యూపీలోని వారణాసి పార్లమెంట్ స్థానం నుంచి మూడోసారి నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ తొలి ప్రధాని నెహ్రూ, వాజ్‌పేయిల రికార్డును సమం చేశారు. ఈ మాజీ దివంగత ప్రధానులిద్దరూ ఒకే లోక్‌సభ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి భారీ ఓట్లతో విజయం సాధించారు. ఇప్పుడు మోదీ కూడా ఒకే లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పారు.
పండిట్ నెహ్రూ 1951, 1957, 1962లో మూడుసార్లు ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని ఫుల్‌పూర్ సీటుకు ఎంపీగా ఉన్నారు. మూడుసార్లు ప్రధానిగా దేశ పగ్గాలను చేపట్టారు. భారతరత్న పండిట్ అటల్ బిహారీ వాజ్‌పేయి లక్నో నుంచి ఐదుసార్లు ఎంపీగా ఉన్నప్పటికీ, 1996, 1998, 1999లో ఎంపీ అయిన తర్వాత ప్రధాని పదవిని చేపట్టారు. తాజాగా నరేంద్ర మోదీ 2014, 2019లో వారణాసి ఎంపీగా ఎన్నికయ్యారు. రెండు పర్యాయాలు ఆయన నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వారణాసి నుంచి మూడోసారి నామినేషన్ దాఖలు చేయడం ద్వారా, ఒకే లోక్‌సభ స్థానం నుంచి వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో పోటీ చేసిన ఘనత దక్కించుకున్నారు.
భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో 14 మంది ప్రధానులు దేశాన్ని పాలించారు. వారిలో తొమ్మిది మంది ఉత్తరప్రదేశ్‌కు చెందినవారే కావడం విశేషం. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ నుంచి మొదలైన ఈ ట్రెండ్ నరేంద్ర మోదీ వరకూ వచ్చింది. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధి, చౌదరి చరణ్ సింగ్, రాజీవ్ గాంధీ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్, అటల్ బిహారీ వాజ్‌పేయి యూపీలోని వివిధ స్థానాల నుండి ఎన్నికలలో గెలిచి పార్లమెంటుకు చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment