
'నా ఆరోగ్యం గురించి బెంగ వద్దు'
ధర్మశాల: తన ఆరోగ్యం గురించి ఎవరూ బెంగపెట్టుకోవద్దని టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. అయితే, సుదీర్ఘ పర్యటనల తర్వాత చాలా సమయం విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు అయనకు సూచించినట్లు వివరించారు
ఆధ్యాత్మిక గురువు త్వరలో చేయబోయే పర్యటనలు, కార్యాచరణ వివరాలు ఆయన అధికారిక వెబ్సైట్లో ఉంచిన విషయం విదితమే. శాస్త్రవేత్తలతో దక్షిణ భారతదేశంలోనిర్వహించనున్న సదస్సులో కూడా ఆయన పాల్గొనున్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న దలైలామా 3న ధర్మశాలకు విచ్చేయనున్న తరుణంలో ఈ విధంగా స్పందించారు.
గత పదేళ్లుగా హెల్త్ చెకప్ కోసం మయో ఆస్పత్రికి వస్తున్నానని చెప్పారు. ఇందులో పెద్ద విశేషమేం లేదని.. భారత్లోనూ న్యూఢిల్లీలో ఆరోగ్య పరీక్షల నిమిత్తం అప్పుడప్పుడూ డాక్టర్లను సంప్రదిస్తుంటానన్నారు. చిన్న చిన్న విషయాలపై కూడా శ్రద్ధ తీసుకోవాలని తన మిత్రుడు, జర్మనీ డాక్టర్ గతంలో తనకు సూచించిన విషయాన్ని దలైలామా ఈ సందర్భంగా గుర్తుచేశారు.