డార్విన్ నత్తగుల్లలు దొరికాయ్..!
లండన్: జీవపరిణామ శాస్త్ర పితామహుడు చార్లెస్ డార్విన్ 160 ఏళ్ల క్రితం లండన్‌లోని రాయల్ నేచురల్ హిస్టరీ మ్యూజియం చీఫ్ జాపెటస్ స్టీన్‌స్ట్రప్‌కు కానుకగా పంపిన నత్తగుల్లల స్పెసిమన్‌లివి. డార్విన్, జాపెటస్‌ల మధ్య ఉత్తరప్రత్యుత్తరాలపై జరిగిన అధ్యయనంలో వీటిని గుర్తించారు.
తొలుత జాపెటస్ నుంచి ఓ జాతి నత్తగుల్లలను అధ్యయనం కోసం అరువు తీసుకెళ్లిన డార్విన్.. తర్వాత కృతజ్ఞతలు తెలుపుతూ మొత్తం 77 జాతుల నత్తగుల్లలను భద్రపర్చి కానుకగా పంపించారట. అయితే ప్రస్తుతం మ్యూజియంలో 55 జాతుల నత్తగుల్లలు మాత్రమే మిగిలాయని, గత 160 ఏళ్లలో అరువుకు తీసుకెళ్లినవారు ఇవ్వకపోవడంతో ఆ జాతులు మాయమయ్యాయని భావిస్తున్నారు.