వామ‍్మో..! మరీ ఇంత ప్రమాదకరంగా పుష్‌అప్స్‌ చేస్తారా..? వీడియో వైరల్‌.. | Man Performs Push Ups on Top of a Road Sign in Odisha | Sakshi
Sakshi News home page

అన్నా జాగ్రత్తా..! మరీ ఇంత ప్రమాదకరంగా పుష్‌అప్స్‌ అవసరమా..? వీడియో వైరల్‌..

Published Sun, Jun 25 2023 6:35 PM | Last Updated on Sun, Jun 25 2023 7:16 PM

Man Performs Push Ups on Top of a Road Sign in Odisha - Sakshi

ఒడిశా: ఫేమస్ కావడానికి ఏవో రకరకాల స్టంట్లు చెస్తుంటారు. సామాజిక మాధ్యమాల్లో అలాంటి వీడియోలను పోస్టు చేసి, వచ్చిన లైకులను చూసి గర్వంగా ఫీల్ అవుతుంటారు. ఈ మధ్య ఈ భయంకరమైన ట్రెండ్ మరీ ఎక్కువైంది. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే.. వీడియోలో ఓ వ్యక్తి చేసిన స్టంట్ మరీ ప్రమాదకరంగా ఉంది. రహదారిపై నిర్మించిన బోర్డుపై పుష్‌అప్స్ చేశాడు. ఈ ఘటన ఒడిశాలోని బోలాన్‌గిరి జిల్లాలో జరిగింది. 

పట్నాగర్హ్ పట్టణానికి వెళ్లే మార్గంలో రహదారిపై ఊరిపేరును చూపుతూ ఓ పెద్ద బోర్డును నిర్మించారు గ్రామస్థులు. అయితే.. ఈ బోర్డుపై ఓ యువకుడు ప్రమాదకరంగా స్టంట్స్ చేశాడు. సన్నగా ఉండే ఆ సైన్‌బోర్డుపైకి ఎక్కి.. పుష్‌అప్స్ చేశాడు. ఓ పక్క బోర్డు క్రింద రోడ్డుపై వాహనాలు వెళ్తున్నాయి. మరోపక్క యువకుడు బోర్డుపై పుష్‌అప్స్ చేశాడు. స్థానికంగా అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ ప్రమాదకరమైన స్టంట్స్ చూసి ఆందోళన చెందారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. 

సోషల్ మీడియాలో ఆ యువకుడు పుష్‌అప్స్ చేసిన వీడియోను పోస్టు చేసిన వారంలోనే మిలియన్ల లైక్స్ వచ్చాయి. వీడియోను చూసి వ్యూయర్స్ రకరకాలుగా స్పందించారు. ఇంత ధైర్యంగా ఎలా పుష్‌అప్స్ చేశారని కామెంట్లు పెట్టారు. ఆ యువకుని ధైర్యాన్ని కొందరు మెచ్చుకోగా .. మరికొందరు వ్యతిరేకంగా స్పందించారు. ఈ ప్రమాదకరమైన స్టంట్స్‌ను అంగీకరించలేమని కామెంట్లు పెట్టారు.

ఇదీ చదవండి: సూపర్ పోలీస్.. రాకాసి అలల్లో పిల్లలను కాపాడి.. వీడియో వైరల్‌...

  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement