
దలైలామాకు వీసా నిరాకరణ
కేప్‌టౌన్: ప్రముఖ భౌద్ధ మత గురువు దలైలామాకు దక్షిణాఫ్రికా మరోసారి వీసా నిరాకరించింది. అక్టోబర్ 13వ తేదీ నుంచి 15 తేదీ వరకూ దక్షిణాఫ్రికాలో జరగనున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీతల ప్రపంచ సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఆగస్టు 27న వీసాకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే దలైలామా పర్యటన వల్ల చైనాతో సంబంధాలకు ఇబ్బందులు ఏర్పడతాయని భావించిన దక్షిణాఫ్రికా ఆయనకు వీసా నిరాకరించింది.
వీసా నిరాకరించడంతో దలైలామా ప్రస్తుతానికి తన దక్షిణాఫ్రికా పర్యటన రద్దు చేసుకున్నారని ఆ దేశంలో దలైలామా ప్రతినిధి నాంగ్సా ఛోడన్ తెలిపారు. దలైలామాకు దక్షిణాఫ్రికా వీసా నిరాకరించడం గత ఐదేళ్లలో ఇది మూడోసారి. మరోవైపు దలైలామాకు అనుమతి నిరాకరిస్తే సదస్సును బహిష్కరించాలని పలువురు నోబెల్ శాంతి బహుమతి అవార్డు గ్రహీతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.