గంటలో 3,206 పుష్‌ అప్‌లు | Australian performs 3206 pushups in hour | Sakshi
Sakshi News home page

గంటలో 3,206 పుష్‌ అప్‌లు

Published Mon, Apr 17 2023 6:00 AM | Last Updated on Mon, Apr 17 2023 6:00 AM

Australian performs 3206 pushups in hour - Sakshi

సిడ్నీ: జిమ్‌ చేసే సిక్స్‌ప్యాక్‌ బాడీ అయినా రోజూ 100 పుష్‌అప్‌లు చేస్తేనే బాగా అలిసిపోతారు. అలాంటిది ఆస్ట్రేలియాకు చెందిన ఒక వ్యక్తి కేవలం గంటలో 3,206 పుష్‌అప్‌లు చేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులకెక్కారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు చెందిన 33 ఏళ్ల లుకాస్‌ హెల్మెక్‌ పుష్‌ అప్‌లు చేయడం ద్వారా తనకున్న స్టామినా ఏంటో ప్రపంచానికి చూపించాడు.

గంటకి 3,182 పుష్‌ అప్‌లు చేసి రికార్డు సా«ధించిన సాటి ఆస్ట్రేలియన్‌ డేనియల్‌ స్కాలి పేరు మీదున్న రికార్డుల్ని బద్దలు కొట్టాడు. లుకాస్‌ నిమిషానికి 53 పుష్‌ అప్‌లు చేశాడని గిన్నిస్‌ వరల్డ్‌ అధికారులు వెల్లడించారు. ఈ రికార్డు సాధించడానికి అనుభవజ్ఞులైన జిమర్‌ల దగ్గర రెండు మూడేళ్ల పాటు శిక్షణ కూడా తీసుకున్నట్టు లుకాస్‌ వెల్లడించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement