సరైన దారిలో నడవండి: చైనా
బీజింగ్: ‘ఇప్పటికీ సమయం మించిపోయిందేమీ లేదు.. మీరు ప్రత్యేక వాదాన్ని విడిచి పెట్టి సరైన దారిలో నడవండి’ అని టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు చైనా పిలుపునిచ్చింది. టిబెట్ వివాదానికి స్వస్తి పలికే ఉద్దేశంలో మధ్యేమార్గంగా టిబెట్‌కు స్వయంప్రతిపత్తి కల్పించాలని దలైలామా చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హాంగ్ లీ స్పందించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘దలైలామా చైనాను విడగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటికీ సమయం మించిపోయింది లేదు. మీరు ప్రత్యేక వాదాన్ని విడిచి సరైన మార్గంలో నడవండి’ అని హితబోధ చేశారు. తమకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలన్న డిమాండ్ పై గతంలో టిబెట్ తో చైనా చర్చలు జరిపిన విఫలమయ్యాయి. గత కొన్నేళ్లు రెండు వైపుల చర్చలు లేవు. మరోవైపు ధర్మశాల (హిమాచల్‌ప్రదేశ్) నుంచి దలైలామా తిరిగి రావాలని కోరుతూ ఇటీవల కాలంలో 120 మందిపైగా టిబెటన్లు ఆత్మబలిదానాలకు పాల్పడ్డారు.