జపాన్‌తో అణుబంధం | India, Japan sign landmark civil nuclear deal | Sakshi
Sakshi News home page

జపాన్‌తో అణుబంధం

Published Sat, Nov 12 2016 4:32 AM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM

జపాన్‌తో అణుబంధం - Sakshi

జపాన్‌తో అణుబంధం

మోదీ-షింజోశిఖరాగ్రంలో చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు
 
- ఎన్‌పీటీపై సంతకం చేయకపోరుునా భారత్‌కు జపాన్ మినహారుుంపు
- మౌలికరంగంలో పెట్టుబడులు, అంతరిక్ష, వ్యవసాయ సహకారం సహా జపాన్-భారత్‌ల మధ్య మరో 9 ఒప్పందాలు ఖరారు
 
 టోక్యో: ఇరు దేశాల అణు పరిశ్రమల మధ్య భాగస్వామ్యానికి ద్వారాలు తెరుస్తూ భారత్‌తో చరిత్రాత్మక పౌర అణు ఒప్పందంపై జపాన్ శుక్రవారం సంతకం చేసింది. దీంతో జపాన్ తన అణు సాంకేతికతను, రియాక్టర్లను భారత్‌కు ఎగుమతి చేసేందుకు దారులు తెరుచుకున్నాయి. జపాన్‌లో పర్యటిస్తున్న ప్రధాని  నరేంద్రమోదీ ఆ దేశ ప్రధాని షింజో అబేతో సమావేశమై చర్చలు జరిపారు. అణు ఒప్పందంతో పాటు.. మౌలిక రంగంలో జపాన్ పెట్టుబడులు పెంచడం, రైల్వేలు, అంతరిక్షం, వ్యవసాయ రంగాల్లో సహకారం తదితరాల్లో సంబంధాలను బలోపేతం చేస్తూ మరో 9 ఒప్పందాలూ కుదిరారుు. అణ్వస్త్ర దాడికి (రెండో ప్రపంచ యుద్ధంలో) గురైన ఏకై క దేశమైన జపాన్‌తో ఆరేళ్ల పాటు చర్చల అనంతరం ఈ పౌర అణు సహకార ఒప్పందం కుదిరింది.

అణుశక్తి విషయంలో కఠిన విధానాలు అవలంబించే జపాన్.. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ)పై భారత్ సంతకం చేయకపోరుునా కూడా అణుశక్తిని శాంతియుత అవసరాలకు వినియోగించుకునేందుకు భారత్‌కు మినహారుుంపునిస్తూ ఈ ఒప్పందం చేసుకుంది. అమెరికా, రష్యా, దక్షిణ కొరియా, మంగోలియా, ఫ్రాన్‌‌స, నమీబియా, అర్జెంటీనా, కెనడా, కజకిస్తాన్, ఆస్ట్రేలియాలతో ఇప్పటికే భారత్ అణు ఒప్పందాలు చేసుకుంది. శిఖరాగ్ర భేటీ తర్వాత మోదీ, షింజోలు మీడియాతో మాట్లాడారు. స్వచ్ఛ ఇంధన భాగస్వామ్య నిర్మాణం కోసం కృషిలో ఈ ఒప్పందం చరిత్రాత్మక ముందడుగు అని మోదీ పేర్కొన్నారు. ఈ రంగంలో తమ సహకారం వాతావరణ మార్పు సమస్యపై పోరాడేందుకు దోహదపడుతుందన్నారు. ఒప్పందానికి మద్దతిచ్చినందుకు షింజోకు, జపాన్ ప్రభుత్వం, పార్లమెంటులకు కృతజ్ఞతలు తెలిపారు. అణ్వస్త్ర రహిత ప్రపంచాన్ని సృష్టించాలన్న తమ లక్ష్యానికి అణుగుణంగా ఈ ఒప్పందం ఉందని, దీనిపై సంతకం చేయటం సంతోషకరమని షింజో అన్నారు.  

 భాగస్వామ్యంతో ప్రపంచానికి మేలు
 అనంతరం.. తన గౌరవార్థం షింజో ఏర్పాటు చేసిన ఒక విందు సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. ఇరు దేశాలూ సన్నిహిత భాగస్వాములుగా కేవలం తమ సమాజాల ప్రయోజనాల కోసమే కాకుండా.. ఈ ప్రాంతానికి, ప్రపంచానికి కూడా ప్రయోజనం కలిగించే కృషి చాలా చేయగలవన్నారు. ఎన్‌పీటీని ప్రపంచవ్యాప్తం చేయటం, సమగ్ర అణుపరీక్ష నిషేధ ఒప్పందం (సీటీబీటీ) అమలులో ప్రవేశం, (ఎఫ్‌ఎంసీటీ)పై త్వరగా చర్చలు ప్రారంభించాల్సిన అవసరముందని షింజో పేర్కొన్నారు. బలమైన ఆర్థిక భాగస్వామ్యం, వాణిజ్య, తయారీ, పెట్టుబడి సంబంధాల వృద్ధి, స్వచ్ఛ ఇంధనంపై దృష్టి కేంద్రీకరణ, పౌరుల భద్రతపై భాగస్వామ్యం, మౌలిక సదుపాయాల్లో సహకారం తదితరాలు కీలకాంశాలని మోదీ వివరించారు.

 ఇతర కీలక ఒప్పందాలు... రైల్వేలు, రవాణా, నౌకాశ్రయ టెర్మినళ్లు, టోల్ రోడ్లు, విమానాశ్రయ టెర్మినళ్లు, పట్టణాభివృద్ధిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో సహకారానికి, పెట్టుబడుల ప్రోత్సాహానికి జాతీయ పెట్టుబడులు, మౌలికసదుపాయాల నిధి - జపాన్ ఓవర్‌సీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్‌వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఫర్ ట్రాన్‌‌సపోర్ట్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్‌ల మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. అంతరిక్ష సాంకేతికతలో సహకారం పెంపొందించుకోవడానికి.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) - జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ ఏజెన్సీ (జాక్సా)ల మధ్య ఒకటి, భారత భూశాస్త్రాల మంత్రిత్వశాఖ - జపాన్ మెరైన్-ఎర్త్ సెన్సైస్‌ల మధ్య మరొకటి -  రెండు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశారు.
 
 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయాలి..

 ఉగ్రవాద వ్యాప్తిపై భారత్, జపాన్‌లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారుు. ఉగ్రవాదుల సురక్షిత స్థావరాలను నిర్మూలించి, వారి వ్యవస్థలను ధ్వంసం చేయడానికి, ఉగ్రవాదుల సీమాంతర కదలికలను నిలిపివేయడానికి ప్రపంచ దేశాలు కృషి చేయాలని కోరాయి. మోదీ, షింజోల భేటీ అనంతరం  ప్రకటన విడుదల చేస్తూ.. ఉగ్రవాదాన్ని దాని అన్ని రూపాల్లోనూ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాద సంస్థలను గుర్తించటానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానం 1267, సంబంధిత ఇతర తీర్మానాలను అన్ని దేశాలూ అమలు చేయాలని కోరాయి. ముంబై, పఠాన్‌కోట్ దాడుల సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టాలని ఇరువురు నేతలూ పాకిస్తాన్‌కు సూచించారు. వ్యూహాత్మక దక్షిణ చైనా సముద్రంలో సరిహద్దు వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని,   భారత్, జపాన్‌లు పరోక్షంగా చైనాను ఉటంకిస్తూ పిలుపునిచ్చారుు. మోదీ శుక్రవారం జపాన్ చక్రవర్తి అకిహిటోను కలిశారు. ఇరు దేశాల మధ్య అనుబంధాలు, ఆసియా భవిష్యత్తు గురించి ఆయనతో చర్చించారు.
 
 2023లో హైస్పీడ్ రైలు
 ఇరు దేశాల మధ్య సంబంధాల్లో కొత్త కోణాన్ని.. జపాన్ సహాయంతో ముంబై -అహ్మదాబాద్‌ల మధ్య నిర్మిస్తున్న హైస్పీడ్ ట్రైన్ కారిడార్ ప్రతిఫలిస్తోందని షింజే అభివర్ణించారు. ఈ ప్రాజెక్టును డిజైన్ చేయడం ఈ ఏడాది చివర్లో మొదలవుతుందని, ఈ ఏడాదే శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందనితెలిపారు. 2018 లో నిర్మాణం ప్రారంభమవుతుందని, 2023 నుంచి హైస్పీడ్ రైలు సేవలు ఆరంభమవుతాయన్నారు.  భారత్‌లో 30,000 మందికి శిక్షణనిచ్చేందుకు జపాన్ ప్రైవేట్ రంగం ఒక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాన్యుఫ్యాక్చరింగ్‌ను స్థాపించనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement