prohibition act
-
తాగు.. ఊగు.. జోగు... బాబు మార్కు ప్రగతి!
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విచ్చలవిడి వ్యాపారం సమాజానికి చేటు తెచ్చేలా కనిపిస్తోంది. రాష్ట్రం మొత్తమ్మీద ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ బెల్ట్‌షాపులు కనిపిస్తున్నాయని సమాచారం. ఇవి చాలవన్నట్టు వ్యాపారులు మద్యం డోర్ డెలివరీ కూడా మొదలుపెట్టారు. విజయవాడ పటమట ప్రాంతంలో ఒక షాపు యజమాని ఈ మేరకు కరపత్రాలు కూడా పంచారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి సంగతి ఏమోకానీ మద్యం ప్రోగ్రెస్ మాత్రం బాగా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం ప్రభుత్వం డబ్బులు దండుకోవడానికి ఉపయోగపడుతూంటే.. సామాన్యుడి జేబు, ఒళ్లూ రెండూ హూనమైపోతున్నాయి. ఏపీలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన కొత్త మద్యం విధానం ప్రజలకు మేలు చేసేదా? కీడు చేసేదా అన్న చర్చ సాగుతోంది. ప్రజలు తమకు అధికారమిస్తే మద్యం సరఫరా చేస్తామన్న ఎన్నికల హామీ ఇచ్చిన పార్టీ దేశం మొత్తమ్మీద ఒక్క తెలుగుదేశం మాత్రమే కావచ్చు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వ మద్యం విధానాన్ని తీవ్రంగా తప్పు పడుతూండేవారు. ధరలు ఎక్కువగా ఉన్నాయని, నాణ్యత లేని బ్రాండ్ల అమ్మకాలు జరుగుతున్నాయని అనేవారు. కూలీనాలీ చేసుకునే సామాన్యుడు సాయంకాలం ఒక పెగ్గు మందేసుకుంటామంటే ధరలు ఆకాశాన్ని అంటేలా చేశారని ధ్వజమెత్తేవారు. ఈ మాటలు, విమర్శలు అన్నీ ఒకప్పుడు మద్య నిషేధం కోసం ఉద్యమించిన తెలుగుదేశం పార్టీ నుంచి వస్తూండటం ఒక వైచిత్రి. ఏదైతేనేం.. బాబు గారి మాటలకు మందుబాబులు పడిపోయారు. ఎన్నికల్లో సుమారు పాతిక లక్షల మంది మందురాయుళ్లు టీడీపీ కూటమివైపు మొగ్గారని ఒక అంచనా. సామాన్యుడిని ఆర్థికంగా చిన్నాభిన్నం చేసే, సామాజికంగానూ అనేక రకాల సమస్యలు తెచ్చిపెట్టే మద్యం జనానికి దూరంగా ఉంచాలని గత ప్రభుత్వం ఆలోచించింది. ఇందుకు తగ్గట్టుగానే జనావాసాలకు దూరంగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. ప్రైవేట్ దుకాణాల వారు లాభాపేక్షతో పేదలను పిండుకుంటారన్న ఆలోచనతో సొంతంగా దుకాణాలు నడిపింది. నిర్ణీత వేళల్లో మాత్రమే మద్యం అందుబాటులో ఉంచేలా చేయడంతోపాటు ధరలు పెంచింది. బెల్ట్ షాపులు దాదాపుగా లేకుండా చేసింది. సామాజిక హితం కోసం చేపట్టిన ఈ చర్యలేవీ ఎల్లోమీడియాకు నచ్చలేదు. ఎప్పటికప్పుడు మద్యం విధానాన్ని విమర్శిస్తూ కథనాలు వండి వార్చేది. కానీ బెల్ట్‌షాపులున్నట్లు మాత్రం ప్రచారం చేయలేకపోయింది. ఈ వ్యతిరేక ప్రచారం ప్రభావంలో పడ్డ జనాలు జగన్‌పై వ్యతిరేకత పెంచుకుంటే.. చంద్రబాబు, పవన్, లోకేశ్ వంటివారు దానికి ఆజ్యం పోశారు. అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామని ప్రకటించారు. అయితే.. అధికారం వచ్చిన వెంటనే కూటమి నేతల వైఖరి పూర్తిగా మారిపోయింది. మద్యం ప్రియులకు ఇచ్చిన హామీలు గంగలో కలిసిపోయాయి. ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రైవేట్ పరమయ్యాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.రెండు లక్షలు వసూలు చేసి, లాటరీ వేసి మరీ కేటాయింపులు జరిపారు. ఈ లాటరీల ద్వారానే ప్రభుత్వానికి రూ.రెండు వేల కోట్లు వచ్చింది. కొంతమంది దుకాణాల కోసం ఎగబడి.. యాభై నుంచి వంద వరకూ దరఖాస్తులు వేసినట్లు సమాచారం. ఇలా రూ.కోటి వరకూ ఖర్చు పెట్టినా వారికి ఒకట్రెండు షాపులూ దక్కలేదు. లాటరీలో దుకాణం కేటాయింపు జరిగిన తరువాత లైసెన్స్ ఫీజు కింద కూటమి ప్రభుత్వం మళ్లీ బాదుడు మొదలుపెట్టింది. దీనికింద రూ.60 లక్షల వరకూ చెల్లించాల్సి వచ్చింది. ఇవి చాలవన్నట్లు కూటమి ఎమ్మెల్యేలకు షాపులలో వాటా లేదంటే ముడుపులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి. విశేషం ఏమిటంటే టీడీపీ వారే ఎక్కువ దుకాణాలు పొందినా సొంతపార్టీ వారికే లంచాలిచ్చుకోవాల్సిన పరిస్థితి. పోనీ ఇక్కడితో ఆగిందా? లేదు. ప్రభుత్వం ఎకాఎకిన మార్జిన్‌ను 20 నుంచి పది శాతానికి తగ్గించింది. షాపుల ఏర్పాటు, నిర్వహణలు అదనం. వీటన్నింటి కారణంగా మద్యం దుకాణాల ద్వారా నష్టాలే ఎక్కువ అవుతున్నాయని ఇప్పుడు దుకాణదారులు లబోదిబోమంటున్నారు. ఇది ఒక కోణం. టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఏర్పాటైన లిక్కర్ సిండికేట్లు మందుబాబులను పిండేస్తున్న వైనం ఇంకోటి. రాష్ట్రం నలుమూలల ఈ సిండికేట్ విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు తెరిచేసింది. కొన్నిచోట్ల ఆయా గ్రామాల నేతలే కొందరు వేలం ద్వారా బెల్ట్‌షాపులు ఇచ్చేస్తున్నారు. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం డి.కొత్తూరు గ్రామంలో జరిగిన బహిరంగ వేలంలో ఒక బెల్ట్ షాపు రూ.లక్ష ధర పలికిందని తెలిసింది. వైసీపీ వారు, మద్యం వ్యతిరేకులు బెల్ట్ షాపులను వ్యతిరేకించినా, టీడీపీ నేతల ఆధ్వర్యంలో వేలం పాటలు యధేచ్చగా సాగినట్లు సోషల్ మీడియా వీడియోల ద్వారా స్పష్టమవుతోంది. తణుకు వద్ద మద్యం సీసాలు సంతలో బల్ల మీద పెట్టుకుని తండ్రులు అమ్ముతుంటే వారి పిల్లలు అక్కడే కూర్చున్న వీడియో తీవ్ర కలకలం రేపింది. పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్ర హోం శాఖ మంత్రి మాత్రం బెల్ట్‌షాపులు అస్సలు లేనేలేవని అంటున్నారు. ఇంకోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్యం ధరలు పెంచి అమ్మినా, బెల్ట్ షాపులు పెట్టినా రూ.5 లక్షల వరకూ జరిమానా అంటూ బెదరగొడుతున్నారు కానీ.. ఆచరణలో ఇది ఏమాత్రం అమలు కావడం లేదు. రిజిస్ట్రేషన్ ఫీజులు, లైసెన్స్ ఫీజులు, మామూళ్లు, దుకాణాల ఏర్పాటు, నిర్వహణ వంటి అనేక ఖర్చులు ఉండటంతో తాము నష్టాలను పూడ్చుకునేందుకు అధిక ధరలకు మద్యం అమ్మాల్సి వస్తోందని దుకాణందారులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు రూ.99కే క్వార్టర్ మద్యం అందిస్తానని హామీ ఇచ్చినప్పటికీ వాస్తవానికి రూ.120 నుంచి రూ.130 వరకూ పెట్టాల్సి వస్తోందని మద్యం ప్రియులే చెబుతూండటం గమనార్హం. పైగా గత ప్రభుత్వంలో ఉన్న బ్రాండ్లే ఇప్పటికీ కొనసాగుతున్నాయని అదనంగా కొన్ని వచ్చి చేరాయని నాణ్యతలో ఏమీ తేడా లేదని వివరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తమను మోసం చేసిందని మందు తాగి మరీ చెబుతున్నారు.మద్యం అమ్మకాలు జరుగుతున్న తీరుపై ప్రజల నుంచి కూడా నిరసన వ్యక్తమవుతోంది. జనావాసాల మధ్య దుకాణాల ఏర్పాటును ప్రజలు పలుచోట్ల నిరసించారు. కానీ వారి గోడు పట్టించుకున్న వారు లేకపోయారు. గత ఏడాది మద్యం ద్వారా రూ.15 వేల కోట్ల ఆదాయం రాగా దాన్ని ఈ ఏడాది రూ.25 వేల కోట్లకు చేరుకుంటుందని ప్రభుత్వం తన బడ్జెట్లోనే పేర్కొంది. మద్యం ధరలు తగ్గించామని ఒకవైపు చెబుతున్న ప్రభుత్వం ఆదాయం ఎలా పెరుగుతోందంటే మాత్రం సమాధానం ఇవ్వడం లేదు. 201419 మధ్య కూడా చంద్రబాబు బెల్ట్ షాపులు రద్దు చేస్తున్నామని, చర్య తీసుకుంటామని పలుమార్లు చెప్పేవారు. కానీ 45 వేలకు పైగా బెల్ట్ షాపులు నడిచాయని ఒక అంచనా. అంతేకాదు. గోరుచుట్టపై రోకటిపోటు చందంగా ఇప్పుడు రాష్ట్రంలో గంజాయి గుప్పుమంటోంది. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి తోటల పెంపకం విస్తారంగా సాగిపోతోంది. ఈ మధ్య జరిగిన పోలీసుల దాడిలో 15 ఎకరాలలో గంజాయి పెంచుతున్నట్లు గుర్తించారు. నగర ప్రాంతాలలో కూడా గంజాయి విక్రయాలు పెరుగుతున్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందు కూటమి నేతలు చెప్పినదానికి, ఇప్పుడు జరుగుతున్నదానికి పూర్తిగా విరుద్దంగా పరిస్థితి నెలకొందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏపీని మద్యాంధ్ర ప్రదేశ్ గా మార్చారన్న ఆరోపణలు విరివిగా వినిపిస్తున్నాయి. ఏపీ సమాజం ఇదే కోరుకుంటోందా? కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తుపాకీ నియంత్రణకు కొత్త చట్టం
వాషింగ్టన్: అమెరికాలో తుపాకీ సంస్కృతికి చరమగీతం పాడేందుకు దేశాధ్యక్షుడు బైడెన్ కీలక చట్టం తెచ్చారు. అమెరికా అత్యున్నత అధకారమైన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఈచట్టం తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై శుక్రవారం సంతకం చేశారు. కొత్త చట్టం ప్రకారం లైసెన్స్‌లేని తుపాకులు, సీరియల్ నంబర్‌లేని తుపాకులు, 3డీ పద్ధతిలో ముద్రించిన తుపాకుల కట్టడి, నిషేధంపై ప్రధానంగా దృష్టిసారిస్తారు. సాధారణ గన్, పిస్టల్‌ను ఆటోమేటిక్ మెషీన్ గన్‌గా మార్చే యంత్రాలను నిషేధించేందుకు ప్రభుత్వానికి పూర్తి అధికారం దఖలు పడనుంది. మరికొద్ది వారాల్లో అధ్యక్షుడిగా పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వులపై బైడెన్ సంతకం చేయడం గమనార్హం. 3డీ ప్రింటెడ్ గన్లను స్కానింగ్ యంత్రాలు, మెటల్ డిటెక్టర్లు కూడా గుర్తించలేకపోతున్నాయని బైడెన్ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తంచేశారు. కొత్త చట్టంపై ముసాయిదా రూపకల్పన బాధ్యతలను 2023లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు అప్పగించడం తెల్సిందే. ఉత్తర్వులకు ముందు అప్పీల్ ఉత్తర్వులపై సంతకం చేయడానికి ముందు అధ్యక్షుడు బైడెన్ ‘ఎక్స్’లో ఓ పోస్ట్ చేశారు. ‘‘అమెరికాలో పిల్లల మరణాలకు వ్యాధులు, ప్రమాదాలకంటే తుపాకీ హింసే ప్రధాన కారణం. ఇది బాధాకరం. ఈ హింసను అంతం చేయడానికి నాతో, ఉపాధ్యక్షురాలు హారిస్‌తో చేతులు కలపండి. తుపాకీ హింసను అరికట్టేందుకు కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేస్తున్నా’’అని అన్నారు. ఆయుధాలను పూర్తిగా నిషేధించాలని ఇటీవలే బైడెన్ పిలుపునిచ్చారు. ఒక దేశంగా తుపాకీ హింసను అంగీకరించలేమన్నారు. దేశంలో తుపాకీ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా కాంగ్రెస్‌ను కోరారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి అమ్మకాలపై సమగ్ర తనిఖీలు, సమతుల్యత పాటించాలని పిలుపునిచ్చారు. ఈ చర్యలేవీ చనిపోయిన పిల్లలను తిరిగి తీసుకురాలేవని, అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే భవిష్యత్‌లో పిల్లల ప్రాణాలను కాపాడగలమని చెప్పారు. -
తగ్గిన నిషాచరులు
అమలాపురం టౌన్: మద్యం బ్రాండ్లు, ధరలు, అమ్మకాలు పెంచేసి తాగుబోతులు మరింత మత్తులో తూగేలా ప్రభుత్వం చేస్తోందని విమర్శించే ప్రతిపక్ష నేతల నోళ్లను మద్యం అమ్మకాల గణంకాలు మూయిస్తున్నాయి. దశలవారీ మద్య నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నిర్ణయాలు కూడా సత్ఫలితాలు ఇస్తున్న క్రమంలో వినియోగంలో తగ్గుదల కనిపిస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఏర్పాటయ్యాక అమలాపురంలోని ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ లిక్కర్ గొడౌన్ (డిపో) నుంచి 2022–23 సంవత్సరంలో జరిగిన మద్యం అమ్మకాలను పరిగణనలోకి తీసుకుంటే అమ్మకాలు పెరిగాయో తగ్గాయో తెలుస్తుంది. టీడీపీ ప్రభుత్వంలో 2018–19 సంవత్సరానికి సంబంధించి ఇదే అమలాపురం గొడౌన్ నుంచి సాగిన అమ్మకాలను 2022–23 సంవత్సరం గణంకాలతో పోల్చితే మద్యం అమ్మకాలు తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. ఇవీ లెక్కలు.. కోనసీమ వ్యాప్తంగా ఉన్న 97 దుకాణాలకు అమలాపురం లిక్కర్ గొడౌన్ నుంచి మద్యం సరఫరా అవుతుంది. ఈ గొడౌన్ నుంచి 1918–19 సంవత్సరంలో లిక్కర్ 10.33 లక్షల కేసులను దుకాణాలకు విక్రయించారు. 2022–23 సంవత్సరంలో ఇదే గొడౌన్ నుంచి 8.18 లక్షల కేసుల లిక్కర్ అమ్మకం సాగింది. 2018–19 సంవత్సరంలో ఈ గొడౌన్ నుంచి బీరు 6.77 లక్షల కేసులను దుకాణాలకు విక్రయించగా 2022–23 సంవత్సరంలో సగం కంటే లోపే అంటే కేవలం 2.30 లక్షల కేసుల బీరు విక్రయం అయింది. ఈ అధికారిక గణంకాలు లిక్కర్, బీరు వినియోగం ఏ మేరు తగ్గిందో స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 12.61 శాతం మేర తగ్గుముఖం అమలాపురం లిక్కర్ డిపో కోనసీమ వ్యాప్తంగా ఉన్న 97 మద్యం దుకాణాలకు సరఫరా చేస్తుంటే కొత్త జిల్లా ఏర్పాటయ్యాక జిల్లా పరిధిలోకి వచ్చే రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాలకు సంబంధించి ఉన్న 49 మద్యం దుకాణాలకు రాజమహేంద్రవరం లిక్కర్ గొడౌన్ నుంచి లిక్కర్, బీరు కేసులు సరఫరా అవుతున్నాయి. ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా 2018–19 సంవత్సరం పోల్చితే 2022–23 సంవత్సరంలో 20 నుంచి 25 శాతం వరకూ మద్యం వినియోగం తగ్గింది. గత నెల 21న విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన వివిధ ప్రభుత్వ శాఖల సమీక్షా సమావేశం కూడా 2018–19 సంవత్సరంతో పోల్చితే 2022–23 సంవత్సరంలో లిక్కరు, బీరు వినియోగం ఎంత మేర తగ్గిందో గణాంకాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్, బీరు వినియోగం 12.61 శాతం మేర తగ్గుముఖం పట్టినట్లు ఈ గణాంకాలు స్పష్టం చేశాయి. సత్ఫలితాలు ఇస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలు ఇదే సమయంలో రాష్టంలో మద్యం వినియోగాన్ని క్రమేపీ తగ్గిస్తూ మందుబాబుల ఆలోచనలో మార్పు తీసుకుని రావాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దశలవారీ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వంలో వీధివీధికి, సందు సందుకీ, గుడి బడి ఎక్కడ పడితే అక్కడ అధికారిక మద్యం దుకాణాలకు తోడు పుట్టగొడుగుల్లా వెలిసిన మద్యం బెల్ట్‌షాపులను ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే మూయించి వేసింది. ప్రభుత్వమే దుకాణాల సంఖ్యను తగ్గించి ఏర్పాటు చేసింది. వినియోగం తగ్గింది గతంలో పోల్చుకుంటే మద్యం వినియోగం కొంత తగ్గింది. ముఖ్యంగా 2018–19 సంవత్సరంతో పోల్చితే 2022–23 సంవత్సరంలో అమలాపురం లిక్కర్ డిపోలో వినియోగం తగ్గినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. – పొంగులేటి దశమంతరావు, -
'భారత్ అందరికీ గురువు'
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో మద్యపానం నిషేధాన్ని సమర్థనీయంగా అమలు చేస్తుండటం గర్వించదగిన విషయం అన్నారు. బుధవారం నితీశ్‌తో భేటీ అయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 'ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేను చాలా ఏళ్లుగా మంచి మిత్రులం. ఆయనను కలిసిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో ప్రజల ఎన్నో సమస్యలతో ఆగ్రహాలతో, ఒత్తిడిలతో, చిరాకులతో ఉంటుంటారు. మద్యపానంపై నిషేదం విధించడం చాలా మంచి విషయం. అది ప్రజలకు మంచి చేస్తుంది. మద్యం తాగడం మంచిది కాదు. అది మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. ఇందులో నుంచి బయటపడాలంటే మనసుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. భారతదేశమంటేనే అందరికీ గురువు. మనందరం శిష్యులం. భారత్‌తో సంబంధాలు పెట్టుకున్నవారి మధ్య గురుశిష్య సంబంధమే ఉంటుంది' అని ఆయన మీడియాతో చెప్పారు. ఈ రోజుల్లో ప్రపంచ దేశాల్లోని శాస్త్రవేత్తలు కూడా భారతీయ పురాతన శాస్త్రాలను, తత్వశాస్త్రాన్ని తిరగేస్తున్నారని అన్నారు. -
మానుతారా? లేక రాష్ట్రాన్ని వీడుతారా?
పట్నా: కఠిన మద్యపాన నిషేధ చట్టాన్ని వెనుకకు తీసుకునే ప్రసక్తే లేదని బిహార్ సీఎం నితీశ్‌కుమార్ స్పష్టం చేశారు. మద్యపాన నిషేధాన్ని బిహార్ ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందన్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. మద్యపాన నిషేధ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ‘మద్యం అలవాటును మానండి లేదా రాష్ట్రాన్ని వీడండి’ అంటూ ప్రజలకు తేల్చిచెప్పారు. మద్యపాన నిషేధ చట్టంలో పలు మార్పులు తెచ్చేందుకు ఈ నెల 22న నితీశ్‌కుమార్ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, మద్యపానంపై నిషేధం విధించడంతో రాష్ట్ర ముఖచిత్రమే మారిపోయిందని, రాష్ట్ర ప్రజలు దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు పొందారని పేర్కొన్నారు. ఇప్పటికైనా మద్యం అలవాటును మానుకోలేనివారు నిరభ్యంతరంగా రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోవచ్చునని పేర్కొన్నారు.