తాను తయారు చేసిన కరోనా స్టీమ్ బూత్‌లో పవన్
సాక్షి, పలమనేరు: విధుల్లో ఉండేవారు కరోనా వైరస్ బారిన పడకుండా ‘కరోనా స్టీమ్ బూత్’ పేరిట ఓ యంత్రాన్ని రూపొందించాడు.. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరం గ్రామానికి చెందిన పవన్. చదివింది పదో తరగతే అయినా.. ఇప్పటికే పలు ప్రయోగాలు చేసి ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా అతడు తయారు చేసిన స్టీమ్ బూత్‌లోకి వెళితే నాలుగు నిమిషాల్లోనే శరీరమంతా శానిటైజేషన్ చేసుకోవచ్చు. దీంతో శరీరం, గొంతుతో సహా తల వెంట్రుకల్లో ఉండే వైరస్ మొత్తం నశిస్తుందని చెబుతున్నాడు. పబ్లిక్ టెలిఫోన్ బూత్‌లా ఉండే దీని తయారీకి కేవలం రూ.8 వేలు మాత్రమే ఖర్చు కావడం మరో విశేషం. వీటిని క్వారంటైన్ సెంటర్ల వద్ద లేదా ఎక్కువ జన సమూహాలుండే చోట అమర్చితే ఎంతో మేలుగా ఉంటుందని అంటున్నాడు పవన్.
Comments
Please login to add a commentAdd a comment