
గోవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విద్యార్థులతో ముచ్చటిస్తున్న దలైలామా (ఫొటో కర్టెసీ : ఇండియన్ ఎక్స్‌ప్రెస్))
పనాజి : మహ్మద్ అలీ జిన్నాను గనుక ప్రధాని చేసి ఉంటే అవిభాజ్య భారత్ ముక్కలయ్యేది కాదని బౌద్ధ గురువు దలైలామా అన్నారు. గోవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. ఈ క్రమంలో తప్పులు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటూ ఓ విద్యార్థి ఆయనను ప్రశ్నించారు. ప్రతీ ఒక్కరు జీవితంలో ఎప్పుడో ఒకసారి తప్పు చేస్తారన్న దలైలామా.. ఇందుకు భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ వంటి గొప్ప వ్యక్తులు కూడా అతీతం కాదంటూ సమధానమిచ్చారు.
‘మహ్మద్ అలీ జిన్నాను ప్రధాని చేయాలని మహాత్మా గాంధీ భావించారు. కానీ అందుకు నెహ్రూ ఒప్పుకోలేదు. తాను ప్రధాని అవ్వాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఒకవేళ నెహ్రూ గనుక ఆ తప్పు చేయకపోయి ఉంటే జిన్నా ప్రధాని అయ్యేవారు. భారతదేశం.. భారత్, పాకిస్తాన్‌గా విడిపోయేది కాదు. అయినా తప్పులు జరగడం సహజం’ అని దలైలామా వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment