సత్తువ ఉడుగుతుందని అనుకునే ఎనిమిది పదులకు చేరుతున్న ఆయన వయసు ఉరకలెత్తుతున్న ఆ నైపుణ్యం ముందు తలవాల్చి ఎందరికో స్ఫూర్తినిస్తుంది. ఆయనే కృష్ణమూర్తి అనే ఓ మామూలు రైతు. గడ్డిపరకల విన్యాసం కాదది... గడ్డిపర‘కళ’ల కళావైభవం. ఈ గరికపర‘కళ’లను ఆవిష్కరిస్తున్న ఆయన పేరు మువ్వా కృష్ణమూర్తి. ఊరు ప్రకాశం జిల్లాలోని పర్చూరు మండలానికి చెందిన వీరన్నపాలెం గ్రామం. వరిగడ్డి పశువులమేతకు తప్ప మరెందుకూ పనికిరాదని మనలో చాలామంది అనుకుంటుంటారు. కానీ కృష్ణమూర్తి దాన్ని అబద్ధం చేశారు. అందరిలాగే తానూ పంటలు పండించటం వరకే పరిమితమైతే ఏం లాభం... తనకంటూ ప్రత్యేకత ఉండాలని భావించాడా కృషీవలుడు. ఆసక్తి ఉండాలేగానీ మామూలు వ్యవసాయదారుడు కూడా కళాకారుడవుతాడని నిరూపించాడా నిరుపేదరైతు. అద్భుత కళాఖండాలను సృష్టిస్తున్నారాయన. ఆ కళాకృతులను చూస్తే ఆశ్చర్యాలే. వాటిని మలిచే ఆ ముడిసరుకును చూస్తే అబ్బురాలే. అటు గరికపోచలే కాదు... కొన్నిసార్లు తుంగపీచులు, జొన్నఈనెలు, ఈతఆకులు వగైరాలతో సున్నితంగా పేనుకుంటూ, వాటిని ప్రయోజనకరమైన వస్తువులుగా రూపొందించేందుకు పూనుకుంటున్నారు. కొన్ని అందమైన పనిముట్ల నమూనాలను కూడా మలుస్తుంటారు. అయితే సహజంగా సేద్యం చేసేవాడు కదా... తన వ్యవసాయాభిరుచితో, తన కళాభిరుచిని కలగలిపి ‘పొలంపనిముట్ల’ నమూనాలనూ తయారు చేస్తుంటారు. ఎవరీ కృష్ణమూర్తి... మువ్వా కృష్ణమూర్తి ప్రకాశం జిల్లా, పర్చూరు మండలం, కొమర్నేనివారిపాలెం గ్రామంలో 07–04–1942న పుట్టారు. తండ్రి పేరు సుబ్బన్న, 1965లో తన పెళ్లయినప్పట్నుంచి వీరన్నపాలెం గ్రామంలో నివాసం ఉంటున్నారు. చదివింది ప్రాథమిక విద్య మాత్రమే. పిల్లలంతా స్థిరపడ్డారు. ప్రస్తుతం తన కూతురు వద్దే నివాసం. అందరిలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలనే తపన చిన్ననాటినుంచీ ఉండేది. దాంతో... కళాత్మకమైన వస్తువులు, పనిముట్లు తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. ఆ ప్రయత్నంలో వరిగడ్డి, తుంగనార, జొన్నఈనెలు, తాటాకులు, కొబ్బరి నార, చిప్పెరకంకి, జమ్ము... ఇలా రకరకాలైన వస్తువులతో తొలుత