ధర్మశాల: ప్రపంచాన్ని వణికిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మంత్రాలు పఠించాలని చైనాలోని తన అనుచరులకు టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా సూచించారు. వుహాన్ నగరంలో కరోనా వైరస్ వల్ల ఆ దేశంలో ఇప్పటివరకూ 130 మంది చనిపోగా వేలాది మంది ఆ వైరస్ బారిన పడ్డారు. దీంతో చైనాలోని కొందరు ఆయన భక్తులు.. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సలహా ఇవ్వాలని ఫేస్‌బుక్ వేదికగా దలైలామాను కోరారు. (ఆ పిశాచి ఎక్కడ దాక్కున్నా వదలం : చైనా అధ్యక్షుడు)
దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘తారా మంత్రం’ పఠించాలని సూచించారు. వైరస్ వ్యాప్తి నిరోధానికి ఈ మంత్రం సాయపడుతుందని చెప్పారు. ‘ఓం తారే తుత్తారే తురే సోహా’ అంటూ మంత్రం పఠిస్తున్న ఆడియో క్లిప్‌ను కూడా తన పోస్టుకు దలైలామా జతచేశారు. తార మంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. మంత్రం జపించి మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఎలాంటి బాధలు ఉండవు అని దలైలామా పేర్కొన్నారు. టిబెటన్ ఆధ్యాత్మిక గురువు స్వయంగా తన గొంతును ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. దలైలామా పేర్కొన్న ఆ మంత్రం ప్రస్తుతం చైనాలో వైరల్ అవుతోంది. గత ఇరవై నాలుగు గంటల్లో 1300 కొత్త కేసులు నమోదయ్యాయి. దగ్గు, జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు వైరస్ లక్షణాలని వైద్య నిపుణలు చెబుతున్నారు. (ఈ బీరు తాగితే కరోనా వైరస్ సోకుతుందా..!)
Comments
Please login to add a commentAdd a comment