
ధర్మశాల: దేశంలో కోవిడ్ మహమ్మారి ప్రబలిన దాదాపు రెండేళ్ల తర్వాత బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా శుక్రవారం బయటకు వచ్చారు. ధర్మశాలలో ఉన్న బౌద్ధ సన్యాసులు, ఇతర సభ్యులకు జాతక కథలను ఆయన బోధించారు.
అనంతరం, టిబెటన్ బౌద్ధుల ప్రధాన ఆలయం వద్ద బోధిచిత్త వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా దలైలామా మాట్లాడుతూ..‘శుక్రవారం ఢిల్లీ వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది. అయితే, నా ఆరోగ్యం చాలా బాగుండటంతో వెళ్లడం మానేశాను. మా డాక్టర్‌తో కూడా ఇప్పుడు బాక్సింగ్ ఆడుకుంటున్నాను’ అంటూ ఆయన చమత్కరించారు.