చైనా అంతర్జాతీయ సరిహద్దులో విభేదాలను సాధారణీకరించే నిర్వహణకు పిలుపుచ్చింది. గాల్వన్ ఘటన నేపథ్యంలో ఇరుదేశాల రక్షణమంత్రుల మొదటి సమావేశంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చిన బలమైన సందేశం తదనంతరం చైనా జనరల్ లీ షాంగ్‌ఫూ ఇలా వ్యాఖ్యానించారు. ఈ మేరకు చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో.. ఇరుపక్షాలు దీర్ఘకాలికి దృక్పథాన్ని తీసుకోవాలి. ద్వైపాక్షిక సంబంధాలలో సరిహద్దు సమస్యను తగిన స్థానంలో ఉంచాలి. సరిహద్దు పరిస్థితిని సాధారణీకరించే నిర్వహణకు ప్రోత్సహించాలి అని పేర్కొంది.
ఐతే ఇది భారత్‌కు ఆమోదయోగ్యం కాదు. సరిహద్దు పరిస్థితి రెండు దేశాల మధ్య బంధాల విస్తరణతో ముడిపడి ఉందని భారత్ స్పష్టం చేసింది. కానీ చైనా భారత్‌తో విభేదాల కంటే సాధారణ ప్రయోజనాలనే పంచకుంటుందని తెలిపింది. ఇరు పక్షాల ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర అభివృద్ధిని, సమగ్ర దీర్ఘకాలికి వ్యూహాత్మక కోణం నుంచి చూడాలని చైనా నొక్కి చెబుతోంది. తద్వారా ప్రపంచానికి వివేకం, బలాన్ని సంయుక్తంగా అందించాలని చైనా పేర్కొంది.
ఇదిలా ఉండగా, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం సందర్భంగా ఇరు పక్షుల మంత్రుల సమావేశం తర్వాత భారత్ తన ప్రకటనలో భారత్ చైనా మధ్య సంబంధాల అభివృద్ధి శాంతి ప్రాబల్యంపైనే ఆధారపడి ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పషం చేశారు. సరహద్దు సమస్యలు ద్వైపాక్షిక ఒప్పందాలకు, నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఒప్పందాల ఉల్లంఘన ద్వైపాక్షిక సంబంధాల మొత్తం ప్రాతిపదికన క్షీణింపచేస్తుందని హెచ్చరించారు.
సరిహద్దులను విడదీయడంతో ఈ సమస్య మరింత తీవ్రతరం అవుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ పునరుద్ఘాటించారు. చైనా మాత్రం సరిహద్దుల్లో పరిస్థితి సాధారణంగా స్థిరంగా ఉందని ఇరు పక్షాల సైనికు దౌత్య మార్గాల ద్వారా చర్చలు కొనసాగించాయని చెబుతోంది. అందువల్ల పరస్పర విశ్వాసాన్ని పెంపొందించేలా కలిసి పనిచేయాలని ఆశిస్తున్నామని అందుకు సహకరించండి అని చైన పేర్కొనడం గమనార్హం.
(చదవండి: నా కూతురు కారణంగానే అతను ప్రధాని అయ్యారు! సుధామూర్తి)
Comments
Please login to add a commentAdd a comment