
'ఆయన వస్తే మాకు సంతోషం దూరం'
దలైలామాను రానివ్వద్దు
అమెరికా వర్సిటీలో చైనా విద్యార్థుల నిరసన
లాస్ ఏంజెలెస్: అమెరికాలోని కాలిఫోర్నియా శాన్‌డియాగో విశ్వవిద్యాలయంలో జరిగే ఓ వేడుకలో ప్రసంగించాల్సిందిగా బౌద్ధమత గురువు దలైలామాను వర్సిటీ యాజమాన్యం ఆహ్వానించడం వివాదాస్పదమైంది. జూన్‌లో జరిగే విద్యా సంవత్సర ప్రారంభ వేడుకలకు దలైలామా రావడాన్ని చైనా విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
దలైలామా తమ దేశాన్ని చీల్చి, ఐక్యతను దెబ్బతీయాలని చూస్తున్నారనీ, ఆయన వస్తే తమకు సంతోషం దూరం అవుతుందని చైనా విద్యార్థులు గట్టి నిరసన తెలుపుతున్నారు. మరోవైపు దలైలామాకు పంపిన ఆహ్వానంపై వెనక్కు తగ్గేది లేదని వర్సిటీ వర్గాలు స్పష్టం చేశాయి. వ్యక్తిగత స్వాతంత్య్రాన్ని తాము గౌరవిస్తామనీ, తన అభిప్రాయాలు చెప్పే హక్కు దలైలామాకు ఉందని విశ్వవిద్యాలయ అధికారులు పేర్కొన్నారు.