
‘నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది’ అంటున్నాడు ఆస్ట్రేలియాకు చెందిన హెన్రిచ్ డి విలియర్స్. 24గంటల్లో 78 పబ్బుల్లో తాగి అత్యధిక ‘పబ్ క్రాల్’ (లైసెన్సులున్న పబ్బులను సందర్శించి అన్నింట్లోనూ ఆల్కహాల్ తాగడం) చేసిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒక్కరోజులో 78 పబ్బులా? ఎంత తాగి ఉంటాడో అనే కదా సంశయం.
ఒక్కో పబ్బులో 125 ఎమ్‌ఎల్ మాత్రమే తాగాలని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ రూల్. ఆ ప్రకారమే తాగాడు. అంత తాగిన తరువాత స్టడీగా ఉన్నాడా? అంటే.. అందుకే తనకు సహాయంగా తమ్ముడు రువాల్డ్ డి విలియర్స్‌ను, ఫ్రెండ్.. వెస్సెల్ బర్గర్‌ను వెంట బెట్టుకు వెళ్లాడు. అయినా సరే... 24 గంటల్లో 78 పబ్బులకు వెళ్లడమంటే.. సాధారణ విషయం కాదు. రికార్డు కోసం మెల్‌బోర్న్‌లోని బార్స్ గురించి బాగా రీసర్చ్ చేసి.. ముగ్గురూ పక్కాగా రూట్‌మ్యాప్ ప్లాన్ చేసుకున్నారు. జీపీఎస్ ట్రాకింగ్‌తో గమ్యస్థానాన్ని చేరుకుని రికార్డ్ బ్రేక్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment