'భారత్ అందరికీ గురువు'
'ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేను చాలా ఏళ్లుగా మంచి మిత్రులం. ఆయనను కలిసిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో ప్రజల ఎన్నో సమస్యలతో ఆగ్రహాలతో, ఒత్తిడిలతో, చిరాకులతో ఉంటుంటారు. మద్యపానంపై నిషేదం విధించడం చాలా మంచి విషయం. అది ప్రజలకు మంచి చేస్తుంది. మద్యం తాగడం మంచిది కాదు. అది మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. ఇందులో నుంచి బయటపడాలంటే మనసుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. భారతదేశమంటేనే అందరికీ గురువు. మనందరం శిష్యులం. భారత్‌తో సంబంధాలు పెట్టుకున్నవారి మధ్య గురుశిష్య సంబంధమే ఉంటుంది' అని ఆయన మీడియాతో చెప్పారు. ఈ రోజుల్లో ప్రపంచ దేశాల్లోని శాస్త్రవేత్తలు కూడా భారతీయ పురాతన శాస్త్రాలను, తత్వశాస్త్రాన్ని తిరగేస్తున్నారని అన్నారు.