న్యూఢిల్లీ:భారత్-చైనా మధ్య కొన్నేళ్లుగా సాగుతున్న వివాద పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది. వాస్తవాధీనరేఖ(ఎల్‌ఓఏసీ) వద్ద బలగాల ఉపసంహరణకు సంబంధించి ఇరు దేశాలూ ఓ ఒప్పందానికి వచ్చాయని,ఎల్‌ఓఏసీ వద్ద గస్తీని మళ్లీ ప్రారంభించడానికి అంగీకరించాయని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.
అక్టోబర్ 22,23 రెండు రోజుల పాటు రష్యాలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ వెళ్లనున్న తరుణంలో భారత్, చైనా దౌత్యవ్యవహరాల్లో కీలక పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. సరిహద్దులో ఎల్‌ఓఏసీ వెంబడి పెట్రోలింగ్ పునఃప్రాంభంపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.
అనేక వారాలుగా జరుపుతున్న చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరిందని చెప్పారు. బలగాల ఉపసంహరణ 2020లో ఇరు దేశాల మధ్య తలెత్తిన సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పాక్‌లో హిందూ గుడికి మోక్షం..64 ఏళ్ల తర్వాత పునర్నిర్మాణం
Comments
Please login to add a commentAdd a comment