న్యూఢిల్లీ: భారత భూభాగంలోకి చైనా సైనిక దళాల చొరబాటు సమస్య మరింత తీవ్రంగా పరిణ మించింది. లడక్ ప్రాంతంలో చుమర్ సెక్టార్ గత రెండు రోజుల్లోనే రెండవ సారి చైనా సైన్యం చొరబాటుకు పాల్పడింది. గురువారం చొరబాటు జరిపి వెనక్కు మళ్లిన ప్రాంతంలోనే మరో చోట చైనా దళాలు భారత భూభాగంలోకి చొరబడ్డాయి. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ)కి చెందిన దాదాపు 50మంది సైనికులు తొమ్మిది వాహనాల్లో వచ్చి, చుమర్ ప్రాంతంలో భారత్ పరిధిలోని ఒక చిన్న కొండపైకి చేరుకున్నారని, అంతకు ముందు అక్కడే మకాంవేసిన 35మంది సైనికులకు అదనంగా వారూ చేరారని అధికార వర్గాలు తెలిపాయి.
సరిహద్దువద్ద భారతసైనికులకు వంద మీటర్ల దూరంలోనే వారి ముందే వాహనాలు దిగివెళ్లారని అధికార వర్గాలు తెలిపాయి. కొండపై ఉన్న చైనా సైనికుల కోసం చైనా హెలికాప్టర్లు ఆహారం పొట్లాలు జారవిడుస్తున్నాయని, అయితే, ెహ లికాప్టర్లు మాత్రం ఇప్పటివరకూ గ గనతల ంలో ఉల్లంఘనకు పాల్పడలేదని అధికారవర్గాలు తెలిపాయి.
మళ్లీ చైనా చొరబాటు మళ్లీ చైనా చొరబాటు
Published Sun, Sep 21 2014 1:23 AM | Last Updated on Mon, Aug 13 2018 3:30 PM
Advertisement
Advertisement