Japan PM Abe
-
సెక్యూరిటీ అలా చేసి ఉంటే షింజో అబే బతికేవారు: ఆనంద్ మహీంద్రా
టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది వైఫల్యం ఉందని పేర్కొన్నారు. సెక్యూరిటీ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఉంటే షింజో బతికి ఉండేవారని చెప్పారు. అబేపై కాల్పులు జరిపినప్పుడు మొదటి తూటాకు, రెండో తూటాకు మధ్య కాస్త గ్యాప్ ఉందని మహీంద్రా వివరించారు. ఆ సమయంలో సెక్యూరిటీ షింజో అబేనూ కవర్ చేసి, ఆయనకు బుల్లెట్ తగలకుండా చూసుకుని ఉంటే ప్రాణాలతో బయటపడి ఉండేవారని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలా కాకుండా కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకునేందుకే భద్రతా సిబ్బంది ప్రయత్నించారని మహీంద్రా విమర్శించారు. The first shot missed. There was a potentially life-saving gap until the second shot. Shouldn’t his security have jumped on Abe & flattened & covered him instead of chasing the assailant? He could have & should have survived this. pic.twitter.com/aGSI1SO3yA — anand mahindra (@anandmahindra) July 9, 2022 షింజో అబే ఓ కార్యక్రమంలో మాట్లాడుతుండగా.. తెత్సుయా యమగామీ అనే వ్యక్తి ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపాడు. సొంతంగా తయారు చేసుకున్న గన్‌తో ఈ దారుణానికి పాల్పడ్డాడు. షింజోను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. నిందితుడ్ని క్షణాల్లోనే పట్టుకున్నారు భద్రతా సిబ్బంది. అనంతరం ఓ మతసంస్థపై ద్వేషంతోనే తాను షింజోను హత్య చేసినట్లు యమగామీ తెలిపాడు. జపాన్ అధికారులు కూడా షింజో భద్రతలో వైఫల్యాలు ఉన్నాయని అంగీకరించారు. చదవండి: మత సంస్థపై ద్వేషంతోనే షింజో హత్య -
ప్రేతాత్మ పునరుజ్జీవం!!
సామ్రాజ్యవాద సంస్కృతి పునరుద్ధరణకు జపాన్ ప్రయత్నాలు? కిండర్‌గార్టెన్‌లో శతాబ్ద కాలం నాటి రాజాజ్ఞల బోధనలు ‘యుద్ధ నేరస్తుల ఆత్మల’కు ప్రభుత్వం, ఎంపీల నివాళులు పాఠ్యాంశాలుగా హిట్లర్ ఆత్మకథ, బాయినెట్లతో పోరాటాలు ప్రజల్లో ఆందోళన, అయోమయం.. పొరుగుదేశాల నిరసనలు మధ్యయుగాల నాటి రాచరిక యుద్ధ భూతానికి జపాన్ మళ్లీ ప్రాణం పోసే ప్రయత్నం చేస్తోందా? జపాన్‌లో జరుగుతున్న పరిణామాలు ఈ అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి. శతాబ్దం కిందట చరిత్ర పుటల్లో చేరిపోయిన రాచరిక సామ్రాజ్యవాద ఆజ్ఞను మళ్లీ కిండర్‌గార్టెన్ నుంచి వల్లె వేయించడం.. రాచరిక సామ్రాజ్య విస్తరణ క్రమంలో ప్రాణాలు కోల్పోయిన ‘యుద్ధవీరుల ఆత్మల’కు జపాన్ ప్రజాప్రతినిధులు అధికారికంగా నివాళులర్పించడం వంటి పరిణామాలపై.. జపాన్ సామ్రాజ్యవాద బాధితులైన చైనా, దక్షిణకొరియా, థాయ్‌లాండ్ తదితర పొరుగు దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. జపాన్‌లో సైతం వీర దేశభక్తుల్లో ఈ పరిణామాలపై సంతోషం వ్యక్తమవుతోంటే.. ప్రజాస్వామిక వాదుల్లో మాత్రం ఆశ్చర్యాందోళనలు పెరుగుతున్నాయి. పసివారికి నిషిద్ధ రాజాజ్ఞ బోధనలు..: జపాన్‌లో 19వ శతాబ్దపు ఆరంభంలో రాచరిక ప్రభుత్వం సామ్రాజ్య విస్తరణ కోసం తన సైనిక బలాన్ని పెంపొందించుకోవడానికి దేశ ప్రజలు చక్రవర్తి కోసం ప్రాణాలు బలివ్వడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చే ఒక రాచాజ్ఞ అమలులో ఉండేది. ‘సామ్రాజ్య సింహాసనాన్ని పరిరక్షించడానికి, నిర్వర్తించడానికి, సుసంపన్నం చేయడానికి మిమ్మల్ని మీరు సాహసోపేతంగా రాజ్యానికి అప్పగించాలి’ అని పౌరులకు పిలుపునివ్వడం దాని సారాంశం. ఆ ఆజ్ఞ ఫలితంగా ప్రజలకు వ్యక్తిగత హక్కులు కూడా ఉండేవి కావు. చిన్నప్పటి నుంచే దీనిని నూరిపోయడం వల్ల పిల్లల నుంచి పెద్దల వరకూ ఆ ఆజ్ఞను బట్టీపట్టి చక్రవర్తి పిలుపునిచ్చిందే తడవుగా యుద్ధరంగానికి పరుగులు పెట్టేందుకు తయారుగా ఉండేవారు. 1890లో జారీ చేసిన ఈ రాచరిక ఆజ్ఞ నాటి జపాన్ సమాజంలో సామ్రాజ్యవాద, సైనిక సంస్కృతిని పెంచి పోషించేందుకు దోహదపడిందనే భావనతో.. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమి తర్వాత ఆ ఆజ్ఞలను నిషేధించారు. ఆనక రాచరిక ప్రభుత్వం అంతమై రాజు కేవలం ఒక అధికారిక చిహ్నంగా మిగిలిపోయాడు. కానీ.. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక వీడియో నాటి రోజులను గుర్తుకు తెచ్చింది. ఒసాకా కిండర్‌గార్టెన్‌లో ముక్కుపచ్చలారని పసివారు ఆ రాచాజ్ఞను కఠోరంగా పఠిస్తున్న దృశ్యమది. పాఠశాలల్లో ఆ ఆజ్ఞను బోధించడానికి జపాన్ ప్రభుత్వమే ఆమోదం తెలిపింది. ఇటీవల ప్రధానమంత్రి షింజో అబే సతీమణి అకీ సదరు పాఠశాలను సందర్శించి.. చిన్నారుల ‘దేశభక్తి’కి ముచ్చటపడుతూ పాఠశాలపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని షింజో, రక్షణమంత్రి టోమోమి ఇనాడా వంటి వారు మితవాద సంప్రదాయ ధోరణులను పునరుద్ధరించేందుకు చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ పరిణామాలు జరుగుతున్నాయని పలువురు రాజ్యాంగ నిపుణులు విమర్శిస్తున్నారు. యుద్ధ నేరస్తుల ఆత్మలకు నివాళి..: మరోవైపు.. జపాన్ సామ్రాజ్య విస్తరణ యుద్ధాల్లో పాల్గొని ప్రాణాలు విడిచిన దేశ సైనికులు, సైనికాధికారుల ‘ఆత్మల ఆలయం’ యసుకుని ప్రార్థనామందిరాన్ని కూడా దేశ పాలకులు, ప్రజాప్రతినిధులు తరచుగా సందర్శించి నివాళులర్పిస్తుండడం కూడా వివాదాస్పదమవుతోంది. ఈ ప్రార్థనా మందిరాన్ని జపాన్ సామ్రాజ్యవాద సైనికతత్వానికి చిహ్నంగా ఆసియా దేశాలు పరిగణిస్తాయి. ఈ మందిరంలో మొత్తం 24,66,532 మంది ‘అమర’ పురుషులు, మహిళలు, చిన్నారుల పేర్లు, వారి మూలాలు, జనన తేదీలు, మరణించిన ప్రదేశాల వివరాలు నమోదై ఉంటాయి. అందులో 1,068 మందిని యుద్ధ నేరస్తులుగా రెండో ప్రపంచ యుద్ధానంతరం మిత్ర దేశాల ట్రిబ్యునల్ పేర్కొంది. అందులోనూ 14 మంది ఎ-క్లాస్ (ప్రధమ శ్రేణి) నేరస్తులుగా ప్రకటించింది. తాజాగా శుక్రవారం నాడు కేంద్ర మంత్రితో సహా దాదాపు వంద మంది పార్లమెంటు సభ్యులు ఈ ప్రార్థనా మందిరాన్ని సందర్శించి అమరులకు నివాళులర్పించారు. ప్రధాని అబే ఆ పదవి చేపట్టిన తర్వాత ఒక్కసారి మాత్రం స్వయంగా ఈ మందిరాన్ని సందర్శించారు. ఆ తర్వాత నేరుగా రాకున్నా సంప్రదాయ ప్రార్థనలు, నివాళులను క్రమం తప్పకుండా పంపుతూ ఉన్నారు. సామ్రాజ్యవాదంతో యుద్ధ నేరాలకు పాల్పడ్డ వారిని అమరులుగా కీర్తిస్తూ జపాన్ ప్రభుత్వం నిరంతరం కొనియాడుతుండటం.. నాటి నేరాలను సమర్థించుకోవడమేనని చైనా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్‌లు మండిపడుతున్నాయి. పాఠంగా హిట్లర్ ఆత్మకథ..: ఇక జాత్యహంకారంతో సామ్రాజ్యవాద కాంక్షతో ప్రపంచాన్ని గడగడలాడించి లక్షలాది మందిని సామూహిక మానవ హనానికి పాల్పడిన నాజీ పాలకుడు హిట్లర్ ఆత్మకథ ‘మైన్ కాంఫ్’ను కూడా జపాన్ తన విద్యా సంస్థల్లో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. సైనిక విద్యలో భాగమైన తుపాకీ బాయినెట్లతో (కత్తులతో) పోరాట ప్రక్రియను జూనియర్ హైస్కూల్లో ఒక అంశంగా చేర్చింది. అంతేకాదు.. సామ్రాజ్య విస్తరణ కాలంలో జపాన్ నౌకాదళం తన యుద్ధ నౌకలకు వినియోగించిన పేర్లను.. ఇప్పుడు జపాన్ తన యుద్ధ నౌకలకు పెడుతోంది. గత నెలలో ఒక యుద్ధ నౌక పేరును ‘కాగా’ అని మార్చింది. ‘కాగా’ అనేది జపాన్ సామ్రాజ్య నౌకాదళంలో విమాన వాహక యుద్ధనౌక పేరు. ఈ చర్యలన్నీ షింజో ప్రభుత్వం జపాన్ సామ్రాజ్యవాద సంస్కృతిని, భావజాలాన్ని పునరుద్ధరించేందుకు చేపడుతున్న చర్యలుగా పొరుగు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
జపాన్‌తో అణుబంధం
మోదీ-షింజోశిఖరాగ్రంలో చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు - ఎన్పీటీపై సంతకం చేయకపోరుునా భారత్‌కు జపాన్ మినహారుుంపు - మౌలికరంగంలో పెట్టుబడులు, అంతరిక్ష, వ్యవసాయ సహకారం సహా జపాన్-భారత్‌ల మధ్య మరో 9 ఒప్పందాలు ఖరారు టోక్యో: ఇరు దేశాల అణు పరిశ్రమల మధ్య భాగస్వామ్యానికి ద్వారాలు తెరుస్తూ భారత్‌తో చరిత్రాత్మక పౌర అణు ఒప్పందంపై జపాన్ శుక్రవారం సంతకం చేసింది. దీంతో జపాన్ తన అణు సాంకేతికతను, రియాక్టర్లను భారత్‌కు ఎగుమతి చేసేందుకు దారులు తెరుచుకున్నాయి. జపాన్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ ఆ దేశ ప్రధాని షింజో అబేతో సమావేశమై చర్చలు జరిపారు. అణు ఒప్పందంతో పాటు.. మౌలిక రంగంలో జపాన్ పెట్టుబడులు పెంచడం, రైల్వేలు, అంతరిక్షం, వ్యవసాయ రంగాల్లో సహకారం తదితరాల్లో సంబంధాలను బలోపేతం చేస్తూ మరో 9 ఒప్పందాలూ కుదిరారుు. అణ్వస్త్ర దాడికి (రెండో ప్రపంచ యుద్ధంలో) గురైన ఏకై క దేశమైన జపాన్‌తో ఆరేళ్ల పాటు చర్చల అనంతరం ఈ పౌర అణు సహకార ఒప్పందం కుదిరింది. అణుశక్తి విషయంలో కఠిన విధానాలు అవలంబించే జపాన్.. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ)పై భారత్ సంతకం చేయకపోరుునా కూడా అణుశక్తిని శాంతియుత అవసరాలకు వినియోగించుకునేందుకు భారత్‌కు మినహారుుంపునిస్తూ ఈ ఒప్పందం చేసుకుంది. అమెరికా, రష్యా, దక్షిణ కొరియా, మంగోలియా, ఫ్రాన్స, నమీబియా, అర్జెంటీనా, కెనడా, కజకిస్తాన్, ఆస్ట్రేలియాలతో ఇప్పటికే భారత్ అణు ఒప్పందాలు చేసుకుంది. శిఖరాగ్ర భేటీ తర్వాత మోదీ, షింజోలు మీడియాతో మాట్లాడారు. స్వచ్ఛ ఇంధన భాగస్వామ్య నిర్మాణం కోసం కృషిలో ఈ ఒప్పందం చరిత్రాత్మక ముందడుగు అని మోదీ పేర్కొన్నారు. ఈ రంగంలో తమ సహకారం వాతావరణ మార్పు సమస్యపై పోరాడేందుకు దోహదపడుతుందన్నారు. ఒప్పందానికి మద్దతిచ్చినందుకు షింజోకు, జపాన్ ప్రభుత్వం, పార్లమెంటులకు కృతజ్ఞతలు తెలిపారు. అణ్వస్త్ర రహిత ప్రపంచాన్ని సృష్టించాలన్న తమ లక్ష్యానికి అణుగుణంగా ఈ ఒప్పందం ఉందని, దీనిపై సంతకం చేయటం సంతోషకరమని షింజో అన్నారు. భాగస్వామ్యంతో ప్రపంచానికి మేలు అనంతరం.. తన గౌరవార్థం షింజో ఏర్పాటు చేసిన ఒక విందు సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. ఇరు దేశాలూ సన్నిహిత భాగస్వాములుగా కేవలం తమ సమాజాల ప్రయోజనాల కోసమే కాకుండా.. ఈ ప్రాంతానికి, ప్రపంచానికి కూడా ప్రయోజనం కలిగించే కృషి చాలా చేయగలవన్నారు. ఎన్పీటీని ప్రపంచవ్యాప్తం చేయటం, సమగ్ర అణుపరీక్ష నిషేధ ఒప్పందం (సీటీబీటీ) అమలులో ప్రవేశం, (ఎఫ్ఎంసీటీ)పై త్వరగా చర్చలు ప్రారంభించాల్సిన అవసరముందని షింజో పేర్కొన్నారు. బలమైన ఆర్థిక భాగస్వామ్యం, వాణిజ్య, తయారీ, పెట్టుబడి సంబంధాల వృద్ధి, స్వచ్ఛ ఇంధనంపై దృష్టి కేంద్రీకరణ, పౌరుల భద్రతపై భాగస్వామ్యం, మౌలిక సదుపాయాల్లో సహకారం తదితరాలు కీలకాంశాలని మోదీ వివరించారు. ఇతర కీలక ఒప్పందాలు... రైల్వేలు, రవాణా, నౌకాశ్రయ టెర్మినళ్లు, టోల్ రోడ్లు, విమానాశ్రయ టెర్మినళ్లు, పట్టణాభివృద్ధిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో సహకారానికి, పెట్టుబడుల ప్రోత్సాహానికి జాతీయ పెట్టుబడులు, మౌలికసదుపాయాల నిధి - జపాన్ ఓవర్సీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఫర్ ట్రాన్సపోర్ట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ల మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. అంతరిక్ష సాంకేతికతలో సహకారం పెంపొందించుకోవడానికి.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) - జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ ఏజెన్సీ (జాక్సా)ల మధ్య ఒకటి, భారత భూశాస్త్రాల మంత్రిత్వశాఖ - జపాన్ మెరైన్-ఎర్త్ సెన్సైస్‌ల మధ్య మరొకటి - రెండు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయాలి.. ఉగ్రవాద వ్యాప్తిపై భారత్, జపాన్‌లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారుు. ఉగ్రవాదుల సురక్షిత స్థావరాలను నిర్మూలించి, వారి వ్యవస్థలను ధ్వంసం చేయడానికి, ఉగ్రవాదుల సీమాంతర కదలికలను నిలిపివేయడానికి ప్రపంచ దేశాలు కృషి చేయాలని కోరాయి. మోదీ, షింజోల భేటీ అనంతరం ప్రకటన విడుదల చేస్తూ.. ఉగ్రవాదాన్ని దాని అన్ని రూపాల్లోనూ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాద సంస్థలను గుర్తించటానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానం 1267, సంబంధిత ఇతర తీర్మానాలను అన్ని దేశాలూ అమలు చేయాలని కోరాయి. ముంబై, పఠాన్‌కోట్ దాడుల సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టాలని ఇరువురు నేతలూ పాకిస్తాన్‌కు సూచించారు. వ్యూహాత్మక దక్షిణ చైనా సముద్రంలో సరిహద్దు వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, భారత్, జపాన్‌లు పరోక్షంగా చైనాను ఉటంకిస్తూ పిలుపునిచ్చారుు. మోదీ శుక్రవారం జపాన్ చక్రవర్తి అకిహిటోను కలిశారు. ఇరు దేశాల మధ్య అనుబంధాలు, ఆసియా భవిష్యత్తు గురించి ఆయనతో చర్చించారు. 2023లో హైస్పీడ్ రైలు ఇరు దేశాల మధ్య సంబంధాల్లో కొత్త కోణాన్ని.. జపాన్ సహాయంతో ముంబై -అహ్మదాబాద్‌ల మధ్య నిర్మిస్తున్న హైస్పీడ్ ట్రైన్ కారిడార్ ప్రతిఫలిస్తోందని షింజే అభివర్ణించారు. ఈ ప్రాజెక్టును డిజైన్ చేయడం ఈ ఏడాది చివర్లో మొదలవుతుందని, ఈ ఏడాదే శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందనితెలిపారు. 2018 లో నిర్మాణం ప్రారంభమవుతుందని, 2023 నుంచి హైస్పీడ్ రైలు సేవలు ఆరంభమవుతాయన్నారు. భారత్‌లో 30,000 మందికి శిక్షణనిచ్చేందుకు జపాన్ ప్రైవేట్ రంగం ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాన్యుఫ్యాక్చరింగ్‌ను స్థాపించనున్నట్లు తెలిపారు. -
భారత్, జపాన్ మధ్య అణు ఒప్పందం
-
ఎన్ఎస్ఏల ఆకస్మిక భేటీ
బ్యాంకాక్‌లో భారత్-పాక్ రహస్య సమావేశం నిర్మాణాత్మక సంప్రదింపులను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ చర్చల్లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే దిశగా ఊహించని ముందడుగు పడింది. ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు(ఎన్ఎస్ఏ) ఆదివారం బ్యాంకాక్‌లో ఆకస్మికంగా సమావేశమయ్యారు. ఉగ్రవాదం, జమ్మూకశ్మీర్, ఇతర ద్వైపాక్షిక అంశాలపై నాలుగు గంటలపాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. చివరి నిమిషం వరకు రహస్యంగా ఉంచిన ఈ భేటీలో నిర్మాణాత్మక సంప్రదింపులను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. భారత ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి జైశంకర్, పాక్ ఎన్ఎస్ఏ నాసిర్ ఖాన్ జంజువా, విదేశాంగ కార్యదర్శి అహ్మద్ చౌధురీలు మంతనాల్లో పాల్గొన్నారు. చర్చలను ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షించినట్టు తెలుస్తోంది. ఎన్ఎస్ఏల భేటీ తర్వాత ఇరు దేశాల సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ‘పారిస్‌లో జరిగిన ప్రధానుల భేటీని అనుసరించి ఎన్ఎస్ఏలు, విదేశాంగ కార్యదర్శులు సమావేశ మయ్యారు. శాంతి, సుస్థిర, సుసంపన్న దక్షిణాసియా కోసం ఇరువురు ప్రధానుల దార్శనికత వారికి మార్గదర్శనం చేసింది. శాంతి, భద్రత, ఉగ్రవాదం, జమ్మూకశ్మీర్, నియంత్రణ రేఖ వద్ద సంయమనం తదితర అంశాలపై చర్చించారు. నిర్మాణాత్మక సంప్రదింపులను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు’ అని అందులో పేర్కొన్నారు. థాయ్‌లాండ్‌లో ఎందుకంటే.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరగాల్సిన ఎన్ఎస్ఏల చర్చలకు ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా తటస్థ దేశమైన థాయ్‌లాండ్‌ను వేదిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇరుపక్షాల ప్రతినిధులకు బ్యాంకాక్‌లో భేటీ కావడం సౌకర్యంగా ఉన్నందుకే అక్కడ చర్చలు జరిగినట్లు భారత అధికార వర్గాలు తెలిపాయి. భారత విదేశాంగ కార్యదర్శి జైశంకర్ జపాన్ ప్రధాని అబేతో చర్చల కోసం టోక్యోలో ఉండడం, పాక్ విదేశాంగ కార్యదర్శి ప్రయాణంలో ఉండడంతో ఇరుపక్షాలకు సౌకర్యంగా బ్యాంకాక్‌ను ఎంచుకున్నట్లు పేర్కొన్నాయి. పారిస్‌లో ఇటీవలి ప్రధానుల భేటీ అకస్మిక, మర్యాదపూర్వకంగా జరిగింది మాత్రమే కాదని ఎన్ఎస్ఏ చర్చలు చెబుతున్నాయి. సంప్రదింపులను ముందుకు తీసుకెళ్లాలన్న ఎన్ఎస్ఏల నిర్ణయం చర్చల పునరుద్ధరణ కోసం వారు రోడ్‌మ్యాప్ ప్రకారం కసరత్తు చేసి ఉంటారడానికి నిదర్శనం. ఎన్ఎస్ఏల భేటీ మహాద్రోహం: కాంగ్రెస్ ఎన్ఎస్ఏలు రహస్యంగా భేటీ కావడం మోదీ ప్రభుత్వం చేసిన మహాద్రోహమని కాంగ్రెస్ మండిపడింది. పాక్ విషయంలో అనుసరిస్తున్న క్రమ రాహిత్యానికి ఇది నిదర్శనమని పార్టీ నేత మనీశ్ తివారీ ఆరోపించారు. ‘ప్రభుత్వం ఎంచుకున్న విధానానికి, బయటికి చెప్పుకున్నదానికి ఇది పూర్తి విరుద్ధం. గతంలో ఎన్ఎన్ఏల చర్చల రద్దుకు మీదంటే మీదే బాధ్యతని ఇరు దేశాలూ నిందించుకున్నాయి. మోదీ ప్రభుత్వ 18 నెలల చరిత్రను చూస్తే పాక్‌పై దాని విధానం పరిహాసాస్పదంగా ఉందని తేలుతుంది’ అని విలేకర్లతో అన్నారు. ఇరు దేశాల పరస్పర నిందల తర్వాత దేశానికి ఎలాంటి వివరణా ఇవ్వకుండా బ్యాంకాక్‌లో చర్చలు జరిపారని, అవి అంత అవసరం అని అనుకుంటే వివరణ ఇవ్వాల్సి ఉండిందని అన్నారు. చర్చలను బీజేపీ సమర్థించుకుంది. రష్యాలోని ఉఫాలో ప్రధానులు జారీ చేసిన ప్రకటన స్ఫూర్తితోనే అవి జరిగాయని బీజేపీ ప్రతినిధి నళిన్ కోహ్లి అన్నారు. చర్చలను జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. ఉఫాలో నాంది... తాజా ఎన్ఎస్ఏల చర్చలకు రష్యాలోని ఉఫాలో జూలైలో షాంఘై సహకార సమితి సదస్సు సందర్భంగా జరిగిన మోదీ, నవాజ్‌ల భేటీ నాంది పలికింది. ద్వైపాక్షిక చర్చలను పునరుద్ధరించాలని, ముంబై దాడుల కేసు విచారణను వేగవంతం చేయాలని నాటి సమావేశంలో నిర్ణయించడం తెలిసిందే. ఎన్ఎస్ఏలు, బీఎస్ఎఫ్, పాక్రేంజర్స్ డెరైక్టర్ జనరళ్ల భేటీలు తదితరాలను నిర్వహించాలని అప్పుడు నిర్ణయించారు. ప్రకటన ప్రకారం సెప్టెంబర్‌లో జరగాల్సిన ఎన్ఎస్ఏల భేటీ పాక్ అడ్డుపుల్ల వేయడంతో సాకారం కాలేదు. చర్చల ఎజెండాలో కశ్మీర్ అంశాన్ని చేర్చాలని, నాటి పాక్ ఎన్ఎస్ఏ అజీజ్ కశ్మీర్ వేర్పాటువాదులతో ముందస్తుగా భేటీ కావడానికి అనుమతించాలని పాక్ డిమాండ్ చేసింది. వీటిని భారత్ అంగీకరించకపోవడంతో అజీజ్ పర్యటన రద్దు చేసుకున్నారు. భారత్ లేవనెత్తిన ప్రధాన అంశాలు ► జమాత్ ఉద్ దవా చీఫ్, హఫీజ్ సయీద్ అప్పగింత ► 26/11 ముంబై దాడుల సూత్రధారి జకీర్ రహమాన్ లఖ్వీ అప్పగింత ► 26/11 ముంబై దాడుల విచారణలో పారదర్శకత ► జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అణచివేత ► దావూద్ ఇబ్రహీం అప్పగింత ఈ చర్చల వెనుక.. ► ఘర్షణలు, వివాదాలకంటే సంప్రదింపులే మంచిదని ఇరు దేశాలు భావించాయి. ► ఉగ్రవాదంపై చర్చ భారత్‌కు అవసరం. ప్రపంచ దేశాల ద్వారా భారత్ తెచ్చిన ఒత్తిడికి పాక్ తలొగ్గింది. ► బ్యాంకాక్‌లో చ ర్చిస్తే కశ్మీర్ వేర్పాటువాదులతో తలెత్తే సమస్యను అధిగమించ్చొచ్చన్న భావన. ► క్రియాశీలంగా ఉండే భారత ఉపఖండ మీడియాను దూరంగా ఉంచడానికి. ► వచ్చే వారం సుష్మా స్వరాజ్ చేపట్టే పాక్ పర్యటనకు సన్నాహాలు పూర్తి చేయడం.