ఎల్ఏసీ వద్ద శాంతియుత వాతావరణం:చైనా | Situation at LAC “peaceful”, says China | Sakshi
Sakshi News home page

ఎల్ఏసీ వద్ద శాంతియుత వాతావరణం:చైనా

Published Tue, Sep 23 2014 5:41 PM | Last Updated on Mon, Aug 13 2018 3:30 PM

కాశ్మీర్‌లోని లఢక్ సెక్టార్‌లోని వాస్తవాధీనరేఖ (ఎల్‌ఏసీ) వద్ద ప్రస్తుతం శాంతియుత వాతావరణం నెలకొని ఉందని చైనా స్పష్టం చేసింది.



ఎల్ఏసీ వద్ద శాంతియుత వాతావరణం:చైనా


బీజింగ్: కాశ్మీర్‌లోని లఢక్ సెక్టార్‌లోని వాస్తవాధీనరేఖ (ఎల్‌ఏసీ) వద్ద ప్రస్తుతం శాంతియుత వాతావరణం నెలకొని ఉందని చైనా స్పష్టం చేసింది. చైనా సైనికులు  చొరబాట్లకు పాల్పడుతూ, భారత భూభాగంలోకి చొచ్చుకువస్తున్నారన్నవార్తలతో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో చైనా తాజా పరిస్థితిపై వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఎల్ఏసీ వద్ద శాంతియుత వాతావరణం ఉందని తెలిపింది. అసలు ఎల్‌ఏసీ నిర్ధారణపై భారత్, చైనాల మధ్య విభిన్నమైన వాదనలున్నాయని, సరిహద్దు సమస్యలుంటే ఉభయపక్షాలు చర్చలతో పరిష్కరించుకోవచ్చని చైనా సైన్యం సోమవారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 

 

అయితే,.. లఢక్ సెక్టార్‌లో తాజా ప్రతిష్టంభనపై చర్చ జరిగిందా? లేదా? అన్నది మాత్రం చైనా సైన్యం వివరించలేదు. లఢక్ వద్ద చుమర్ ప్రాంతంలో చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీకి, భారత సైన్యానికి మధ్య గత వారంగా కొనసాగుతున్న ప్రతిష్టంభనపై పీటీఐ అడిగిన ప్రశ్నలకు స్పందనగా చైనా జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఈ వ్యాఖ్య చేశారు. సరిహద్దులో ఇటీవలి పరిణామాలపై మీడియాలో వెలువడిన వార్తలను తాము గమనించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement