సెల్వం... పన్నీర్‌ సెల్వం! | Paneer kabali Viral in the Social media | Sakshi
Sakshi News home page

సెల్వం... పన్నీర్‌ సెల్వం!

Published Sat, Feb 11 2017 2:31 AM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

సెల్వం... పన్నీర్‌ సెల్వం! - Sakshi

సెల్వం... పన్నీర్‌ సెల్వం!

  • సామాజిక మాధ్యమాల్లో పన్నీర్‌ కబాలి వైరల్‌
  • పన్నీర్‌ ఇంటి నుంచే పార్టీ ఐటీ విభాగం ప్రచారం
  • సోషల్‌ మీడియా ద్వారా ప్రజా మద్దతు
  • చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పార్టీ శ్రేణుల మద్దతు కూడగట్టడానికి గట్టిగా ప్రయత్నిస్తున్న ఆపద్ధర్మ ముఖ్య మంత్రి పన్నీర్‌ సెల్వం మరో వైపు ప్రజల మద్దతు కూడా సంపాదించేందుకు అన్నాడీఎంకే ఐటీ విభాగాన్ని రంగంలో కి దించారు. వారు 3 రోజులుగా పన్నీర్‌ ఇంటినుంచే సోషల్‌ మీడియాలో ప్రజల నుంచి ఎమ్మెల్యేల మీద ఒత్తిడి పెంచే వ్యూహం అమలు చేస్తున్నారు. పార్టీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) విభాగాన్ని పన్నీర్‌ తన శిబిరంలోకి చేర్చు కున్నారు.

    ఈ విభాగం బాధ్యులకు తన ఇంటి ఆవరణలోనే కొంత స్థలం ఇచ్చి వాట్సాప్, ట్వీటర్, ఫేస్‌బుక్‌ లాంటి సోషల్‌ మీడియా ద్వారా శశికళకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యేల ఫోన్‌ నంబర్లన్నీ సామాజిక మాధ్య మాల్లో పోస్టు చేసి మీ ఎమ్మెల్యేను పన్నీర్‌కు మద్దతు ఇవ్వమని సందేశాలు పంపాలని అభ్యర్థించారు. ప్రజలు కూడా తమ ఎమ్మెల్యేలకు, వారి కుటుంబ సభ్యులకు సెల్వంకు మద్దతు ఇవ్వాలని పోస్టింగ్‌లు, మెసేజ్‌లు పంపు తున్నారు. ఈ రకంగా ఎమ్మెల్యేల మీద ఒత్తిడి పెంచి శశికళ శిబిరం నుంచి బయటకు తెచ్చేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నారు.

    సోషల్‌ మీడియా ప్రచారంలో భాగంగా కబాలి సినిమాలో రజనీకాంత్‌ పాపులర్‌ డైలాగ్‌  ‘ముఖం మీద గాటుపెట్టుకుని, మీసం తిప్పి, లుంగీకట్టుకుని పాత విలన్‌ ‘ఏయ్‌ కబాలి’ అనగానే ఒంగొని ఎస్‌ బాస్‌ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నార్రా’ అనే డైలాగ్‌ను ‘పాత రోజుల్లోలా నుదుటున బొట్టు పెట్టుకుని పంచె కట్టుకుని ‘ఏయ్‌ పన్నీర్‌’ అని పిలవగానే చిత్తం చిన్నమ్మా అని వినయంగా నిల్చుంటాననుకున్నావా? సెల్వం.. పన్నీర్‌ సెల్వం’ అంటూ రజనీకాంత్‌ ఫొటోలో పన్నీర్‌ తల పెట్టి గ్రాఫిక్‌ చేసిన ఫొటో, వీడియో ఇప్పుడు తమిళ, తెలుగు భాషల్లో వైరల్‌గా మారింది. కబాలి సినిమాలో రజనీ డైలాగ్‌ జనాన్ని ఎంత ఆకట్టుకుందో ఇప్పుడు పన్నీర్‌ò డైలాగ్‌ కూడా టైమ్లీగా అంతే స్థాయిలో పేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement