Charles Darwin
-
వేలంలో రూ.కోట్లు పలికిన చార్లెస్ డార్విన్ ఆటోగ్రాఫ్ పేపర్
న్యూయార్క్: ప్రముఖ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ తన స్వహస్తాలతో రాసిన ఓ ప్రతి వేలంలో రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఈ పేపర్‌పై డార్విన్ పూర్తి పేరుతో సంతకం ఉంది. ఇలాంటి లేఖ అత్యంత అరుదుగా లభిస్తుంది. నేచురల్ సెలక్షన్ థియరీకి సంబంధించిన సమ్మేషన్‌ను ఈ ప్రతిలో రాశారు డార్విన్. దీంతో ఈ పేపర్‌ను ఓ ఓత్సాహికుడు రూ.7.2కోట్లకు(8.82లక్షల డాలర్లు) కొనుగోలు చేశాడు. డార్విన్ ఫుల్ ఆటోగ్రాఫ్‌తో కూడిన అత్యంత ముఖ్యమైన ప్రతి ఇదేనని నిర్వాహకులు తెలిపారు. వేలంలో ఇదే రికార్డు ధర అని పేర్కొన్నారు. చదవండి: ఆరుగురు భార్యలు.. 54 మంది పిల్లలు.. గుండెపోటుతో మృతి.. -
డార్విన్ సంతకంతో కూడిన లేఖ వేలంలో ఎంత పలుకుతోందంటే...
ప్రముఖ బ్రిటన్ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ అంటే తెలియని వారుండరు. అతని పేరు తలుచుకుంటే గుర్తోచ్చేది జీవ పరిణామ సిద్ధాంతం. అంతా గొప్ప శాస్త్రవేత్తకు ప్రతిపాదించిన జీవ పరిణామా సిద్ధాంతానికి సంబంధించిన ఒక పత్రం వెలుగులోకి వచ్చింది. అదికూడా ఆయన సంతకంతో కూడిని లేఖ కావడం విశేషం. వాస్తవానికి ఆయన పరిశోధనల గురించి క్రమం తప్పకుండా ఒక ప్రతిలో నోట్ చేసి ఉండనందున ఆయనకు సంబంధించిన రచనలు ఇంత వరకు సరిగా దొరకలేదు. ఒక వేళ దొరికినా వాటిలో సాధారణంగా డార్విన్ లేదా సీహెచ్ డార్విన్ అని మాత్రమే ఉంటుంది. కానీ అతని పూర్తి పేరుతో సంతకం చేసిని లేఖ దొరకడం అత్యంత అరుదు. ఈ మేరకు డార్విన్ ఆన్‌లైన్‌గా పిలిచే డేటాబేస్ క్యూరేటర్ ప్రొఫెసర్ జాన్ వాన్ వైహే మాట్లాడుతూ అత్యంత గొప్ప శాస్త్రవేత్త సంతకంతో కూడిన ప్రతి చాలా ప్రత్యకమైనది. అది ఆన్ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ మూడవ ఎడిషన్‌లో భాగానికి సంబంధించిన లేఖగా పేర్కొన్నారు. ఈ లేఖ న్యూయార్క్‌లోని సోథెబైస్ వేలంలో సుమారు రూ. 9 కోట్లు పలుకుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ లేఖలో డార్విన్...ఇందులో అసలు వాస్తవాలను పరిగణలోనికి తీసుకుని వెల్లడిస్తాను. జీవులు వాటి జాతుల వర్గీకరణ వైవిద్యాలను ఆ పరిణామ సిద్ధాంతం వివరిస్తోంది. ఒక్కోసారి ఆ వర్గీకరణ కూడా తప్పుగా ఉండొచ్చు. అదీ క్రమంగా తప్పుడు సిద్ధాంతాన్ని వివరించకూడదు. జీవ సారాంశం, దాని మూలం గురించి సమగ్రంగా వివరించడం అనేది కొంచెం క్లిష్టతరమైనదిగా పేర్కొనవచ్చు. అలాగే న్యూటన్ గురత్వాకర్షణ సిద్ధాంతం సారాంశం ఏంటనేది కచ్చితంగా వివరించలేం. కానీ న్యూటన్ తన పరిశోధనల్లో తత్వశాస్త్రంలోని అద్భుతమైన కొత్త సిద్ధాంతాలను పరిచయం చేశాడన్నారు. (చదవండి: మరణించిన వారిని మళ్లీ పునర్జీవింప చేసే సంస్థ...మళ్లీ బతకాలని....) -
నిజం... నిజం... డార్వినిజం
ఈ భూమి మీద మానవునితో సహా సకల జీవజాతులూ యథాతథంగా సృష్టించబడ్డాయనీ సంప్రదాయంగా ఉన్న వాదనలను సవాలు చేశాడు డార్విన్. ఆయన ప్రవచించిన జీవపరిణామ సిద్ధాంతం సైన్సుకు నూతన దృక్కోణాన్ని ప్రసాదించింది. ఆయన వాదనలను వ్యతిరేకించేవాళ్లు అప్పుడే కాదు, ఇప్పుడూ ఉన్నారు. ‘కోతి నుండి మనుషులొస్తే ఇంకా కోతులెందుకున్నాయి?’ అని ప్రశ్నించే రాజకీయ తరగతి ఒకటి బయలుదేరింది. కానీ నిరూపిత సత్యాలను విశ్వాసాలు ఎదుర్కోలేవు. ఆఖరికి గత నెలలో పంది గుండెను మనిషికి అమర్చారన్న వార్త ఏం సూచిస్తున్నది? పాలిచ్చే జంతువులైన పంది, మనిషి మధ్య ఒక సజీవ సంబంధం ఉందనేగా! వెలుగు చూస్తున్న నూతన సమాచారం డార్విన్ జీవ పరిణామ సిద్ధాంత ఔన్నత్యాన్ని పెంచుతూనే ఉంది. సమస్త చరాచర జగత్తు భగవంతుని సృష్టి అని ప్రబలంగా విశ్వసిస్తున్న కాలంలో ఒక వినూత్న ఆలోచనకు బీజం వేసినవాడు బ్రిటన్‌కు చెందిన ప్రకృతి, జీవ, భూగర్భ శాస్త్రవేత్త ఛార్లెస్ డార్విన్ (1809–1882). జీవ జాతుల పుట్టుకపై 1859వ సంవత్సరంలో డార్విన్ రాసిన ‘జాతుల ఆవి ర్భావం’ (ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్) ఒక సత్యాన్ని ఆవిష్కరించింది. ఆ సత్యమే ‘పరిణామం’. అప్పట్లో అదొక సంచలనం. ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపింది. ఈ భూమిపై నెలకొన్న అనంత జీవవైవిధ్యం పరిణామ ఫలితమని చాటాడు డార్విన్. మనం చూస్తున్న జీవులు, వాటి పూర్వీకుల నుండి పరిణామం చెంది భిన్న రూపాలను సంతరించుకున్నవే. తద్వారా నాటి వాతా వరణ పరిస్థితులను తట్టుకొని పరిణతి చెందటం జరిగింది. ఆ క్రమంలో సమర్థవంతంగా అనుకూలనం (అడాప్టేషన్) చెందినవి బతికి బట్ట కట్టాయనీ, తట్టుకోలేనివి నశించాయనీ చెప్పాడు. అలా నిలబడిన జీవులను ప్రకృతి ప్రోత్సహిస్తుందనీ, ఎంపిక చేస్తుందనీ సూత్రీకరించాడు. అదే డార్విన్ ప్రకృతివరణ సిద్ధాంతం (నేచురల్ సెలక్షన్ థియరీ)గా ప్రసిద్ధి చెందింది. ఇదేదో ఊహాజనిత వాదం కాదు. విస్తృత పరిశీలన, అధ్యయనం దీనికి మూలం. డార్విన్ చరిత్రాత్మక నావ ప్రయాణం ‘హెచ్.ఎం.ఎస్. బీగిల్’లో 1831లో మొదలైంది. 1836 వరకు ఐదేళ్లపాటు కొన సాగింది. ఆ నావ ప్రయాణంలో చూసిన అబ్బురపరిచే జీవ వైవిధ్యం, డార్విన్ మదిలో కొత్త ఆలోచనలకు తెర తీసింది. జీవజాతులు ఎందుకు భిన్నత్వాన్ని చూపుతాయి? వాటి మధ్య ఉన్న సంబంధానికి కారణమేమిటన్న ప్రశ్నలు, వాటికి జవాబుల శోధనలో డార్విన్ లెక్కకు మిక్కిలి సాక్ష్యాలను సేకరించాడు. పురాతన జీవులకు చెందిన శిలాజాలనెన్నింటినో సేకరించి భద్రపరిచాడు. డార్విన్ పరిశోధనకు పసిఫిక్ మహాసముద్రంలోని గెలాపాగోస్ దీవుల(ఈక్వెడార్) సందర్శన ఎంతో మేలు చేసింది. రాకాసి తాబేళ్ళు ఒక దీవి నుండి మరొక దీవికి విభిన్నంగా ఉన్నాయి. అక్కడి పక్షుల ముక్కు... ఆకారంలో, నిర్మాణంలో విశిష్ట అనుకూలనాన్ని ప్రదర్శిం చింది. గడ్డి మైదానాల్లో నివసించే జంతువులు సైతం విభిన్నత కన బరిచాయి. అర్జెంటీనాలో ఉండే జంతువులకూ, ఆస్ట్రేలియా గడ్డి మైదాన ఆవరణ వ్యవస్థలో జీవించే జీవులకూ మధ్య పోలికే లేదు. ఇవేవీ ఐరోపా జంతువులను పోలి లేవు. ఈ వైవిధ్యం జీవ పరిణామ సిద్ధాంతానికి ఒక శాస్త్రీయ ప్రాతిపదికనిచ్చింది. అదే సమయంలో తన దేశానికే చెందిన ప్రకృతి శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్ మలే సియాలో చేసిన క్షేత్రస్థాయి పరిశోధనలు కూడ జీవులు పరిణామం ద్వారానే ఆవిర్భవించాయనే భావనకు బలం చేకూర్చాయి. వాలెస్ అధ్యయనం దాదాపు రెండు దశాబ్దాల డార్విన్ ఊగిసలాటకు తెరదిం చింది. నిర్ణయం తీసుకోవడాన్ని వేగిరపరిచింది. ఎట్టకేలకు తన సిద్ధాంతాన్ని ‘జాతుల ఆవిర్భావం’గా ప్రతిపాదించాడు. జీవులు సృష్టి కాదనీ, పరిణామ క్రమంలో ఏర్పడ్డాయనీ, జీవుల మధ్య పరస్పర సంబంధం ఉన్నదనీ పరిణామ సిద్ధాంతం వెల్లడిం చింది. జీవ ప్రపంచం అంతా యథాతథ సృష్టి అనే సృష్టివాదానికి జీవ పరిణామ సిద్ధాంతం పెను సవాల్ విసిరింది. వేళ్ళూనుకుని ఉన్న మత విశ్వాసాన్ని కాదని సైన్సును అగ్ర భాగాన నిలిపింది. దీనిలో డార్విన్ సిద్ధాంతంపై పలు కోణాల నుండి విమర్శలు వచ్చాయి. జీవ పరిణామ శాస్త్రవేత్తలు హేళనకూ, కవ్వింపులకూ గురయ్యారు. థామస్ హక్సలే వంటి ఎందరో జీవశాస్త్రవేత్తలు సృష్టివాదుల విమర్శ లకు దీటుగా సమాధానం చెప్పారు. తొలినాళ్లలో డార్విన్ సిద్ధాంతం విమర్శలను ఎదుర్కోవటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ నేడు 21వ శతాబ్దిలో సైతం పరిణామ సిద్ధాంతంపై దాడులు ఆగటం లేదు. ‘కోతి నుండి మనుషులొస్తే ఇంకా కోతులెందుకున్నాయి? కోతి నుండి మనిషి రావడాన్ని చూడలే’ దనే రాజకీయ తరగతి ఒకటి బయలుదేరింది. నిజాన్ని చూడటం, సత్యాన్ని గ్రహించటం కొందరి వల్ల కాదు. ముఖ్యంగా సత్యాన్ని చూడ టానికి ఇష్టపడని వాళ్లకు. దాచేస్తేనో, దాడి చేస్తేనో కనుమరుగయ్యేది కాదు సత్యం. రుజువులు చూపి సత్యాన్ని నిరూపించేదే సైన్సు. అందుకే జీవ పరిణామ సిద్ధాంతం ప్రపంచ ఆలోచనా విధానాన్ని మార్చి వేసింది. భౌగోళిక విస్తరణ, విభిన్న జీవుల్లో కనిపించే ఏకరూప శరీర నిర్మాణాలు, పిండదశలో జీవులు చూపించే సారూప్యత, శిలాజ నిదర్శనాలు డార్విన్ సిద్ధాంతానికి బలం చేకూర్చాయి. డార్విన్ తరు వాతి కాలంలో అభివృద్ధి చెందిన సైన్సు సైతం జీవ పరిణామ సిద్ధాంతానికి మెరుగులు దిద్దటం విశేషం. వివిధ ప్రాంతాల తవ్వ కాల్లో దొరికిన పురాతన శిలాజాలు పూర్వీకుల లింకులను బయట పెట్టాయి. చేపల నుండి మనుషుల వరకు పిండాలన్నీ ఆరంభంలో ఒకే రకంగా ఉండటం జీవుల మధ్య సంబంధానికి గొప్ప రుజువు. వాతావరణ పరిస్థితులకు ‘అనుకూలనం’ చెందటాన్ని పరిణా మంలో కీలకంగా డార్విన్ భావిస్తే, మెండల్ పరిశోధనలు జీవుల లక్ష ణాలు ఒక తరం నుండి మరో తరానికి ఎలా బదిలీ అవుతాయో చూపించాడు. ఆ అనువంశిక లక్షణాలే జీవులు ‘అనుకూలనం’ చెంద టంలో కీలక పాత్ర పోషిస్తాయని బలమైన రుజువులు చూపాడు. జీవుల్లో మార్పులకు ‘ఉత్పరివర్తనాలు’ (మ్యుటేషన్స్) కారణమని చెప్పాడు. మెండల్ కాలానికి కూడా ఉత్పరివర్తనం చెందేవాటి భౌతిక రూపం తెలియదు. అందుకే మెండల్ వాటిని ‘కారకాలు’గా పేర్కొ న్నాడు. ఆధునిక జీవశాస్త్రం, ముఖ్యంగా జన్యుపదార్థం–డీఎన్ఏ ఆవి ష్కరణ తర్వాత వీటి వెనుక దాగిఉన్న రహస్యం ‘జన్యువులు’ (జీన్స్) అని తేల్చింది. నాటి నుండి నేటి వరకు వెలుగు చూస్తున్న నూతన సమాచారం డార్విన్ జీవ పరిణామ సిద్ధాంత ఔన్నత్యాన్నీ, సత్యాన్నీ ఆవిష్కరిస్తూనే ఉంది. గత నెలలో పంది గుండెను మనిషికి అమర్చారన్న వార్త ఏం సూచిస్తున్నది? పాలిచ్చే జంతువులైన పంది, మనిషి మధ్య ఒక సజీవ సంబంధం ఉందనేగా! కోతుల నుండి మనుషులు వచ్చారని డార్విన్ ఎక్కడా చెప్పలేదు. కోతులు, కొండముచ్చులు, చింపాంజీల వంటి జాతులకూ, మానవ జాతికీ మధ్య దగ్గరి పోలికలున్నాయనీ, ఇవన్నీ ఒకే మూలం నుండి వచ్చాయనీ, చింపాంజీల డీఎన్ఏ మనుషుల డీఎన్ఏతో 98.8 శాతం పోలి ఉంటుందనీ 2005లో వెలువరించిన చింపాంజీ జీనోమ్ చెబుతున్నది. సూక్ష్మజీవి నుండి మనిషి వరకూ అన్ని రకాల జీవులు ఒకేవిధమైన జీవన క్రియలను చూపుతాయి. అన్నింటిలో శ్వాసక్రియ ఒకే రకం. అన్ని జంతువులూ ఆక్సిజన్ తీసు కుని కార్బన్ డయాక్సైడ్ను వదులుతాయి. ప్రొటీన్లు, డీఎన్ఏ, ఆర్ఎన్ఏ, జీవాణువులు జీవజాతులన్నింటిలో ఒకే రకమైన పదా ర్థాలతో నిర్మితమై ఉంటాయి. ఇవన్నీ ఏమి సూచిస్తున్నాయి? జీవుల మధ్య పరస్పర సంబంధం ఉందనే కదా! పరిణామం చెందటం ద్వారానే శాఖోపశాఖలుగా విస్తరించాయని కదా! జీవ పరిణామ సిద్ధాంతం ఒక సైన్సు. కానీ ఎప్పటికీ ఇలాగే ఉంటుందనీ, ఉండాలనీ కోరుకునే వాళ్లకూ... ప్రతిదీ మార్పు చెందు తుందనీ, మార్పు సహజమనీ, ప్రపంచ గమనానికి మార్పు ఇరుసూ అని నమ్మేవాళ్లకూ మధ్య నాటి నుండి నేటి వరకూ ఘర్షణ జరుగు తూనే ఉంది. ‘‘ప్రస్తుతం పాతకొత్తల మధ్య, సత్యాసత్యాల మధ్య పోరాటం జరుగుతున్నది. బుద్ధిమంతులైనవారు ఏ పక్షంలో చేరాలో, అంతిమ విజయం ఎవ్వరిదో చెప్పనక్కర్లేదు. ఈ సంగ్రామం సుదీ ర్ఘంగా సాగవచ్చు. తీవ్రంగా ఉండవచ్చు. అయితే జ్ఞానం అజ్ఞానాన్ని, సత్యం అసత్యాన్ని తప్పక జయిస్తాయి’’ అన్న కందుకూరి వీరేశలింగం మాటలు నేటికీ, ఏనాటికీ కూడా అక్షర సత్యాలే.జీవ పరిణామ సిద్ధాంతం సత్యశోధకుల చేతుల్లో ఒక ఆయుధం వంటిది. ఫిబ్రవరి 12 అంతర్జాతీయ డార్విన్ దినోత్సవ సందర్భంగా సైన్సు ప్రేమికులు, శాస్త్ర ప్రచార కార్యకర్తలు సామాజిక మార్పు కోసం యువతలో హేతుబద్ధ ఆలోచనా బీజాలు నాటాలి. వ్యాసకర్త జన విజ్ఞాన వేదిక తెలంగాణ ఉపాధ్యక్షుడు మొబైల్: 94900 98918 -
మన తోకలకు కత్తెర పడిందెలా?
మనిషికి, కోతికి పోలికలు ఎన్ని ఉన్నా.. ప్రధానమైన తేడా.. తోక! పూర్వీకులు ఒకరే అయినా.. మనిషి తోకలేకుండా ఎదిగితే.. కోతులు అలాగే ఉండిపోయాయి ఇది అందరికీ తెలిసిన విషయమే.. కానీ ఈ మార్పు జరిగిందెలా? యాభై కోట్ల ఏళ్ల క్రితం మన పూర్వీకులకు పొడవాటి తోక ఉండేది. చేపల మాదిరిగా ఈ తోకలను సముద్రాల్లో సులువుగా ఈదేందుకు వాడేవారు. కొన్నికోట్ల ఏళ్ల తర్వాత ఈ తోకలే.. చెట్టు కొమ్మలపై సమతులంగా నడిచేందుకు సాయపడ్డాయి. మరికొంత కాలం గడిచిన తరువాత అంటే.. సుమారు రెండున్నర కోట్ల ఏళ్ల క్రితం ఆ తోకలు మాయమైపోయాయి! ఈ విషయాన్ని అందరికంటే ముందుగా గుర్తించింది పరిణామ సిద్ధాంతకర్త చార్లెస్ డార్విన్. కానీ ఓ జన్యుమార్పు కారణంగా మన తోకలు మాయమైపోయాయని గుర్తించింది మాత్రం న్యూయార్క్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం. రెండు వారాల క్రితం ఈ పరిశోధన వివరాలు ఆన్లైన్లో ప్రచురితమయ్యాయి. ఆ వివరాలివీ.. మనిషి తన తోకను వదిలించుకోవడం పరిణామ క్రమంలో చాలా ముఖ్యమైన ఘట్టం. కోతులకు తోకలు ఉన్నా చింపాంజీలు, ఒరాంగ్ ఊటాన్ వంటి వానర జాతుల్లో మాత్రం తోకలు లేవు. కాకపోతే వాటిలో, మనలోనూ తోక తాలూకు అవశేషం కటి వలయం మధ్యన కొన్ని ఎముకల నిర్మాణం రూపంలో ఉంటుంది. ఇంగ్లిష్‌లో ఈ అవశేషాన్ని కోసిక్స్ అని పిలుస్తారు. ఇది తోక అవశేషం అనడంలో ఎలాంటి సందేహం లేదని డార్విన్ స్వయంగా స్పష్టం చేశారు కూడా. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆ తోక తొలగిపోయిందెలా? అన్న అంశంపై పరిశోధనలు జరిగాయి, జరుగుతున్నాయి కూడా. పలుచోట్ల తవ్వకాల్లో బయటపడ్డ పురాతన శిలాజాల ఆధారంగా చూస్తే.. కనీసం 6.6 కోట్ల ఏళ్ల క్రితం అన్ని వానర జాతుల్లో పూర్తిస్థాయిలో తోక వంటి నిర్మాణం ఉంది. కానీ రెండు కోట్ల ఏళ్ల క్రితం నాటి శిలాజాల్లో మాత్రం తోకల స్థానంలో కోసిక్స్ కనిపించాయి. ఈ పరిణామం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు నూయార్క్ యూనివర్సిటీ శాస్త్రవేత్త బో షియా గత ఏడాది కొన్ని పరిశోధనలు చేపట్టారు. కొన్నిరకాల జంతువుల్లో తోకలు ఎలా ఏర్పడుతున్నాయో గుర్తించేందుకు ప్రయత్నించారు. పిండంగా ఉన్నప్పుడే కొన్ని మాస్టర్ జన్యువులు చైతన్యవంతం కావడం వల్ల వెన్నులోని భాగాలు మెడ, లంబార్ ప్రాంతంగా విడిపోతాయని.. పిండం ఒక చివరలో కనిపించే బొడిపెలాంటి నిర్మాణంలో ఎముకలు, కండరాలు, నాడులు అభివృద్ధి చెంది తోకలుగా మారతాయని బో గుర్తించారు. తోక ఏర్పడటంలో దాదాపు 30 జన్యువులు పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఈ ముప్పై జన్యువుల్లో ఏదో ఒక జన్యువులో వచ్చిన మార్పుల ప్రభావం వల్లనే మనిషి తోకను కోల్పోయి ఉంటాడని అంచనా కట్టిన బో.. దాన్ని గుర్తించే ప్రయత్నం చేశారు. తోకల్లేని వానరాలు ఆరింటి డీఎన్ఏను, తోకలున్న తొమ్మిది రకాల కోతుల డీఎన్ఏతో పోల్చి చూసినప్పుడు ‘టీబీఎక్స్‌టీ’ అనే జన్యువులోని మార్పులు కారణమైనట్టు గుర్తించారు. ఈ మార్పులు మనుషులు, చింపాంజీల్లాంటి వానరాల్లో కనిపించగా.. తోకలున్న కోతుల్లో మాత్రం లేకపోవడం గమనార్హం. – సాక్షి, హైదరాబాద్ ఎలుకలపై ప్రయోగాలతో.. ‘టీబీఎక్స్‌టీ’ జన్యువులో వచ్చిన మార్పుల కారణంగానే మనకు తోకలు లేకుండా పోయాయా? అన్న విషయాన్ని స్పష్టంగా తెలుసుకునేందుకు బో షియా.. జన్యుమార్పులు చేసిన పలు ఎలుకలపై ప్రయోగాలు చేశారు. మనుషుల టీబీఎక్స్‌టీ జన్యువులో ఉన్న మార్పులే కలిగి ఉన్న ఎలుకల పిండాలు అభివృద్ధి చెందినప్పుడు.. చాలా వాటిలో తోకలు వృద్ధి చెందలేదు. కొన్నింటిలో తోకలు పెరిగినా వాటి సైజు చాలా చిన్నగా ఉండిపోయింది. ఈ ప్రయోగాల ఆధారంగా బో చెప్పేది ఏమిటంటే.. సుమారు రెండు కోట్ల ఏళ్ల క్రితం ఈ జన్యుమార్పు వానరాల్లో యాదృచ్ఛికంగా జరిగి ఉంటుందని, తర్వాత వారసత్వంగా కొనసాగడం వల్ల తోకలు లేకుండా పోయాయి అని!! కొసమెరుపు ఏమిటంటే.. తోకలు ఎలా పోయాయో తెలిసింది కానీ.. దీనివల్ల వచ్చిన లాభమేమిటన్న ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. -
చరిత్ర గమనాన్ని మార్చిన డార్విన్
ఖగోళ భౌతిక శాస్త్రములో కోపర్నికస్ ప్రతిపాదించిన ‘సూర్య కేంద్ర సిద్ధాంతానికి’ ఎంత ప్రాముఖ్యత వుందో, అంతే ప్రాధాన్యత ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ జీవశాస్త్రవేత్త డార్విన్ ‘జీవ పరిణామ సిద్ధాంతానికి’ ఉంది. 1809 ఫిబ్రవరి 12న జన్మించిన చార్లెస్ రాబర్ట్ డార్విన్ ఐదేళ్లు ప్రపంచయానం చేసి వివిధ వృక్ష జంతుజాతులను పరిశీ లించి 1859లో ‘ఆన్ ది ఆరిజన్ ఆఫ్ స్పీసీస్’ (జీవజాతుల ఉత్పత్తి) అనే గ్రంథాన్ని ప్రచురించాడు. ప్రకృతిలో జీవజాతులు వేటికవే ఏకకాలంలో రూపొందినట్లు ఎంతోకాలంగా నమ్ముతూ వస్తున్న ప్రజానీకానికి డార్విన్ సిద్ధాంతం కొత్తమార్గాన్ని చూపింది. మనుగడ కోసం పోరాటంలో భాగంగా వివిధ జీవజాతుల మధ్య సంఘర్షణ జరుగుతుందని, కొన్ని సందర్భాలలో ప్రకృతితో కూడా జీవజాతులు ఘర్షణ పడతాయని, సంఘర్షణలో నెగ్గినవే మనుగడ సాగించగలవని, జీవ వైవిధ్యం ప్రకృతి ప్రధాన లక్షణమని, వారసత్వం, పర్యావరణం రెండూ మనిషి నడతను ప్రభావితం చేస్తాయని డార్విన్ ప్రతిపాదించారు. డార్విన్ సిద్ధాంతంతో పలువురు మతాధికారులు విభేదించారు. డార్విన్ ప్రచురించిన పుస్తకాలను నిషేధించారు. కార్ల్ మార్క్స్, ఆడమ్‌స్మిత్ వంటి ప్రముఖ ఆర్థికవేత్తలు తమ సిద్ధాంతాలతో ప్రపంచ గమనాన్ని మార్చినట్లే, డార్విన్ ఆలోచనలు కూడా ప్రజల ఆలోచనల్ని మార్చడంలో కీలకపాత్ర పోషించాయి. గ్రెగర్ మెండల్, హర్గోవింద్ ఖురానా వంటి శాస్త్రవేత్తలు జెనిటిక్ ఇంజనీరింగ్‌లో చేసిన పరిశోధనలకు వాలెస్, డార్విన్ ఆలోచనలు ఎంతగానో దోహదపడ్డాయి. ‘జాతుల ఉత్పత్తి’ పుస్తకం ప్రచురితమై 161 ఏళ్లు అయింది. సృష్టి వాదానికి ముగింపు పలికి సరికొత్త ఆలోచనలకు డార్విన్ తెరతీశాడు. జీవశాస్త్రంలో డార్విన్ ‘జీవకణ సిద్ధాంతం’, భౌతిక శాస్త్రంలో ఐన్‌స్టీన్ ‘సాపేక్ష సిద్ధాంతం’, ఖగోళ శాస్త్రంలో కోపర్నికస్ ‘సూర్య కేంద్ర సిద్ధాంతం’, మానసిక శాస్త్రంలో సిగ్మెంట్ ఫ్రాయిడ్ ‘మనో విశ్లేషణ సిద్ధాంతాలు’ ఆధునిక సైన్స్ మరింత పురోగమించడానికి ఎంతగానో దోహదపడ్డాయి. డార్విన్ ఆలోచనలను 160 ఏళ్ల క్రితం ఇంగ్లండ్‌లో మతవాదులు వ్యతిరేకించినట్లే, నేడు కొందరు మతోన్మాదులు కూడా తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. అభ్యుదయ వాదులు, మానవతావాదులు ఉమ్మడిగా డార్విన్ ఆలోచనలను మరింతముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం వుంది. (నేడు డార్విన్ జయంతి సందర్భంగా) -ఎం.రాంప్రదీప్ ‘ 94927 12836 -
‘అభినవ’ పురాణాలు
బీజేపీతో ఏకీభవించని వారితో నేను ఏకీభవించను. కారణం– మన భారతీయ సంప్రదాయానికీ ఆధునిక జీవనానికీ నిచ్చెనలు వేస్తున్న ఒకే ఒక పార్టీ బీజేపీగా నేను భావిస్తాను. ‘మనవాళ్లు ఉత్త వెధవాయిలోయ్!’ అని గిరీశం తొందరపడి తీర్పునిచ్చాడు కానీ అతను కాని బీజేపీలో ఉంటే తన మనస్సు మార్చుకునేవా డని నా గట్టి నమ్మకం. ఇందుకు గట్టి ఉదాహరణ నాకు ఇటీవలే ఉత్త రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ మాటల్లో దొరి కింది. ఆయన లాకాయి లూకాయి మంత్రి కాడు. ఉప ముఖ్యమంత్రి. ఆయన అన్నారు కదా మన జర్న లిజం పురాణ కాలం నుంచే ప్రారంభమైందని నొక్కి వక్కాణించారు. అంతేకాదు, ఇందుకు బలమైన ఉదా హరణలు ఇచ్చారు. మొదటి ఉదాహరణ: మన భగవద్గీత. ధృతరా ష్ట్రుడితో ఎలా చెప్పాడయ్యా సంజయుడు? చూసింది చూసినట్టు ఒక్క అక్షరం పొల్లు పోకుండా 700 శ్లోకా లను వినిపించాడు. మహా భారత యుద్ధం పంచ రంగులతో ఆయన దివ్య దృష్టికీ కనిపించడానికీ ఈనాటి మన ఐపాడ్లకీ చాలా దగ్గర సంబంధం ఉన్నదని సంజయుని కథనిబట్టి మనం అర్థం చేసు కోవాలి. అలాగే పురాణాల్లో అనాదిగా వస్తున్న పాత్ర– నారదుడు. ఆయన ఎక్కడ పడితే అక్కడికి– ఆయా కారణాలకి చటుక్కున వెళ్లే టెక్నిక్కీ నేటి ‘గూగుల్’కీ పోలికలు లేవా? అని ఆయన బహిరంగ సభలో ప్రశ్నించారు. ‘మీ దిక్కుమాలిన గూగుల్ ఇవాళ ప్రారంభమైంది. కానీ భారతదేశంలో గూగు ల్– పురాణకాలంలో–మహాభారతం రోజుల నాటికే ప్రారంభమైందని’ ఆయన బల్ల గుద్దారు. మనం రెండుసార్లు ‘క్లిక్’ నొక్కితే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లి ఆయా సమా చారాల్ని తెలుసుకోవచ్చు. అది ఇవాళ్టి మాట. కానీ నారదుడు ‘నారాయణ, నారాయణ’ అని రెండుసార్లు అనడం ద్వారా– ఇటు ‘పారిజాతాపహరణా’న్ని, అటు ‘కృష్ణార్జున యుద్ధాన్ని’ నిర్వహిం చిన గొప్పతనాన్ని మరచిపోతున్నాం– అని వాక్రుచ్చారు. అలాగే రామాయణంలో మహాసాధ్వి సీత ‘టెస్ట్ ట్యూబ్’ నుంచి పుట్టిందని సోదాహరణంగా వివరిం చారు. ఆ లెక్కన ద్రోణుడు యజ్ఞాలు చేసే దోనెలో అతని వీర్యం పడగా పుట్టాడని పురాణం. యజ్ఞాల వేళల్లో వీర్యానికి ఏం అగత్యమున్నదో మనకు తెలీదు, ఏమైనా మన పురాణాల నిండా అడ్డమైన వాళ్లూ అడ్డమైన పద్ధతుల్లో పుట్టారు. ఈ విధానాలకీ, ఆధునిక జీవన విధానానికీ ఒక సాపత్యాన్ని వెదికిన సెకండరీ, హయ్యర్, సైన్స్ సాంకేతిక శాఖల మంత్రి గారి ‘ఆలోచనా సరళి’ని కొట్టి పారేయడానికి వీలు లేదు. ఇవన్నీ చాలా గొప్ప పరిశీలనలుగా నేను భావి స్తున్నాను. ఈ లెక్కన స్టీవ్ జాబ్స్ ఏ శూద్రక మహర్షో, బిల్ గేట్స్ కిందటి జన్మలో ఏ శుక మహర్షో అయి ఉంటారని నాకు గట్టి నమ్మకం. లేకపోతే– ఇంతగా ప్రపంచాన్నంతటినీ ఆకర్షించగల ప్రయోగా లను చెయ్యలేరు. నాకు మొదటినుంచీ శ్రీనాథుడిమీద ఈ నమ్మకం ఉండేది. నిజానికి ‘ఆధునిక కవులలో అద్భుతమైన పాత్రికేయుడు శ్రీనాథుడు’ అనే విషయం మీద పరిశోధన జరగాలని నా గట్టి నమ్మకం. ఆయన ‘కాశీఖండము’, ‘భీమ ఖండము’ వంటి మహా రచనలు చేస్తూనే– ఆంధ్ర దేశ మంతా తిరిగి– ఆయా ప్రాంత ఆహార విశేషాల గురించి చెప్పుకుపోయాడు. ఏమైనా కొన్ని తరాలు, శతాబ్దాలు, మళ్లీ మాట్లాడితే యుగాల కిందటి వాస్తవాలను మనకి పంచిన ఘనత బీజేపీది కాక ఇంకెవరికి ఉంటుంది? అని నాకు గర్వపడాలనిపిస్తుంది. మరి మన మహా భారతంలో విమానాలు న్నాయి. వాటిని మన ‘ఎయిర్ ఇండియా’ విమానా లతో పోల్చవచ్చునేమో. కాలదోషం పట్టి వాటిని ప్రస్తుతం ఎవరూ కొనుగోలు చెయ్యడం లేదు. అలాగే హఠాత్తుగా ఆడవారుగా మారిపోయిన మగ వారూ, మగవారిగా మారిపోయిన ఆడవారూ, నపుంసకులూ ఉన్నారు. మన కాలంలో వారు ఎవరో పోల్చవలసిన అవసరం బీజేపీ నాయకులకి ఉంది. ఏమైనా డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని కాల దన్నేలాగ– మన సంస్కృతికీ, పౌరాణిక సంస్కృతికీ నిచ్చెనలు వేయగలిగిన ఆలోచనా పటిమ, స్వదేశీ అభిమానం ఉన్న పార్టీగా నేను బీజేపీని గుర్తిస్తు న్నాను. రాబోయే ఎన్నికలలో తప్పనిసరిగా నా ఓటు బీజేపీకి వెయ్యబోతున్నానని ఇప్పుడే హామీని ఇస్తు న్నాను. వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు -
‘విశ్వ’ శాస్త్రవేత్తకి అశ్రు నివాళి
కేంబ్రిడ్జ్ : కాలం కథను వివరించిన భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్(76) అంత్యక్రియలు కేంబ్రిడ్జ్ పట్టణంలో శనివారం జరిగాయి. అంతకుముందు అభిమానులు, సన్నిహితులు అశ్రునయనాలతో హాకింగ్‌కు వీడ్కోలు పలికారు. గ్రేట్ సెయింట్ మేరిస్ చర్చ్‌లో ప్రత్యేక ప్రార్థనల అనంతరం మత పెద్దలు బైబిల్ చదువుతూ హాకింగ్ అంతిమయాత్ర కొనసాగించారు. హాకింగ్ పార్థివదేహం చర్చికి చేరుకోగానే అక్కడున్న గంటలను 76సార్లు మోగించారు. అంతిమయాత్రలో ఆయన మాజీ భార్య జేన్ హాకింగ్, కొడుకు టిమోథీ హాకింగ్, కూతురు ల్యూసీ హాకింగ్, హాలీవుడ్ నటుడు ఎడ్డీ రెడ్మేనే(హాకింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమాలో హాకింగ్ పాత్ర పోషించారు), కమెడియన్ డారా ఒబ్రెయిన్, దర్శకుడు చార్లెస్ గార్డ్, టీవీ ప్రెసెంటర్ కార్లెట్ హాకిన్, ఇతర ప్రముఖులు, పలువురు శాస్త్రవేత్తలు, విద్యార్థులు, అభిమానులు పాల్గొన్నారు. హాకింగ్ అస్థికలను ఐజాక్ న్యూటన్, చార్లెస్ డార్విన్ సమాధుల సమీపంలోనే పూడ్చిపెట్టనున్నారు. అల్బర్ట్ ఐన్‌స్టీన్ తర్వాత అంతటి గొప్ప శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అని గోన్విలె అండ్ కాయిస్ కాలేజీలో ఏర్పాటు చేసిన పుస్తకంలో విద్యార్థులు రాసుకొచ్చారు. కాలానికి ఆరంభం ఉందా? మరి అంతమో? కాలం వెనుక్కు ఎందుకు నడవదు? మనకు గతమే జ్ఞాపకముంటుంది. భవిష్యత్తు ఎందుకు ముందుగా తెలియదు? పసిపిల్లాడి కుతూహలాన్ని మహామేధావి అన్వేషణనీ కలగలిపితే స్టీఫెన్ హాకింగ్ అని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయాన్ని ఆ పుస్తకంలో వ్యక్తం చేశారు. ఈ ఖగోళ శాస్త్రవేత్త మార్చి 14న కన్నుమూసిన విషయం తెలిసిందే. -
ఇదండీ విచిత్ర జీవి సంగతి!
గుర్రం లాంటి ముఖం, నీటి ఏనుగు కాళ్లు, మోపురం లేని ఒంటె లాంటి దేహంతో ఉన్న ఈ జీవిని చూసేందుకు చిత్రంగా ఉంది కదూ. నిజమే.. మానవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చార్లెస్ డార్విన్కే దీని వివరాలు అంతుపట్టలేదు. జన్యుక్రమ విశ్లేషణ పుణ్యమా అని ఇన్నేళ్ల తరువాత ఈ జీవి వివరా లు తొలిసారి వెల్లడయ్యాయి. దక్షిణ అమెరికాలో డార్విన్ పర్యటిస్తున్నప్పు డు పెటగోనియాలో ఈ జీవి తాలూ కూ అవశేషాలు లభించాయి. వాటి ఆధారంగా బతికున్నప్పుడు ఆ జీవి ఎలా ఉండేదో ఊహించిన డార్విన్ దానికి మక్రావుచెనియా పాటాకోనికా అని నామకరణం చేశాడు. పేరుపెట్టగలిగాడేగానీ ఇతర వివరాలేవీ తెలియరాలేదు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్ పోస్ట్డ్యామ్ అధ్యాపకుడు మైకేల్ హోఫ్రిటర్ దీనిపై పరిశోధనలు చేపట్టారు. అవశేషాల ద్వారా సేకరించిన మైటోకాండ్రియల్ డీఎన్ఏను విశ్లేషించినప్పుడు ఈ జీవజాతి రాక్షస బల్లుల కాలంలో ఉండేదని, గుర్రం, నీటిఏనుగు వంటి పెరిస్సోడాక్యాటా జాతికి చెందిందని గుర్తించగలిగారు. పరిశోధన వివరాలు నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
డార్విన్ పుస్తకం పుట్టినరోజు!
ఆ నేడు 24 నవంబర్, 1859 చార్లెస్ డార్విన్ (1809 - 1882) ప్రకృతిని ప్రేమించాడు. ప్రకృతిని పరిశోధించాడు. ప్రకృతిని పరిశీలించడం కోసం వైద్య విద్యను నిర్లక్ష్యం చేశాడు. తండ్రి అతడిని క్రైస్తవ ప్రబోధకునిగా శిక్షణకు పంపిస్తే, మధ్యలోనే మానేశాడు. ఐదేళ్ల సముద్రయానానికి బ్రిటన్ నుంచి బయల్దేరిన బీగిల్ నౌకలో మిగతా శాస్త్రవేత్తలతో కలిసి జల, ఉభయ చరాలపై సునిశిత అధ్యయనం చేశాడు. డార్విన్‌కు పదిమంది పిల్లలు. భార్య ఎమ్మా వెడ్జ్‌వుడ్. ఇంగ్లండ్‌లోని ష్రూస్‌బరీ డార్విన్ జన్మస్థలం. ‘వానరానికి మెరుగైన రూపం... మానవుడు’ అని డార్విన్ అభిప్రాయపడ్డారు. 2009లో డార్విన్ ద్విశతజయంతి జరిగింది. డార్విన్ 1859 నవంబర్ 24న ‘ఆరిజన్ ఆఫ్ ది స్పీషీస్’ సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించారు. అది ఇప్పటికీ జీవ పరిణామ క్రమ పరిశోధకులకు ఒక ప్రామాణిక గ్రంథం. ‘దేవుడిని విశ్వసించేవారు ఎలాగైతే శాస్త్ర సిద్ధాంతాలను తిరస్కరిస్తారో, అదే విధంగా నా వంటి భౌతికవాదులు... నమ్మకాలను బలహీనపరిచే ప్రతిపాదనలు చేస్తుంటారు. నమ్మకానికీ, శాస్త్రానికీ మధ్య ఏ అక్షాంశ రేఖాంశాల మీదనో సమన్వయం కుదిరే వరకు ఈ అయోమయం ఇలాగే కొనసాగుతుంది’ అన్నారు డార్విన్ ఈ గ్రంథంపై వచ్చిన విమర్శలకు సమాధానం ఇస్తూ. -
మళ్లీ గోవులొస్తున్నాయ్ జాగ్రత్త!
ఇటీవల పశుమాంసం, గోమాంసం గురించిన చర్చ అవధులు దాటి సాగుతోంది. భారతీయ సమాజపు ఏకత్వంలోని భిన్నత్వాన్ని మరచిపోయినందువల్లనే కొన్ని పిదప బుద్ధులు కొందరికి అలవాటయ్యాయి! ఉదాహరణకు, కేరళలో 72 రకాల సమాజాలు (కమ్యూనిటీస్) ఉన్నాయి! వాళ్లంతా ‘‘అంటరానివారు’’ కారు సుమా! ఆ మాటకొస్తే మన రాష్ట్రం సహా అన్ని రాష్ట్రాలలోనూ గొర్రె మాంసం, మేక మాంసం చాలా ఖరీదైనందున, వీరు గొడ్డుమాంసం వినియోగిస్తున్నారు. మనుషుల మనసులు మార్చగల పరిణామం ఏది? సమాజంలో కొందరు మూర్ఖులుగా మిగిలిపోవడానికి కారణం, భయమా? కొన్ని విశ్వాసాలకు భయమే కారణమైతే, దాన్ని తొలగించుకోవడం ఎలా? కార్యకారణ సంబం ధానికి ప్రకృతే మాతృక. తన ప్రస్తుత పరిస్థితి గురించి వివరించలేని భయ స్తుడొకడు ఆత్మతృప్తి కోసం ఒక టుమ్రీ వదిలాడట, ‘మూడు జన్మల సంగతి చెప్పగలను! పూర్వజన్మలో ఇచ్చి పెట్టుకోలేదు. కనుక ఈ జన్మలో దేవుడు నాకీయలేదు. కాబట్టి ఇకముందు జన్మలో నాకేమీ ఉండదు.’’ దీని బెంగతోనే, విశ్వాసం నుంచి దూరమై భయాన్ని ఆశ్రయించాడట. అందుకే మూడు తరా ల దరిద్రులు కొందరు ముష్టికి బయలుదేరారేగానీ, తమ దారిద్య్రానికీ, ఈ అసమానతలకీ అసలు కారణం దోపిడీ, అసమానతలు, మూఢ నమ్మకా లేనని తెలుసుకోలేకపోయారు. ఇలాంటి సన్నివేశం ఒకటి మానవ సమాజ పరిణామవాద శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్‌కు ఎదురైంది. ఇందుకు సంబంధించినదే ఒక విశేషం నాలు గైదు రోజుల క్రితం బయటపడింది కూడా. అది కూడా డార్విన్ స్వదస్తూరీతో ఉన్న లేఖ రూపంలో వెలుగుచూసింది. ఫ్రాన్సిస్ మెడెర్మాట్ అనే న్యాయ వాదికి డార్విన్ రాసిన లేఖ అది. బైబిల్ పుట్టుపూర్వోత్తరాలు, జీసస్ క్రీస్తును దేవుని బిడ్డగా భావించుకోవడం గురించిన మీమాంసకు సంబంధించి మెడె ర్మాట్ లేవనెత్తిన సందేహానికి (నవంబర్ 23, 1880) డార్విన్ ఇచ్చిన ప్రత్యు త్తరమది (ది హిందు, 25-9-15). ‘బైబిల్ రచనను దైవ ప్రవచనంగా నమ్మ ను గాక నమ్మను. జీసస్‌ను దేవపుత్రునిగా భావించడం లేదు’ అని చెప్పారా యన. ఇంతకీ బారిస్టర్ మెడెర్మాట్ ఏమని రాస్తే, డార్విన్ ఇలా స్పందించవ లసివచ్చింది? మెడెర్మాట్ మాటల్లోనే.. ‘‘మీ పుస్తకాలు చదివి నేను ఆనందిం చాలంటే, నా పఠనం తరువాత ముగింపులో బైబిల్ కొత్త నిబంధన లో (న్యూటెస్ట్‌మెంట్) నాకు అంతకుముందే ఏర్పడిన విశ్వాసాన్ని కోల్పోకూ డదు. నేను ఈ ఉత్తరం రాయడంలో ఉద్దేశం- బైబిల్ నూతన నిబంధనలలో మీకు అసలు నమ్మకం ఉందా, లేదా అని తెలుసుకోవడం. అందుకు ‘అవును’ లేదా ‘కాదు’ అన్న సమాధానం కావాలి.’’ దీనికే డార్విన్ ఆ సమాధానం ఇచ్చాడు. కాగా సమాధానాన్ని బయట పెట్టవద్దని మెడెర్మాట్ వేడుకున్నాడు. ఎందుకు ప్రాధేయపడవలసి వచ్చిందంటే, ఆ కాలంలో అవిశ్వాసులను మౌఢ్యం కొద్దీ కొరత వేస్తూ ఉండడం వల్లనే. హితం పోయింది మతం వచ్చింది ఈ మధ్య మన దేశంలో ప్రాచీన శాస్త్రవేత్తలు ప్రబోధించిన ధర్మచింతన పోయి, ‘మతం’పేరుతో గతం పాతర తవ్వి, ఆనాటి క్రైస్తవ సమాజంలోనూ, ఇస్లామిక్ సమాజంలోనూ కనిపించిన కొన్ని నమ్మకాలు పరివ్యాప్తం కావ డంతో ధర్మచింతన వెనకడుగు వేసి, సమాజహితం స్థానంలో మతం చోటు చేసుకుంది. మనిషికి మంచిమాటే అలంకారం అన్న సూత్రాన్ని నమ్మిన సుప్ర సిద్ధ జాతీయవాది, షికాగోలో సర్వధర్మ ప్రపంచ సమ్మేళనంలో ప్రసంగించిన దేశభక్త స్వామి వివేకానంద గానీ, ఆయన గురువుగా భావించే దయానంద గానీ మూఢ నమ్మకాలకు సాధ్యమైనంత దూరం జరిగి, భారతీయతను మాత్రమే చాటగలిగారు. వారు ఏనాడూ భిన్న భాషా సంస్కృతుల చింతన లను విమర్శించలేదు. అయితే పలు జీవన విధానాలు సహ జీవనం సాగి స్తున్న భారతీయత మొక్కట్లను చెదరగొట్టడానికి కొన్ని సంస్థలు, నాయక స్థానాలలో ఉన్న కొందరు వ్యక్తులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. దేశంలో వివిధ వర్గాల వారి ఆహార నియమాల మీద, అలవాట్ల మీద విరుచుకుపడు తున్నారు. ఈ ధోరణి భారతీయతకు విరుద్ధం. అతివేలం, ఉన్మాదం ఎందులో ఉన్నా (క్రైస్తవం, ఇస్లాం, భారతీయత లేదా హైందవం) ఖండనార్హమే. చిత్రమేమిటంటే ధర్మానికి అర్థాలు మారిపో తున్న దశలో ఆదిశంకరుని ప్రవచనాలలో ‘మనది వైదిక ధర్మమేగానీ, హిం దూమతం కాదు. హిందూమతమని పిలిచినవాళ్లు పరదేశీయులని, హిందూ మతం అనరాదనీ ప్రబోధించారు (చూ. ఆదిశంకరుని ప్రవచనాలు: తెలుగు సేత: స్వామి శివశంకరశాస్త్రి). కాగా పర్షియన్లు, ఇతర విదేశీయులు సింధునదీ ప్రాంతానికి చేరుకున్నప్పుడు ‘సింధు’ పదంలోని ‘స’కారం ఉచ్చరించలేక ‘స’కు బదులు, ‘హ’ కారంతో ‘సింధు’ను ‘హిందు’గా మార్చారనీ రాహుల్ సాంకృత్యాయన్ వెల్లడించారు. అటు ఆదిశంకరాచార్యులు, ఇటు రాహుల్జీ తెలిపిన వివరణను, నిర్వచనాన్నీ కొందరు స్వార్థపరులు తొక్కిపట్టి, ప్రచారం లోకి రానివ్వకపోవడానికి బలమైన స్వార్థప్రయోజనాలే కారణమై ఉండాలి. ఆహార అలవాట్లపై దాడి తగునా? మత విశ్వాసాల పేరిట భిన్న ధర్మచింతనలకు చెందిన వారి ఆహార అలవా ట్లపై దాడులు తగదు. ఇటీవల పశుమాంసం, గోమాంసం గురించిన చర్చ అవధులు దాటి సాగుతోంది. భారతీయ సమాజపు ఏకత్వంలోని భిన్నత్వాన్ని మరచిపోయినందువల్లనే కొన్ని పిదప బుద్ధులు కొందరికి అలవాటయ్యాయి! ఉదాహరణకు, కేరళలో 72 రకాల సమాజాలు (కమ్యూనిటీస్) ఉన్నాయి! వాళ్లంతా ‘‘అంటరానివారు’’ కారు సుమా! ఆ మాటకొస్తే మన రాష్ట్రం సహా అన్ని రాష్ట్రాలలోనూ గొర్రె మాంసం, మేక మాంసం చాలా ఖరీదైనందున, వీరు గొడ్డుమాంసం వినియోగిస్తున్నారు. మన సంకీర్ణ భారతీయ సమాజంలో ఇస్లాం ప్రవేశానికి ముందే పశు మాంస భక్షణ ఒక భాగమని సుప్రసిద్ధ చరిత్రకారుడు, పరిశోధకుడు ప్రొఫె సర్ డి.ఎన్.ఝా (ఢిల్లీ విశ్వవిద్యాలయం) వెల్లడించాడు! దేశంలో వ్యవసా యం వృత్తిగా స్థిరపడే వరకూ అనేక సంచారజాతులు, ఇక్కడ స్థిరపడిన పెక్కు దేశ దిమ్మర జాతులలో పశుబలులు ప్రధానంగా సాగుతూండేవని ప్రాచీన భారతీయ సంహితలు, ముఖ్యంగా వేదాలు నిరూపిస్తున్నాయని పం డిత పరిశోధకులు వెల్లడించారు. ఆ కాలంలో దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పేరుతో పశువుల్ని నైవేద్యంగా చూపించేవారు. ఇంద్రుడికి, అగ్నికి ఎద్దు, ఆవు మాంసం సమర్పించేవారు; మరుత్తులు, అశ్వనీదేవతల పేరిట గోమాంసం నివేదించుకునే వారు; వేదాలలో 250 రకాల పశువులను పేర్కొన్నారనీ, వాటిలో కనీసం 50 రకాల పశువుల్ని బలివ్వడానికి, వాటి మాంసాన్ని ఆహా రంగా స్వీకరించడానికి అనువైన జాతులుగా పేర్కొన్నారని చరిత్రకారుల నిర్ధారణ! మహాభారతంలో రంతిదేవుడనే రాజు ప్రస్తావన ఉంది. ఆయన, బ్రాహ్మణ వర్గానికి ఆహారధాన్యాలతో పాటు గొడ్డుమాంసం కూడా పంచిపె ట్టాడన్న ఖ్యాతి పొందాడు. ‘తైత్తిరీయ బ్రాహ్మణం’ ‘ఆవు మాంసం ఆహా రం’గా పేర్కొన్నదని, లేత ఆవు మాంసం కావాలని యాజ్ఞవల్క్యుడు పట్టుప ట్టాడనీ పరిశోధకలు ఉదహరించారు! ‘బ్రాహ్మణాలు’ కూడా గొడ్డుమాంసం వాడకానికి సాక్ష్యంగా నిలిచాయని నిపుణులు స్పష్టం చేశారు! ‘మనుస్మృతి’ కూడా గొడ్డు మాంసం వాడకాన్ని నిషేధించలేదు! ప్రాచీన ఆయుర్వేద గ్రం థం ‘చరక సంహిత’ ప్రకారం గోమాంసం అనేక రోగాలకు మందు. పశు బలులు-పూర్వాపరాలు ఈ విధంగా వ్యవసాయార్థికవ్యవస్థ క్రమంగా నిలదొక్కుకున్నకొద్దీ, సంఘం లో భారీ ఎత్తున పరివర్తనా దశ ప్రారంభం కావడంతో పశువుల్ని బలిపెట్టే కార్యాచరణలో కూడా మార్పులు అనివార్యం అయ్యాయనీ చరిత్రకారులు పేర్కొన్నారు. సరిగ్గా ఈ దశలోనే బ్రాహ్మణ్యం పాల్గొంటున్న పశుబలులు లాంటి యజ్ఞయాగాదుల నిర్వహణ కూడా కొనసాగిందనీ, అందుకే బుద్ధుడు అహింసను ప్రబోధిస్తూ ఈ కర్మకాండలపైన ధ్వజమెత్తాడని చరిత్రకారులు రాశారు. ఈ పశుబలుల కర్మకాండలో యజ్ఞయాగాదుల్లో 500 ఎడ్లు, 500 కోడెదూడలు, 500 ఆవుదూడలు, 500 గొర్రెలను యజ్ఞవాటికలో స్తంభాలకు కట్టి మరీ వధించేవారనీ ప్రొఫెసర్ రామ్ పునియానీ (బొంబాయి) పేర్కొ న్నారు. కనుకనే ఆనాటి సమాజంలో గొప్ప హేతువాదిగా, దార్శనికుడిగా, త్యాగిగా చైతన్యశక్తితో ప్రభవిల్లిన బుద్ధుడు - అశ్వమేధ, పురుషమేధ, వాజ పేయ యాగాదుల వల్ల భారతీయ సమాజానికి మంచి ఫలితాలు రాలేదని పేర్కొనవలసి వచ్చింది. బుద్ధుడు ఒకసారి మగధ పర్యటనలో ఉండగా ‘కూటదంతుడు’ అనే ఒక బ్రాహ్మణ వర్గీయుడు 700 ఎద్దులను, 700 గొర్రెల్ని బలివ్వడానికి సిద్ధమవడం చూశాడు. అది గ్రహించిన బుద్ధుడు జోక్యం చేసు కుని ఈ హింసాకాండను అడ్డుకున్నాడు. అప్పటికే నూతన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ రంగంలోకి ప్రవేశించింది. దానితో పశుసంపద రక్షణ సామాజికుల బాధ్యతగా, ముఖ్యావసరంగా పరిగణనలోకి వచ్చిందని మరువరాదు. అహింస గురించి బుద్ధుడు అంతగా పట్టుబట్టడం అనేది గుడ్డిగా జరగలేదనీ, పశు మాంసాన్ని ఒకసారి బుద్ధుడు కూడా రుచి చూడటమూ చరిత్రకు తెలి సిన ఘట్టమేననీ, ఒక సందర్భంలో పంది మాంసం (పోర్క్) తినడం వల్లనే ఆయన వ్యాధిగ్రస్తుడయ్యాడనీ చరిత్రకారులు తెలిపారు. నిజానికి దేశంలో బౌద్ధధర్మం వ్యాప్తిలోకి వచ్చిన తర్వాతనే లేదా బౌద్ధంపైన ఒక వర్గం బ్రాహ్మ ణ్యం దాడులు ప్రారంభమైన తర్వాతనే, బౌద్ధం వల్లనే యజ్ఞయాగాదులకు, వర్ణవ్యవస్థలోని వివక్షా విలువలకూ అడ్డంకులు, సవాళ్లూ ఎదురైనందువల్లనే అన్ని స్థాయిల్లోనూ ప్రతిఘటన పెరిగింది. ఆ సమయంలోనే యజ్ఞయాగాదు లను నమ్ముకున్న బ్రాహ్మణ్యంలోని ఒక వర్గం బౌద్ధ భిక్షువులపైన, ధర్మప్రచా రకుల మీద పుష్యమిత్ర శుంగ చక్రవర్తి ఆసరాతో ప్రత్యక్షదాడులకు దిగింది. ఇంకొక వైపున గౌతమ బుద్ధుడు జ్ఞానమార్గానికి ఆదరవైన ‘బోధి’ వృక్షా న్ని కాస్తా శశాంక రాజు కూల్చివేశాడనీ మరవరాదు! అప్పటిదాకా బలిబశువు గానే బతుకు ఈడ్చిన ‘ఆవు’ కాస్తా కొందరికి అకస్మాత్తుగా ‘గోమాత’గా మార డమే ఒక విశేషం! రాచకొండ వివ్వనాథశాస్త్రి మరొకసారి హెచ్చరించినట్టు మళ్లీ ‘గోవులొస్తున్నాయ్, జాగ్రత్త’ సుమా! రాహుల్జీ నిర్ధారించినట్టు మానవ జాతి ప్రగతి పథం వైపు సాగించిన ప్రతి ఒక్క అడుగడుగు రక్తతర్పణంలోనే సాగింది. ఇటీవల గుజరాత్ ‘ప్రగతిపథం’లో కూడా ఆ ‘నర రక్తతర్పణం’ చారికలూ, సారికలూ నమోదైనాయి! ‘గోవులొస్తున్నాయ్, జాగ్రత్త’! వ్యాసకర్త మొబైల్: 9848318414 - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
ఆ అపరిచిత జీవుల ఆచూకీ తెలియనుంది!
సుమారు 180 సంవత్సరాల క్రితం చార్లెస్ డార్విన్ సేకరించిన కొన్ని జంతువులకు సంబంధించిన శిలాజాలపై మళ్లీ సరికొత్త రీతిలో పరిశోధన ప్రారంభమైంది. ఈ శిలాజాలు ఏ జంతువులకు సంబంధించినవనేది ఇప్పటి వరకు తెలియదు. డీఎన్ఏ ప్రయోగాలతో సహా రకరకాల ప్రయోగాలేవి వీటికి సంబంధించిన స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వలేదు. అయితే ఇప్పుడిప్పుడే ఆ వింత జంతువులు ఏమిటి? అనేదాని గురించి ఒక అవగాహన రానుంది. ఇప్పటి గుర్రాలు, ఒంటెలు, ఏనుగులతో వాటికి దగ్గరి సంబంధం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. డార్విన్ను పజిల్‌కు గురి చేసిన సమస్యను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించి పరిష్కరించడానికి పురాజీవ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ‘స్ట్రక్చరల్ ప్రొటీన్’గా పిలువబడే జంతువుల ఎముకలలో కనిపించే కొలాజెన్‌ను విశ్లేషించనున్నారు. మొత్తానికైతే... రకరకాల మార్గాల ద్వారా ఆ అపరిచిత జీవుల డీఎన్ఏ కోడ్ తెలుసుకోనున్నారు. -
డార్విన్ నత్తగుల్లలు దొరికాయ్..!
లండన్: జీవపరిణామ శాస్త్ర పితామహుడు చార్లెస్ డార్విన్ 160 ఏళ్ల క్రితం లండన్‌లోని రాయల్ నేచురల్ హిస్టరీ మ్యూజియం చీఫ్ జాపెటస్ స్టీన్స్ట్రప్కు కానుకగా పంపిన నత్తగుల్లల స్పెసిమన్లివి. డార్విన్, జాపెటస్ల మధ్య ఉత్తరప్రత్యుత్తరాలపై జరిగిన అధ్యయనంలో వీటిని గుర్తించారు. తొలుత జాపెటస్ నుంచి ఓ జాతి నత్తగుల్లలను అధ్యయనం కోసం అరువు తీసుకెళ్లిన డార్విన్.. తర్వాత కృతజ్ఞతలు తెలుపుతూ మొత్తం 77 జాతుల నత్తగుల్లలను భద్రపర్చి కానుకగా పంపించారట. అయితే ప్రస్తుతం మ్యూజియంలో 55 జాతుల నత్తగుల్లలు మాత్రమే మిగిలాయని, గత 160 ఏళ్లలో అరువుకు తీసుకెళ్లినవారు ఇవ్వకపోవడంతో ఆ జాతులు మాయమయ్యాయని భావిస్తున్నారు.