మానుతారా? లేక రాష్ట్రాన్ని వీడుతారా? | Quit drinking or leave state, says cm | Sakshi
Sakshi News home page

మానుతారా? లేక రాష్ట్రాన్ని వీడుతారా?

Published Sun, Nov 27 2016 12:08 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM

మానుతారా? లేక రాష్ట్రాన్ని వీడుతారా?

మానుతారా? లేక రాష్ట్రాన్ని వీడుతారా?

పట్నా: కఠిన మద్యపాన నిషేధ చట్టాన్ని వెనుకకు తీసుకునే ప్రసక్తే లేదని బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. మద్యపాన నిషేధాన్ని బిహార్‌ ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందన్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. మద్యపాన నిషేధ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ‘మద్యం అలవాటును మానండి లేదా రాష్ట్రాన్ని వీడండి’ అంటూ ప్రజలకు తేల్చిచెప్పారు.

మద్యపాన నిషేధ చట్టంలో పలు మార్పులు తెచ్చేందుకు ఈ నెల 22న నితీశ్‌కుమార్‌ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, మద్యపానంపై నిషేధం విధించడంతో రాష్ట్ర ముఖచిత్రమే మారిపోయిందని, రాష్ట్ర ప్రజలు దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు పొందారని పేర్కొన్నారు.  ఇప్పటికైనా మద్యం అలవాటును మానుకోలేనివారు నిరభ్యంతరంగా రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోవచ్చునని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement