![India Rejects China Comments On Arunachalpradesh - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/12/india%2Cchina.jpg.webp?itok=c7KdtRE1)
న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌లో ఇటీవల ప్రధాని మోదీ చేసిన పర్యటనపై చైనా ప్రకటనను భారత్ ఖండించింది. ప్రధాని పర్యటనపై చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ చేసిన వ్యాఖ్యలు వాస్తవ దూరమైనవని, అరుణాచల్ ప్రదేశ్ ఎల్లప్పడూ భారత్‌లో భాగమేనని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ మంగళవారం స్పష్టం చేశారు.
‘అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా ఉన్నతాధికారి వెన్‌బిన్ చేసిన వ్యాఖ్యలను మేం ఖండిస్తున్నాం. భారత్‌లోని మిగిలిన రాష్ట్రాల్లో పర్యటించినట్లుగానే మా నాయకులు అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ పర్యటిస్తారు’ అని జైస్వాల్ తెలిపారు. కాగా, మార్చి 9వ తేదీన ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు.
ఈ పర్యటనలో భాగంగా అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన ప్రపంచంలోనే అతి పొడవైన సేలా టన్నెల్‌తో పాటు ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. ఈ పర్యటనపై మార్చ్ 11న చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ దక్షిణ టిబెట్‌లోని జాంగాన్(అరుణాచల్ ప్రదేశ్) తమ దేశంలో భాగమని, అరుణాచల్‌ప్రదేశ్ అనే రాష్ట్రాన్ని తాము గుర్తించడం లేదని వ్యాఖ్యానించడం భారత్ ఆగ్రహానికి కారణమైంది.
Comments
Please login to add a commentAdd a comment