సాక్షి, బళ్లారి: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటకలో చిత్రదుర్గం జిల్లాలోకి ప్రవేశించింది. యాత్ర 34వ రోజు మంగళవారం ఉదయం వర్షం కారణంగా గంటపాటు ఆలస్యంగా మొదలైంది. హర్తికోటె నుంచి భారీ జన సందోహం మధ్య పాదయాత్ర ప్రారంభించారు. అందరినీ పలకరిస్తూ, చేయి ఊపుతూ పాదయాత్ర కొనసాగించారు. చెళ్లకెరె తాలూకాలో విద్యార్థులు ఆయనతో పాటు నడిచారు. గ్రామాల్లో ఇళ్లపై నుంచి జనం తిలకించారు.
మధ్యలో భోజన విరామ సమయంలో రెండు చేతులూ లేని ఓ దివ్యాంగురాలు రాహుల్‌ను కలిశారు. కాగితంపై కాలితో ఆమె రాయడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. మరోచోట రాహుల్ పిల్లలు, స్థానికులతో కలిసి రోడ్డుపైనే పుషప్స్ తీశారు. సనికెరె వద్ద రాహుల్‌ను ఆషా, ఉపాధి హామీ, అంగన్‌వాడీ సిబ్బంది, ఏఎన్‌ఎంలు కలిశారు. ‘దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం మన కూతుళ్లకు సమాన అవకాశాలు, భద్రత, గౌరవం తప్పక కల్పించాల్సిన అవసరం ఉంది’అని రాహుల్ అనంతరం ట్వీట్ చేశారు. యాత్రలో తనతో కలిసిన విద్యార్థినుల ఫొటోను షేర్ చేశారు.
#BharatJodoYatra Push-Up Challenge! pic.twitter.com/SokyTW09uM
— Congress (@INCIndia) October 11, 2022
ఇదీ చదవండి: దీపావళి బాణసంచా మోతపై షరతులు.. కేవలం ఆ 2 గంటలే!
Comments
Please login to add a commentAdd a comment