అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలో అంతర్గత భాగమని, దీన్ని ఎవరూ వేరు చేయలేరని భారత్ స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలో అంతర్గత భాగమని, దీన్ని ఎవరూ వేరు చేయలేరని భారత్ స్పష్టం చేసింది. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చైనాకు సూచించింది. చైనా వ్యవహారాల్లో తమ దేశం తలదూర్చడం లేదని, అలాగే చైనా కూడా తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదని భావిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. టిబెట్ ఆధ్యాత్మిక బౌద్ధ గురువు దలైలామా అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇది పూర్తిగా మతపరమైన పర్యటన అని, ఇందులో ఎటువంటి రాజకీయం లేదని స్పష్టం చేశారు.
నేటి నుంచి వారం రోజుల పాటు అరుణాచల్ ప్రదేశ్ లో దలైలామా పర్యటించనున్నారు. సరిహద్దులో సున్నిత ప్రాంతమైన తవాంగ్ లో దలైలామా పర్యటించనుండడంపై చైనా తీవ్ర అభ్యంతరం చేసింది. ఆయన పర్యటనను అడ్డుకోకుంటే దౌత్యపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది.