అరెస్టులు చూపించకుండా మంతనాలు
Published Fri, Jan 6 2017 12:00 AM | Last Updated on Tue, Sep 5 2017 12:30 AM
రంగంలోకి టీడీపీ ప్రముఖులు
‘ఓ నయీం ముఠా’కు పోలీసుల మద్దతు
సాక్షి, రాజమహేంద్రవరం : నకిలీ డాక్యుమెంట్లతో రూ. 4 కోట్ల విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న కేసులో ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ పోలాకి పరమేశ్వరరావు, హార్డ్‌వేర్ వ్యాపారి ఆకుల సాయిబాబా అరెస్ట్‌లను చూపించకుండా టీడీపీ పెద్దలు రంగంలోకి దిగారు. అరెస్ట్ కాకుండా హైకోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చా యంటూ బ్యాంకుకు వెళ్లిన పరమేశ్వర రావును, దుకాణానికి వచ్చిన సాయిబాబాను ఒకటోపట్టణ ఎస్సై సీహెచ్ రాజశేఖర్ బుధ వారం మ«ధ్యాహ్నం అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వారు చెప్పిన ఉత్తర్వు లు ఒక లాయర్ ఇచ్చిన కాపీ కావడంతో పోలీసులు వాటిని తిరస్కరించారు. దీంతో టీడీపీ పెద్దలు రంగంలోకి దిగి వారిని అరెస్ట్ చేయకుండా ఒత్తిడి చేశారు. లాయర్ ఇచ్చిన కాపీతో వదిలిపెట్టాలని జిల్లాకు చెందిన ‘ఉప’ముఖ్య నేత పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. అప్పటికే ఈ విషయం మీడియాకు తెలియడంతో వ్యవహారం గురువారం 11 గంటల వరకు నడిచింది. ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ చల్లా శంకరరావు, పలువురు డైరెక్టర్లు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. పోలీసులతో మంతనాలు జరిపారు. హైకోర్టు ఉత్వర్వులే లాయర్ తన లెటర్‌హెడ్‌లో ఉత్తర్వుల నంబర్‌తో పంపిం చాడని వాదించి. తాము స్థలం యజమానితో రాజీ చేసుకుంటా మంటూ తమ సొంత పూచీకత్తుపై విడింపించుకుని వెళ్లారు.
నిందితులకు పోలీసులకు మద్దతు..?
బాధితుడు బండారు వెంకటరమణ తన స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్టర్ చేయించుకున్నా రని డిసెంబర్ 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అప్పటి నుంచి కూడా ఏ ఒక్కరినీ పట్టుకోలేదు. గుంటూరులో ఉన్న 1/4 వాటా యజమాని వరదరాజులనాయుడు వద్దకు వెళ్లగా ఆయన కదలలేని స్థితిలో ఉండడంతో జరిగిన విష యాన్ని ఓ పేపర్‌పై రాయించుకుని వచ్చారు తప్ప అసలు నిందితులను పట్టుకోలేదు. అరెస్ట్‌లు కాకుండా ఉత్తర్వులు తెచ్చుకునేందుకు వారు విశాఖపట్నం, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు కొంత మంది వెళ్లగా, మరికొంత మంది నగరంలోనే ఉంటున్నారు. ఇక సాధ్యం కాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. తరచూ స్నేహితులతో తమ మొబైల్ నుంచి మాట్లాడుతున్నారు. అయినా పోలీసులు వారిని పట్టుకోకపోవడం గమనార్హం. ఈ వ్యవహారంలో నిందితులు అరెస్ట్ కాకుండా ఉత్తర్వులు తెచ్చుకునేందుకు పోలీసులకు పెద్ద మొత్తంలో ముడుపులు అందాయన్న ఆరోపణలు వస్తున్నాయి. చివరికి బుధవారం ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ పోలాకి పరమేశ్వరరావు, ఆకుల సాయిబాబాలను కూడా ప్రైవేటు వ్యక్తుల ప్రోద్బలంతోనే అరెస్ట్ చేయడం గమనార్హం.
Advertisement
Advertisement