వస్తువుల తయారీకి ప్రయత్నించాడు. ‘పరకా’యించి చూశాడు... ఒకరోజు గడిపరకను పరకాయించి చూస్తుండగా ఓ ఆలోచన వచ్చింది. గడ్డిపరకలతో చీరనేస్తే ఎలా ఉంటుందన్నదే ఆయన యోచన. తన యోచననూ... ఆలోచననూ కార్యరూపంలో పెట్టాడు. పని మొదలైంది కానీ పట్టుచిక్కలేదు. ఎన్నిసార్లు నేసినా గడ్డి విరిగిపోతోంది. దాంతో వరిగడ్డిని తొలుత బాగా ఎండనిచ్చారు. దానిని చాకుతో సన్నగా నిలువుగా కత్తిరించారు. ఆ పోగులను సన్నని దారాలుగా పేనారు. ఆ చిన్న చిన్న దారం ముక్కలను కలుపుకుంటూ పొడవైన దారంగా మలచుకున్నారు. వీటికోసం ఆయన ఎలాంటి పరికరాలనూ వాడలేదు. ఏ ఉపకరణాలనూ ఉపయోగించలేదు. అన్నీ తన చేతుల్తోనే. ఓర్పుగా, నేర్పుగా చేసుకుంటూ పోతున్నకొద్దీ తన నిపుణతలోనూ మార్పు కనిపించింది. ఎంతో శ్రమించి చెర్నోకోల, నాగలి, సిగమారలు, చిక్కాలు, కండువ, చీర, రవిక, చేతి సంచులు వంటి వస్తువులును తయారు చేశారు. వరిగడ్డి త్వరగా చేడిపోదు కాబట్టి దానిని భద్రపర^è డంలో ఇబ్బంది ఏమీ ఉండదని అంటారాయన. ఈ కళాకారుడి ప్రతిభకి స్థానికుల నుంచే కాక, రాష్ట్ర, జాతీయ స్థ్దాయిలో కూడా అనేక ప్రశంసలు అందాయి. తాను నేసిన వరికండువాను భారత రాష్ట్రపతికీ, ప్రధానమంత్రికీ బహూకరించాలన్నది కృష్ణమూర్తి ఆలోచన. వరిగడ్డితో రూపొందించిన ఆ కళాకృతులను చూసిన ఎందరో పెద్దల నుంచి ప్రశంసలే కాదు... రెండు పదులకు మించి మరెన్నో పురస్కారాలందుకున్నారు మువ్వా కృష్ణమూర్తి. రాష్ట్రస్థాయిలో పశుసంవర్ధక శాఖతో పాటు అనేక సంస్థల నుంచి నుంచి చాలా సత్కారాలనూ, పురస్కారాలను పొందారు. తనతోనే ఈ కళ అంతరించిపోకుండా తర్వాత కూడా కొనసాగాలన్నదే ఆయన కోరిక. – పాలేరు శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి, పర్చూరు ముందుకెవ్వరూ రావడం లేదు నా వయసిప్పుడు 78 ఏళ్లు. ఇప్పటికీ నా పనులు నేనే చేసుకుంటుంటాను. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాను. నాలో ఓపిక నశించేలోగా నా కళను ఇతరులకు నేర్పాలన్నది నా ఆలోచన. ఔత్సాహికులెవరైనా ముందుకొస్తే తప్పకుండా నేర్పుతాను. – మువ్వా కృష్ణమూర్తి -
బీసీలకు మూడో వంతు నామినేటెడ్ పోస్టులేవీ?
సాక్షి, అమరావతి: బీసీలకు 1/3 వంతు నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించారని వైఎస్సార్ సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి విమర్శించారు. శుక్రవారం విజయవాడలోని ఐవీ ప్యాలెస్లో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ బీసీ కులాల అధ్యయన కమిటీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం జంగా విలేకరులతో మాట్లాడుతూ... టీడీపీ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలూ బాధలు పడుతున్నారన్నారు. ముఖ్యంగా బీసీలను టీడీపీ వాడుకుని వదిలేసిందని విమర్శించారు. చంద్రబాబు సర్కారు విద్యా విధానాన్ని సర్వనాశనం చేసిందన్నారు. సంక్షేమ హాస్టళ్లను మూసివేసిందని ధ్వజమెత్తారు. వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా పేద విద్యార్థులకు ఉచితంగా ఉన్నత చదువులు అభ్యసించే అవకాశం కల్పించారని, చంద్రబాబు సర్కారు ఈ పథకానికి తూట్లు పొడుస్తోందని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, ఇప్పుడు నాలుగున్నరేళ్ల తర్వాత కేవలం లక్షన్నర మందికి రూ.వెయ్యి ఇస్తున్నారన్నారు. బీసీల్లో సంచార జాతులు దీనావస్థలో ఉన్నాయని, వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అధ్యయన కమిటీ దృష్టికి వచ్చిన సమస్యలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తరువాత తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి నివేదిక అందజేస్తామని తెలిపారు. మాజీ మంత్రి, అధ్యయన కమిటీ సభ్యులు నర్సేగౌడ్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ హామీ ప్రకారం ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేదవారికి సాయం చేస్తామని చెప్పారు. రిటైర్డ్ జడ్జి కృష్ణప్ప మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో బీసీలను మోసం చేసేందుకు చంద్రబాబు బీసీ అధ్యయన కమిటీ వేసినట్లు ఆరోపించారు. వైఎస్పార్ సీపీ బీసీ అధ్యయన కమిటీ సభ్యులు అవ్వారు ముసలయ్య మాట్లాడుతూ.. పార్టీలతో సంబంధం లేకుండా బీసీ కులాల వారు అధ్యయన కమిటీ వద్దకు వచ్చి సమస్యలు చెబుతున్నారన్నారు. వాటిపై అధ్యయనం చేసి నివేదిక ఇస్తామన్నారు. సమావేశంలో పార్టీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, వసంత కృష్ణప్రసాద్, సామినేని ఉదయభాను, జోగి రమేష్, రక్షణ నిధి, మహమ్మద్ ఇక్బాల్, చిమటా సాంబు, బొమ్మన శ్రీనివాస్, కర్నాటి ప్రభాకర్, దుర్గారావుగౌడ్, విజిత, మహబూబ్, మీసాల రంగన్న పాల్గొన్నారు. -
ప్రియుడి సహా పట్టుబడ్డ నూతన వధువు
హొసూరు : గత నెల 28న 20 పౌన్ల నగలు, రూ. 5 వేలు నగదుతో అదృశ్యమైన నూతన వధువును సూళగిరి పోలీసులు ప్రియునితో సహా పట్టుకున్నారు. వివరాల మేరకు సూళగిరి సమీపంలోని మాదరసనపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్(23)కు బేరికె సమీపంలోని గురునైపల్లి గ్రామానికి చెందిన శశికళ(19)తో ఫిబ్రవరి 23న పెళ్లి జరిగింది. ఈ తరుణంలో మార్చి 28వ తేదీ శశికళ 20 పౌన్ల నగలు, రూ. 5వేలు అదృశ్యమైయ్యింది. ఈ ఘట నపై భర్త చంద్రశేఖర్ సూళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ తరుణంలో శశికళ గురునైపల్లి గ్రామానికి చెందిన క్రిష్ణమూర్తి (25) ఇంట్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు గురునైపల్లి గ్రామానికి చేరుకొని క్రిష్ణమూర్తి ఇంట్లో ఉన్న శశికళను అదుపులోకి తీసుకొన్నారు. విచారణలో శశికళ 10వ తరగతి చదువుతున్న సమయంలో క్రిష్ణమూర్తితో పరిచయం ఏర్పడి ప్రేమించుకొన్నారు. ఈ విషయంపై శశికళ తన తల్లితండ్రులకు తెలిపింది. వారు ఈ పెళ్లికి నిరాకరించి మాదరసనపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్తో పెళ్లి జరిపించారని, తర్వాత ఫోన్ద్వారా క్రిష్ణమూర్తితో మాట్లాడిన శశికళ తనను భర్త ఇంటి నుంచి తీసుకెళ్లమని మొరపెట్టుకోవడంతో మాదరసనపల్లిలోని వినాయక దేవాల యానికి రమ్మని క్రిష్ణమూర్తి.. శశికళను తీసుకెళ్లినట్లు పోలీ సుల విచారణలో తేలింది. పోలీసులు ఇరువురిని అరెస్టు చేసి హొసూరు కోర్టులో హాజరుపరచనున్నారు.