'షాక్.. సల్మాన్ ప్రేయసి కాదట.. ఫ్రెండేనట' | Iulia opens up on relationship with Salman and told they are friends | Sakshi
Sakshi News home page

'షాక్.. సల్మాన్ ప్రేయసి కాదట.. ఫ్రెండేనట'

Published Thu, Aug 25 2016 11:39 AM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM

'షాక్.. సల్మాన్ ప్రేయసి కాదట.. ఫ్రెండేనట'

'షాక్.. సల్మాన్ ప్రేయసి కాదట.. ఫ్రెండేనట'

ముంబయి: తమ మధ్య ఉన్న బంధాన్ని ఇప్పటికే వీధివీధిన కోడై కూస్తున్న మీడియాకు బాలీవుడ్ కండల వీరు, మోస్ట్ లేట్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ గర్ల్ ప్రెండ్, రొమేనియా సుందరి లులియా అవాక్కయ్యే విషయం చెప్పింది. వారిద్దరి మధ్య ఉంది ప్రేమ పూర్వక సంబంధం కాదంట. స్నేహ పూర్వక సంబంధమేనట. 'మేం స్నేహితులం ఎప్పటికీ స్నేహితులం అంతే. మా మధ్య ఇంకేం లేదు' అంటూ ఈ రొమేనియన్ బ్యూటీ నోరు విప్పింది.

ఓ మేగజిన్కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె 'మేం ప్రేమికులం కాదు.. స్నేహితులం. స్నేహితులు అంటే స్నేహితులమంతే. ప్రేమ కాదు. మీరు ఏవైతే వింటున్నారో అవన్నీ ఊహాగానాలే' అని ఆమె చెప్పేసింది. ఇటీవల సల్మాన్ ఖాన్, లులియా వంతూరు తో కలిసి 14వ బౌద్ధమత గురువును కలిశారు.  'ట్యూబ్ లైట్' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నఈ సూపర్ స్టార్ సల్మాన్ టిబెటన్ ఆధ్యాత్మిక బౌద్ధమత గురువు దలైలామాతో సమావేశ మయ్యారు. దాంతో ఇక సల్మాన్ ఈ రొమేనియా భామతో సెట్టయిపోయినట్లేనని మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పటికే అదే విషయం గురించి మాట్లాడుతుండగా అదేం లేదంటూ ఆమె వివరణ ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement