కరోనా సునామీ : దలైలామా సాయం | COVID-19 Indias fight : Dalai Lama contributes to PM-CARES Fund | Sakshi
Sakshi News home page

కరోనా సునామీ: దలైలామా సాయం

Published Tue, Apr 27 2021 3:27 PM | Last Updated on Tue, Apr 27 2021 3:55 PM

COVID-19 Indias fight : Dalai Lama contributes to PM-CARES Fund  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 విలయంతో అల్లాడుతున్న భారత్‌కు సాయం చేసేందుకు ప్రపంచ దేశాలుముందుకొస్తున్నాయి. కరోనా నిర్యూలనకు దేశం చేస్తున్న ప్రయత్నాలకు టిబెటన్ ఆధ్యాత్మిక గురువు  దలైలామా మద్దతుగా నిలిచారు. పీఎం-కేర్స్ ఫండ్‌కు సహకరించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మహమ్మారి విస్తరణను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను దలైలామా ప్రశంసించారు. ముఖ్యంగా ఫ్రంట్‌లైన్‌లో పనిచేస్తున్న వారి కృషిని ఆయన అభినందించారు. (ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌సేల్‌: భారీ ఆఫర్లు)

భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కరోనా వరుస సవాళ్లను ఆందోళనతో గమనిస్తూనే ఉన్నానంటూ దలైలామా ఆవేదన వ్యక్తంచేశారు. ఈ భయంకరమైన కరోనా సునామిలో తోటి భారతీయ సోదర, సోదరీ మణులకు తన సంఘీభావంగా  పీఎం కేర్స్‌ ఫండ్‌కు విరాళం ఇవ్వమని దలైలామా ట్రస్ట్‌ను కోరానని ఆయన చెప్పారు.  ఈ మహమ్మారి ముప్పు త్వరలోనే ముగిసిపోవాలని ఆయన కోరుకున్నారు. మరోవైపు దేశంలో రోజుకు 3లక్షలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్న క్రమంలో మంగళవారం నాటికి 3,23,144 మంది కొత్తగా క రోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,76,36,307కు పెరిగింది. అయితే జాతీయ రికవరీ రేటు 82.54 శాతంగాఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. (కరోనా రెండో దశ : స్వల్పంగా తగ్గిన పాజిటివ్‌ కేసులు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement