పన్నీర్‌ ఇంట ‘దీప’o | Deepa announced support to Paneer | Sakshi
Sakshi News home page

పన్నీర్‌ ఇంట ‘దీప’o

Published Wed, Feb 15 2017 3:43 AM | Last Updated on Sun, Sep 2 2018 5:28 PM

పన్నీర్‌ ఇంట ‘దీప’o - Sakshi

పన్నీర్‌ ఇంట ‘దీప’o

పన్నీర్‌కు మద్దతు ప్రకటించిన దీప

సాక్షి, చెన్నై: తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వానికి అమ్మ జయలలిత మేనకోడలు దీప తోడయ్యారు. మెరీనాతీరం వేదికగా జయలలిత సమాధి సమక్షంలో మంగళవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఆమె పన్నీర్‌ శిబిరంలో చేరారు. అన్నాడీఎంకేలోకి ఇదే తన రాజకీయ అరంగ్రేటమని ప్రకటించారు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు వ్యతిరేకంగా దీప గళమెత్తిన విషయం తెలిసిందే.

ఈనెల 24న మేనత్త జయంతి రోజున రాజకీయంగా కీలక నిర్ణయం ప్రకటిస్తానని ఆమె ఇప్పటికే ప్రకటించారు. ఆ మేరకు దీప పేరవై వర్గాలతో, తన ఇంటికి తరలివస్తున్న అమ్మ అభిమానులతో సంప్రదింపులు జరిపారు. ఈ పరిస్థితుల్లో పన్నీర్‌సెల్వం తిరుగుబాటు చేయడంతో శశికళ వ్యతిరేకులు అటువైపు తరలడం మొదలెట్టారు. అదే సమయంలో తమ శిబిరంలోకి రావాలని పన్నీర్‌ ఇప్పటికే పలుమార్లు దీపకు ఆహ్వానం పలికారు. ఆ మేరకు ఆమె మంగళవారం రాత్రి పన్నీర్‌ శిబిరంలో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement